పరిశ్రమ గురించి ఇప్పటికి అర్థమైందట ప్రియాంకా చోప్రాకి. బాలీవుడ్లో గాడ్‌ఫాదర్ లేకుండా - ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ.. నిలదొక్కుకోవటం అంటే మాటలు కాదు. ఆమె నటించిన చిత్రాలన్నీ -ఏవో కొన్ని తప్ప- కమర్షియల్ హిట్సే. తాజాగా ‘జంజీర్’ ‘క్రిష్-3’ ‘గూండే’ ‘మేరీ కామ్ బయోపిక్’.. చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇండస్ట్రీ తీరుతెన్నుల గురించి అర్థం చేసుకోటానికి ఇన్నాళ్లు పట్టింది అంటోన్న ప్రియ - ఏ యాక్టింగ్ స్కూల్లోనూ చేరలేదు. బాలీవుడ్‌లోకి ఎలా ఎంటరవాలో తెలీదు. గాడ్ ఫాదర్ గానీ.. బాయ్‌ఫ్రెండ్ గానీ లేరు అని చెబుతోంది. ప్రియాంకకి థియేటర్ అనుభవం ఉంది. తల్లి గైనకాలజిస్ట్... తండ్రి డాక్టర్ అయినప్పటికీ.. థియేటర్ పట్ల ఆమె పెంచుకున్న మక్కువని చూసిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. దీంతో బాలీవుడ్లో నెం.1 స్థానాన్ని ఆక్రమించింది. ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మరి ఇప్పటికి అర్థం చేసుకున్న ప్రియ ఏ దిశగా అడుగులు వేస్తుందో చూద్దాం.
పరిశ్రమ గురించి ఇప్పటికి అర్థమైందట ప్రియాంకా చోప్రాకి.
english title:
i
Date:
Friday, August 30, 2013