Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చిన్న వర్షాలకే జలమయం

$
0
0

హైదరాబాద్, ఆగస్టు 29: మహానగరంలో గురువారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఫలితంగా వాహనదారుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా పంజాగుట్ట, ఖైరతాబాద్, రాణిగంజ్, ప్యాట్నీ, బషీర్‌బాగ్, ఎం.జె.మార్కెట్ తదితర చౌరస్తాల్లో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. దీంతో పాటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట, సికింద్రాబాద్, కర్మాన్‌ఘాట్, చంచల్‌గూడ, బాలానగర్, ఉప్పల్, రామంతాపూర్‌తో పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక వాటర్ స్టాగినేషన్ పాయింట్ల వద్ధ నీరు సక్రమంగా ప్రవహించేందుకు చర్యలు చేపట్టామని బల్దియా అధికారులు చెబుతున్నా, లక్డీకాపూల్, ఎసి గార్డ్స్, రాణిగంజ్ చౌరస్తా, బైబిల్‌హౌజ్ చౌరస్తాలు చాలా సేపు చిన్నసైజు చెరువును తలపింపజేశాయి. సికింద్రాబాద్ సంగీత్ ధియేటర్ వద్ధ ఓ చెట్టు నేలకొరిగింది. స్థానికుల సమాచారం మేరకు జిహెచ్‌ఎంసి అత్యవసర బృందం రంగంలో దిగి చెట్టు కొమ్మలను తొలగించింది. దీనికి తోడు గత మాసం నగరంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి కారణంగా పూర్తిగా దెబ్బతిన్న రోడ్లతో బుధవారం వర్షం కురుస్తున్నపుడు వాహనదారులు మరిన్ని ఇబ్బందులెదుర్కొవల్సి వచ్చింది.
ఇళ్లలోకి చేరిన వర్షం
కీసర: కీసరలో గురువారం కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగి వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. శివాజీనగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక మురుగునీరు పొంగి ఇళ్లలోకి చేరింది. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరారు.

కార్టిలేజ్ పునరుత్పత్తిపై ముగిసిన వర్క్‌షాప్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 29: కార్టిలేజ్ పునరుత్పత్తి వినూత్న విధానం’ ఆర్థోపెడిక్‌లో సంచలన విధానం- కార్టిలేజ్ లోపాల్ని తొలగించటానికి దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మెడిసిటీ ఆస్పత్రి మొట్టమొదటి సారిగా నిర్వహించిన వర్క్‌షాప్ ముగిసింది. వర్క్‌షాప్‌కు హజరైన యుకె కి చెందిన ప్రొ.ఎ.ఎ.శెట్టి, సౌత్ కొరియాకు చెందిన ప్రొ.సియోక్‌జింగ్‌లు సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌లో ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రొ.శెట్టి, మెడిసిటీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ డా.కె.కృష్ణయ్య, ఆర్థోసర్జన్ డా. సంజయ్‌లు మాట్లాడుతూ రోగుల మూలకణాలతోనే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను మార్చే ఆత్యాధునిక శస్తచ్రికిత్సగా వారు వివరించారు. డేకేర్ పద్దతి ద్వారా సన్నటి రంధ్రం ద్వారా ఈ చికిత్సను నిర్వహిస్తారని, దీని వల్ల రక్తస్రవం కూడా ఎక్కువ జరిగే అవకాశం లేదని వివరించారు. సాధారణంగా ఇలాంటి శస్తచ్రికిత్స చేసుకుంటే గతంలో నెలల పాటు ఉండాల్సిన అవసరముండగా, ప్రస్తుతం ఈ ఆధునిక శస్తచ్రికిత్సతో కేవలం మూడురోజులు మాత్రమే ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని వివరించారు. మన రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఇలాంటి వినూత్న శస్తచ్రికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మెడిసిటీ అందిస్తున్న వైద్య సేవల్లో ఇది వినూత్న చికిత్స, మరో కొత్త అధ్యాయనమని వ్యాఖ్యానించారు.

-- ఖైరతాబాద్ మహాగణపతికి --
నాలుగు వేల కిలోల తాపేశ్వరం లడ్డూ
మండపేట, ఆగస్టు 29: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతికి ఈ ఏడాది నాలుగు వేల కిలోల మహాలడ్డూను ప్రసాదంగా సమర్పించుకోనున్నామని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు (మల్లిబాబు) తెలిపారు. గురువారం మల్లిబాబు విలేఖరులతో మాట్లాడుతూ ఒకవైపు శ్రీరామ పట్ట్భాషేకం... మరోవైపు భువనేశ్వరీదేవిని లడ్డూపై అమరుస్తున్నామన్నారు. ఈ నెల 31న ఉదయం 7 గంటలకు గణేష్ ప్రతిష్ఠ చేయనున్నామన్నారు. అలాగే సుమారు 16 మందితో గణేష్ మాలధారణ చేసి సెప్టెంబర్ 4న మహాలడ్డూకు సంబంధించి బూందీ తయారీ ప్రారంభిస్తామన్నారు. సెప్టెంబర్ 6తో మహాలడ్డూ తయారీ పూర్తవుతుందని, 7న అలంకరణ పూర్తిచేస్తామన్నారు. పూర్తయిన లడ్డూను భారీ వాహనంలో 8న ఖైరతాబాద్‌కు పంపిస్తున్నట్టు ఆయన చెప్పారు. లడ్డూ తయారీకి పంచదార 1600 కిలోలు, శనగపప్పు 1000 కిలోలు, నెయ్యి 900 కిలోలు, జీడిపప్పు 200 కిలోలు, బాదంపుప్పు 100 కిలోలు, యాలకులు 50 కిలోలు, పచ్చకర్పూరం 10 కిలోలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. మహాలడ్డూ తయారీకి సుమారు రూ.8 లక్షల నుండి రూ.12 లక్షలు ఖర్చవుతుందన్నారు. 2010లో ఉచితంగా ఖైరతాబాద్ వినాయకునికి 500 కేజీల లడ్డూతో ప్రారంభించిన తాము 2011లో 2,400, 2012లో 3,500 కిలోల లడ్డూ సమర్పించుకున్నామన్నారు.

బాటిల్ కల్లు కోసం హత్య
హైదరాబాద్, ఆగస్టు 29: ఒక కల్లు బాటిల్ కోసం 17 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అందుకు నిరాకరించడంతో అతనిపై దాడి చేసి హత్య చేసిన సంఘటన చార్‌మీనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన మీరాలం ట్యాంక్ సమీపంలో ఉన్న ప్రీమియర్ ప్లాస్టక్ పరిశ్రమ వద్ద అల్త్ఫా అహ్మద్, సయ్యద్ హుషేన్ కలసి మహ్మద్ షాదిక్‌ను ఒక కల్లు బాటిల్ కోసం 17 రూపాయలు డిమాండ్ చేశారు. అందటు మహ్మద్ షాదిక్ నిరాకరించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి గొడవ నేపథ్యంలో మహ్మద్ షాదిక్‌పై దాడి చేయడంతో పాటు కత్తితో పొడి చంపినట్లు పోలీస్ విచారుణలో బయటపడింది. వీరిని గురువారం అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. సౌత్ జోన్ అదనపు డిసిపి తరణ్‌జోషి కేసు దర్యాప్తు చేశారు.

తెలుగు భాషోద్యమానికి గిడుగు చేసిన సేవలు చిరస్మరణీయం
నల్లకుంట, ఆగస్టు 29: తెలుగు భాషను వ్యవహారికంలో తీసుకు రావడానికి ఆరోజుల్లోనే గిడుగు రామమూర్తి పంతులు ఎనలేని సేవలందించాడని, వాడవాడలా తెలుగు భాషోద్యమానికి ఆయన కంకణం కట్టాడని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పూర్వ సలహాదారుడు డా.కెవి రమణాచారి అన్నారు. శ్రీ వేదగిరి కమ్యూనికేషన్, తెలుగు భాషోద్యమ సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గిడుగు వేంకట రామమూర్తి 150వ జయంత్యుత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డా.కెవి రమణాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ ప్రపంచతెలుగు మహాసభలు నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు భాష పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారని, ఐతే మహాసభలలో చేసిన తీర్మానాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతున్నందుకు ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాష దినోత్సవాన్ని ప్రభుత్వం జరిపినా జరపకపోయినా భాష పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలకే ప్రజలకు విశ్వసనీయత ఉంటుందన్నారు. ప్రముఖ కవి విహారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేదగిరి రాంబాబు గిడుగు వ్యక్తిత్వంపై, ప్రొ.జయధీర్ తిరుమలరావు, గిడుగు భాషా దృక్పథం-విస్తృతి, పరిమితులపై, ఎస్వీ సత్యనారాయణ గిడుగు-తొలి తెలుగు భాషాశాస్తవ్రేత్త అనే అంశంపై, గిడుగు-సవరభాష సేవపై అల్లంశెట్టి చంద్రశేఖర రావు, నేటి తెలుగు భాషోద్యమం-వారసత్వంపై సామల రమేష్‌బాబు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా గిడుగు మునిమనవలు గిడుగు వేంకట రామకృష్ణారావు, గిడుగు వేంకట నాగేశ్వరరావులకు అతిథులు ఘనంగా సత్కరించారు.

మహానగరంలో గురువారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది.
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>