బాలీవుడ్లో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయినట్లుగా తన కెరీర్ ప్రారంభించిన పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ పరిశ్రమ పట్ల చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదట. ‘జిస్మ్-2’ చిత్రం తరువాత రాగిణి ఎం.ఎం.ఎస్ చిత్రంలో ఆమె నటించింది. అయితే రాగిణి చిత్రానికి సీక్వెల్లో కూడా ఎంపికైంది. ఈ చిత్రంలో తనతోపాటు తన భర్త, మేనేజర్లుకూడా నటిస్తున్నారు. వాళ్ల పారితోషికాన్ని కూడా ముక్కుపిండి మరీ వసూలు చేస్తోందట. అంతేకాక తామందరూ మీ చిత్రం కోసం కష్టపడుతున్నాం కనుక పారితోషికాన్ని పెంచమంటూ నిర్మాత ఏక్తాకపూర్కు డిమాండ్ చేసిందట. దీంతో పారితోషికాన్ని పెంచడం తనవల్ల కాదని ఏక్తా చేతులెత్తేసిందట. ఇంత పెద్ద స్టార్నై ఉండి తనకు నచ్చిన పారితోషికాన్ని అందుకోలేకపోవడం అంటే తనను ఇండియా ఇంకా గుర్తించలేదనేకదా అర్థం అని వాపోతుంది. నన్ను గుర్తించని ఇక్కడ నేనుండి ఏం చేయాలి అని తెలిసినవారితో చెబుతోందట. ఈ సినిమా పూర్తయ్యాక సరైన అవకాశాలు వస్తే సరే, లేదంటే తిరిగి తన దేశానికి తానెళ్లి పాత పోర్న్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని చెబుతోందట. అంటే ఎక్కడ మొదలైతే చివర అక్కడే తేలాలని మనవాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా! సన్నిలీయోన్ అందుకు మినహాయింపేమీ కాదు!
ముంబై టాక్ - బిఎన్
english title:
b
Date:
Friday, August 30, 2013