కుర్రకారును వేడెక్కించే స్టేట్మెంట్లు ఇచ్చి మొత్తానికి ఒకటీ అరా చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న పూనం పాండేకు ఇప్పుడు చుక్కెదురవుతోంది. కొంతమందిని కొన్నిసార్లే మోసం చేయవచ్చు, అందరినీ ఎప్పుడూ మోసం చేయలేనని ఇప్పుడు పూనమ్ గుర్తించింది. ఎలా చూపించినా ‘నషా’ చిత్రం ఆమెకు మైనస్సే అయింది. ఇన్నాళ్ళూ చూపిస్తా.. చూపిస్తా అని దాచినదంతా ‘నషా’లో చూపించేసరికి వౌత్‌టాక్‌తో ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది. దీంతో ఇన్నాళ్ళూ ఎక్కిన పొగరు ‘నషా’ళానికి దిగిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘నషా’ చిత్రం ఫ్లాఫ్ అవడంతో అమ్మడికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైంది. ‘నషా’ చిత్రానికి ముందు అనేకమంది నిర్మాతల దగ్గర భారీగానే అడ్వాన్సులు పుచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వడానికి బాధపడుతోందట. దాదాపు కోటి రూపాయలు అడ్వాన్స్ రూపంలో తీసుకున్న ఈ భామ ఇప్పుడు కొన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాల్సిన ప్రాజెక్టులు కూడా వదిలివేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ‘నషా’ చిత్రం ఇచ్చిన కిక్‌తో ప్రకటనదారులందరూ వెనక్కి వెళ్లిపోతున్నారట. దీంతో చేతిలో సినిమాలు లేక అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వలేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది పూనమ్ పాండే. అడ్వాన్స్‌లు ఇచ్చినవారు ఊరుకోకుండా సాధ్యమైనంత త్వరగా తమ లెక్కలు తేల్చాలంటూ పూనమ్‌కి అల్టిమేటమ్‌లు జారీ చేస్తున్నారట. దీంతో బాలీవుడ్ మీడియా, టీవీ కథనాలు బోల్డు ప్రసారం అవుతున్నాయట. బాలీవుడ్ హాట్ మోడల్ కష్టాలు చూడండయ్యా అంటూ అనేక ఎపిసోడ్లు నిర్మించి పూనమ్‌ను మరికాస్త ప్రమోట్ చేస్తున్నారట. కిందపడ్డా తానే పైన ఉన్నానంటూ ఈ కథనాలన్నీ చూసి సంతోషపడుతోందట. ఏ సంతోషమైనా అడ్వాన్స్‌లు అడగనంతకాలం, సినిమా అవకాశాలు వచ్చినంతకాలమే ఉంటుంది. మొత్తానికి ప్రేక్షకులను పిచ్చివాళ్లను చేసి ఆడించిన పూనమ్‌కి తగిన శాస్తి జరిగిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
కుర్రకారును వేడెక్కించే స్టేట్మెంట్లు ఇచ్చి మొత్తానికి ఒకటీ అరా చిత్రాలను తన ఖాతాలో
english title:
t
Date:
Friday, August 30, 2013