పాత ఆల్బమ్ కనిపిస్తే - జ్ఞాపకాల దొంతరల్లోకి వెళ్లటం ఎవరికైనా సహజమే. ఐతే - మీరు అభిమానించే నటుడి ఫొటో ఆల్బమ్ కనిపిస్తే. ఇక మురిపెం కాక మరేముంటుంది? ‘మద్రాస్ కేఫ్’ దర్శకుడు షూజిద్ సర్కార్ నేతృత్వంలో రూపొందుతున్న ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌కి గాను అమితాబ్ పాత ఫొటో ఆల్బమ్‌ని చిత్రీకరించనున్నాట్ట. ‘బిగ్-బి’ చిన్ననాటి తీపి గురుతులతో పాటు.. అమితాబ్ తల్లిదండ్రుల ఫొటోలూ.. అమితాబ్ వంశీకుల చిత్ర కళాఖండాలూ.. ఎన్నింటినో చూడొచ్చు. అమితాబ్‌కి అత్యంత సన్నిహితులు తప్ప.. ఇంతవరకూ ఆయా ఫొటోలను ఎవరూ చూసి ఉండరు. అమితాబ్ చిన్నప్పటి ఫొటోలూ.. ఆడుకుంటున్న పోజులూ.. అభిషేక్ - శే్వత ఫొటోలు వీటిలో కనిపిస్తాయి. ఈ అడ్వర్టయిజ్‌మెంట్ కానె్సప్ట్ ‘ప్రజెంట్ టు పాస్ట్’. బిగ్-బి’ చరిత్రలో జరిగిన ఎన్నో అంశాలు ఈ ఫొటోలతో ముడిపడి ఉన్నాయి. వాటిని చూసి నేనెంతో ఆశ్చర్య పడ్డానంటున్నాడు షూజిత్. ఈ కానె్సప్ట్ అనుకొన్నప్పుడు అమితాబ్‌ని ఎలా సంప్రదించాలో తెలీలేదు. పాత ఫొటో ఆల్బమ్ చూపమంటే ఆయన ఏ విధంగా ఫీలవుతారో అనుకున్నా. కానీ కానె్సప్ట్ గురించి చెప్పింత్తర్వాత అమితాబ్ మొహంలో ఆనందం కనిపించింది. ఈ తీరుగా - అమితాబ్ అలనాటి చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయనిపించింది అంటూ ముక్తాయింపు పలికాడు.
ముంబై టాక్
english title:
a
Date:
Friday, August 30, 2013