హైదరాబాద్, ఆగస్టు 29: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకాన్ని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకుని లబ్ది పొందాలని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి యం.ముఖేష్‌గౌడ్ అన్నారు. మంగల్‌హాట్ డివిజన్‌కు దీపం పథకం కింద మంజూరైన రూ. 10లక్షల విలువైన వెయ్యి గ్యాస్ కనెక్షన్లను ఆయన లబ్దిదారులకు అందజేశారు. అంతేగాక, అదే డివిజన్‌లోని గుఫానగర్‌లో సుమారు రూ. 3లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన వాటర్ పైప్‌లైన్, రెండున్నర లక్షల వ్యయంతో స్టాటిక్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ముఖేష్‌గౌడ్ మాట్లాడుతూ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో రెండు దశలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రజలనుంచి స్వీకరించిన దీపం దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మంజూరీ తెచ్చుకున్నట్లు వివరించారు. దీంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో విభేధాలకతీతంగా ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి విక్రమ్‌గౌడ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్వీ గిరి, మంగల్‌హట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేదర్‌సింగ్‌తో పాటు నేతలు జితేందర్‌సింగ్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజ్‌కుమార్‌సింగ్, సదానంద్‌గుప్తా, ప్రకాశ్‌సింగ్‌లు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకాన్ని
english title:
d
Date:
Friday, August 30, 2013