Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అక్షరం సంతోషానికి సంకేతం

$
0
0

J ఈ అక్షరం వర్ణమాలలో 10వ అక్షరం. ఈ అక్షరం చూపుడు వేలు ఆకాశం వైపు చూపుతున్నట్లుగా ఉంటుంది. అందువలన ఈ అక్షరం దివ్యశక్తిని కలిగిస్తుంది. ఈ అక్షరంలో పేరు ప్రారంభమయ్యే వారు నాయకులుగా ఎదుగుతారు. వీరికి మంచి పరిపాలనా దక్షత, కార్యనిర్వహణ సామర్థ్యం ఉంటాయి. ఈ అక్షరం కలవారు నూతనమైన, అచ్చమైన ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. వీరు సృజనాత్మకత కలిగి, రచనలు, పెయింటింగ్ లాంటి వాటిలో మంచి ప్రవేశం కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితులనైనా, అన్ని కోణాల నుండి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. చ’ అంటే జస్టిస్ కాబట్టి, వీరు ధర్మం, న్యాయం తప్పనివారుగా ఉంటారు. గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి, ఇతరుల నుండి సలహాలు తీసుకోడానికి ఇష్టపడరు. ఇతరుల జోక్యాన్ని సహించరు. ఉన్నత ఆశయాల కోసం కష్టాలు ఎదురైనా శ్రమించి పని చేస్తారు. విజయం సాధిస్తారు. ఈ అక్షరం ‘గాలం’లా ఉంటుంది. ఎడమవైపు వంగి ఉండటం అనేది, గతాన్ని సూచిస్తుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేవారు గొప్ప రచయితలుగా, రాజకీయ నాయకులుగా, సినీ కళాకారులుగా రాణిస్తారు. ఈ అక్షరం పేరులో ఉంటే, వారు తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉదా: చిరంజీవి, అంజయ్య, జనార్దనరెడ్డి. కానీ వీరు వీరి అనుచరులను ఎన్నుకునేటపుడు జాగరూకులుగా ఉండాలి. వీరికి అనేక విషయాల పట్ల ఆసక్తి ఉండటం వలన వీరి దృష్టిని సులభంగా మళ్లించవచ్చు. *

ప్రశ్న - జవాబు

ప్రశ్న: నా పేరు Denish. నా పుట్టిన రోజు 26.8.1970. నాకు అందరితో గొడవలు ఏర్పడుతున్నాయి. నన్ను ఎవరూ అర్థం చేసుకోరు. నా పేరులో ఏదైనా మార్పు చేసుకోవాలా?
జ: మీ డేటాఫ్ బర్త్ 26. ఇది శనికి సంబంధించిన నంబర్. మీ డెస్టినీ నంబర్ 33. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య. ఇవి రెండూ ఒకదానికి ఒకటి మిత్ర సంఖ్యలు. మీ డేటాఫ్ బర్త్ నంబర్ 26 కావడంతో మీరు నిక్కచ్చిగా మాట్లాడతారు. మీ పేరులో ‘డీ’ అనే అర్థం వస్తుంది కాబట్టి అందరితో ఢీకొట్టే మనస్తత్వం ఉంటుంది. అదీగాక ‘డి’ అని పేరున్నవారు చాలా మంది కాస్త వివాదాస్పదంగా ఉంటారు. అందుకే మిమ్మల్ని చాలామంది దూరం చేసుకుంటుంటారు. మీ పేరును పలికే సమయంలో నెగెటివ్ మీనింగ్ రాకుండా కొత్త పేరు పెట్టుకొని పిలిపించుకోండి. మీ జీవితంలో సమస్యలు తగ్గుతాయి.
ప్రశ్న: నా పేరు Y.RamaRao నన్ను Ranga Rao అని ఫిలుస్తారు. నా పుట్టిన తేదీ 22.10.1947. నేను ఏ పని చేసినా కలిసి రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాను. నాకు ఏదైనా దారి చూపండి.
జ: మీ పుట్టిన తేదీ 22. దీనిని న్యూమరాలజీలో మాస్టర్ నంబర్ అంటారు. ఇది రాహు సంబంధమైనది. మీ డెస్టినీ నంబర్ 26. ఇది శని సంబంధమైన సంఖ్య. మిమ్మల్ని పిలిచే పేరు Ranga Rao. ధీని పేరు వైబ్రేషన్ 22 వస్తుంది. న్యూమరాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్. ఎవరి పేరైనా వారి పుట్టిన తేదీతో సంబంధించిన సంఖ్యలోనే పేరు వస్తుంది. ఈ 22 సంఖ్యగల పేరు వల్ల అంతగా అభివృద్ధి ఉండదు. కాని మీ పేరు గ అక్షరంతో మొదలవడం వల్ల కొంత వరకు మీ పరిస్థితి మెరుగుగా ఉండాలి. సినీ యాక్టర్ Ranga Rao గారికి కూఢా ఎంతో టాలెంట్ ఉన్నా ఆయనకు ప్రభుత్వం తరఫున బిరుదులు రాలేదు. పేరులోని వైబ్రేషన్ బాగుంటే సకలం సమకూరుతుంటాయి. అందువల్ల మీ పేరులో ఇంకొక G చేర్చి Rangga Rao అని 120 సార్లు 120 రోజులు రాసుకోంఢి. తొందరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీ లక్కీ నంబర్లు 1,5,6. అన్ లక్కీ నంబర్లు 9. లక్కీ కలర్స్: ఎల్లో, క్రీమ్, గోల్డెన్, లక్కీ డేట్స్: ఆదివారం, గురువారం, శనివారం. *

చిరునామా: మొహమ్మద్ దావూద్
8-3-825/5/3/6/3, సుభాష్ నగర్, యల్లారెడ్డిగూడ, హైదరాబాద్.

లైఫ్ నంబర్
english title: 
a
author: 
మొహమ్మద్ దావూద్ -9618090786-

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>