దీప నిర్వాణ గంధం డా.లంకా శివరామప్రసాద్, వెల:రూ.250,
పబ్లిషర్స్:
డా.లంకా శివరామప్రసాద్, సృజన లోకమ్,
ప్రశాంతి హాస్పిటల్,
శివనగర్,
వరంగల్-506002
ఈ పుస్తకంలోని అంశాలన్నీ ‘మృత్యువు’ కు సంబంధించినవి. రచయిత గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయటంలో ఉన్న అనుభవం కారణంగా తనకు కలిగిన రకరకాల ఆలోచనలకు పుస్తక రూపం ఇచ్చారు. కేవలం ఊహలే కాకుండా శాస్ర్తియ విశే్లషణలు కూడా ఉన్నాయి. పుస్తకం మొదటి అధ్యాయమంతా మరణమంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? మొదలైన ప్రశ్నలకు సమాధానాలున్నాయి. వివిధ దేశాల చరిత్ర నుండి విచిత్రమైన మరణాల గురించిన ప్రస్తావన ఉంది. రెండవ అధ్యాయమంతా ఆత్మహత్యల వృత్తాంతంతో నిండి ఉంది. ప్రపంచ దేశాలలో చరిత్రలో జరిగిన విచిత్రమైన ఆత్మహత్యల గురించిన సమాచారం ఇందులో ఉంది. పాశ్చాత్య దేశాల కవులు ‘మరణం’ గురించి ఆంగ్లంలో రాసిన 52 కవితలకు అనువాదం మూడవ అధ్యాయంలో ఉంది. మరణం గురించిన వేదాంతం నాలుగవ అధ్యాయంలో ఉంది.