హైదరాబాద్, ఆగస్టు 31:జంటనగరాల్లో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఆంక్షలను అమలు చేస్తున్నామని జంటనగరాల పోలీస్ కమిషనర్లు అనురాగశర్మ, సివి ఆనంద్ ప్రకటించారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనల్లో వారు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 8వ తేదీ వరకు సైబరాబాద్ పరిధిలో పోలీస్ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని సైబరాబాద్ కమిషనర్ హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ పరిదిలో కూడా పోలీస్ అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, రాస్తారోకో, ధర్నాలు, మైకుల ప్రచారం, నిరసనలు, నినాదాలు, ఆయుధాలతో సంచరించడం తగదన్నారు.
జంటనగరాల్లో పోలీసుల అనుమతి లేకుండా
english title:
j
Date:
Sunday, September 1, 2013