చెన్నై, ఆగస్టు 28: జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన ఓపెనర్ వీరేందర్ సెవాగ్ ఈ ఏడాది చివరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌పై కనే్నశాడు. మరో ఓపెనర్ గౌతం గంభీర్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇంగ్లీష్ కౌంటీ ఎసెక్స్‌లో శ్రమిస్తుండగా, ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో సెవాగ్ చెమటోడుస్తున్నాడు. ఒక వార్తా పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం సెవాగ్ చెన్నైలోని ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో ఫాస్ట్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన బ్యాటింగ్ టెక్నిక్స్‌ను పెంచుకునే ప్రయత్నంలో పడ్డాడు. ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఈసారి సెవాగ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడని సమాచారం. దక్షిణాఫ్రికాలో పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, అక్కడ భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడడం ఖాయం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, 34 ఏళ్ల సెవాగ్ వివిధ రకాలైన ఫాస్ట్ బౌలింగ్‌ను సమర్థంగా ఆడేందుకు నెట్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా ఓపెనర్లుగా ఇప్పటికే తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగా, మురళీ విజయ్ కూడా జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నాడు. అయితే, విజయ్‌కి జట్టులో అవకాశం అనుమానంగానే కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ పరాజయాన్ని ఎదుర్కోగా, ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులకే అవుటైన మురళీ రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. ఈ నేపథ్యంలోనే సెవాగ్ తన స్థానాన్ని మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్న పలువురు యువ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ, మెక్‌గ్రాత్ పర్యవేక్షణలో తన బ్యాటింగ్‌కు పదును పెట్టుకుంటున్నాడు. 2001 నవంబర్‌లో దక్షిణాఫ్రికాపై కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన సెవాగ్ 105 పరుగులతో రాణించాడు. అయితే, అక్టోబర్ 20వ తేదీన తన 35వ ఏట అడుగుపెడుతున్న సెవాగ్‌కు ఈసారి దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడే అవకాశం దక్కడం అనుమానంగానే ఉంది.
జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన ఓపెనర్ వీరేందర్ సెవాగ్
english title:
c
Date:
Thursday, August 29, 2013