హైదరాబాద్, ఆగస్టు 28: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్)లో హైదరాబాద్ హాట్‌షాట్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. బుధవారం పుణే పిస్టన్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మొదటి మూడు మ్యాచ్‌లను 3-0 తేడాతో గెల్చుకొని ఈ జట్టు పుణేను ఇంటిదారి పట్టించింది. వరుసగా మూడు మ్యాచ్‌లను కైవసం చేసుకోవడంతో చివరి రెండు మ్యాచ్‌లకు ప్రాధాన్యం లేకుండా పోయింది.
తొలి మ్యాచ్‌లో పుణే ఆటగాడు తియాన్ మిన్ గుయెన్‌ను ఢీకొన్న అజయ్ జయరామ్ 21-19, 21-8 తేడాతో ఓడించి హైదరాబాద్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తొలి సెట్‌లో అద్భుతంగా పోరాడిన గుయెన్ రెండో సెట్‌లో అదే స్థాయిలో రాణించలేక అజయ్ విజృంభణకు తల వంచాడు. రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ సైనా నెహ్వాల్, పుణే స్టార్ క్రీడాకారిణి జూలియన్ షెన్క్ తలపడ్డారు. ఈ టోర్నీలో అప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌లను గెల్చుకున్న సైనా చక్కటి ఫామ్‌ను ప్రదర్శిస్తుండగా, షెన్క్ మూడు విజయాలు, రెండు పరాజయాలతో నిలకడలేని ఆటను కొనసాగిస్తున్నది. కాగా తొలి సెట్‌ను సైనా 21-10 తేడాతో సొంతం చేసుకొని తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. అయితే, రెండో సెట్‌లో షెన్క్ ఎదురుదాడికి దిగి 21-19 తేడాతో గెలవడంతో మ్యాచ్ ఉత్కంఠ దశకు చేరింది. డిసైడర్‌లో సైనా అతి కష్టం మీద 11-8 ఆధిక్యంతో విజయం సాధించి, హైదరాబాద్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. మూడో మ్యాచ్‌లో గో షెమ్, లిమ్ కిమ్ వా పురుషుల డబుల్స్‌లో పుణే జోడీ జోచిమ్ ఫిషర్ నీల్సెన్, సనావే థామస్ జోడీతో తలపడింది. తొలి సెట్‌ను నీల్సెన్, థామస్ జోడీ 21-16 తేడాతో గెల్చుకుంది. రెండో సెట్ షెమ్, కిమ్ జోడీ 21-14 ఆధిక్యంతో గెల్చుకుంది. దీనితో చివరిదైన మూడో సెట్ అత్యంత కీలకంగా మారింది. ఆ సెట్‌ను 11-7 స్కోరుతో కైవసం చేసుకున్న షెమ్, కిమ్ హైదరాబాద్‌కు తిరుగులేని విధంగా 3-0 ఆధిక్యాన్ని అందించి ఫైనల్ చేర్చారు.
ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్)లో హైదరాబాద్ హాట్‌షాట్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.
english title:
i
Date:
Thursday, August 29, 2013