హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, ఆగస్టు 29: ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌లో సంభవించిన జంట పేలుళ్ల ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే! అంతేగాక, అంతకు ముందుకు లుంబినీపార్కు, కోఠిలోని గోకుల్ చాట్‌బండార్‌లలో కూడా జంట పేలుళ్ల కేసుల్లో భత్కల్ ప్రధాన నిందితుడు. అంతేగాక, ఈ పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాయిద్ధీన్ సంస్థ వ్యవస్థాపకుడిగా కూడా పోలీసులు నిర్థారించారు. ముఖ్యంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలన్న లక్ష్యంతో గతంలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తూ ఇండియన్ ముజాయిద్ధీన్ అనే ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి నగరంలోని గాక, దేశంలోని అహ్మదాబాద్, పూణెలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. అయితే నగరంలో ఇప్పటి వరకు రెండుసార్లు సంభవించిన రెండు జంట పేలుళ్ల నిందితుడ్ని కర్ణాటక, ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో జాయింట్ ఆపరేషన్ చేసి అదుపులోకి తీసుకోవటంతో నగరంలో పోలీసులు మరింత అప్రమత్తమైనట్లు సమాచారం. ముఖ్యంగా ఈ రెండు జంట పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల, క్షతగాత్రులై నేటికీ కోలుకోని పరిస్థితుల్లో ఉన్నవారు ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) యాసీన్ భత్కల్‌ను అదుపులోకి తీసుకున్నా, అతన్ని ఎక్కడికి తరలించాలన్నదానిపై జాతీయ స్థాయి నిఘా సంస్థలు ఆచితూచి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్ వరుస పేలుళ్లకు ముందు యాసీన్ భత్కల్‌తో పాటు మరో అయిదుగురు ఉగ్రవాదులు నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు కోఠి, బేగంబజార్, పంజాగుట్ట, రాణిగంజ్, కెపిహెచ్‌బి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం తెలుసుకున్న ప్రాంతాలు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేయగా, భత్కల్ అరెస్టుతో అతని సహచరులెవరైనా ఆయా ప్రాంతాల్లో తిష్టవేశారా? అన్న విషయంపై నగర పోలీసులు దృష్టి సారించారు. భత్కల్ అరెస్టుతో నగరంలో తిష్టవేసిన అతని సహచరులు నగరాన్ని విడిచి వెళ్లే అవకాశాలున్నందున, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లతో పాటు విమానాశ్రయంలో కూడా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
గతంలో ఉగ్రవాది భత్కల్ అతని సహచరులు రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో ఇదివరకే ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ఫుటేజీలను పోలీసులు ఎప్పటికపుడు పరిశీలిస్తున్నారు. అయితే దిల్‌సుఖ్‌నగర్‌లో యాసీన్ భత్కల్‌తో పాటు బాంబులు పెట్టిన మరో అయిదుగురు ఉగ్రవాదులు కలిసి రెండు ప్రాంతాల్లో రెండు చోట్ల సైకిళ్లకు బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడినట్లు స్థానికంగా లభ్యమైన ఫుటేజీలు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు బాగానే సహకరించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఫుటేజీల్లో బాంబులున్న సైకిళ్లను ఒక చోట పార్కింగ్ చేస్తున్న వ్యక్తి కదలికలు భత్కల్ మాదిరిగా ఉండటాన్ని జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు నగర పోలీసులు బలగాలు అనుమానించటం వల్లే పేలుళ్లు జరిగిన ఏడు నెల వ్యవధిలో ప్రధాన నిందితుడ్ని అదుపులోకి తీసుకోవటం విశేషం.
* ఎట్టకేలకు చిక్కిన దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్ల ప్రధాన నిందితుడు * సహచరుల కోసం నిఘావర్గాల ఆరా * నకిలీ కరెన్సీ చెలామణి చేసిన భత్కల్ ముఠా
english title:
b
Date:
Friday, August 30, 2013