హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, ఆగస్టు 31: భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేస్తున్న ఆధార్ కార్డు లింకుతో నేటి నుంచి నగదు బదిలీ పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. నిన్నమొన్నటి వరకు గ్యాస్ ఎజెన్సీ, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ కార్డులను లింకు చేసిన లబ్దిదారులకు సబ్సిడీ ధరకే సిలెండర్లను అందచేసిన వివిధ ఎజెన్సీలు ఇకపై ఆధార్ లింకు లేనిదే సబ్సిడీ సిలెండర్లను సరఫరా చేసే అవకాశం లేదు.
అయితే నగదు బదిలీ పథకం అమలు తొలి రోజైన ఆదివారం గ్యాస్ వినియోగదారులకు, ఆధార్ కార్డుదారులకు అందుబాటులో ఉండేందుకు బ్యాంక్‌లు, గ్యాస్ ఎజెన్సీలు ఆదివారం కూడా పనిచేయనున్నట్లు తెలిసింది. కొత్తగా లింకు చేయించుకునే వినియోగదారుల సౌకర్యం కోసం ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం డొమెస్టిక్ 12లక్షల 15వేల 118 గ్యాస్ కనెక్షన్లుండగా, వీటిలో లక్షా 58వేల 529 మంది వినియోగదారులు దీపం పథకం కింద ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 8లక్షల 15వేల 092 మంది వినియోగదారులు పేరుగాంచిన, ప్రభుత్వం గుర్తించిన మూడు గ్యాస్ ఎజెన్సీల్లో ఉన్నారు. కాగా, మొత్తం వినియోగదారుల్లో సుమారు 4లక్షల 72వేల 144 మంది మాత్రమే బ్యాంకు ఖాతాలు, గ్యాస్ ఏజెన్సీలకు ఆధార్‌లను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే మిగిలిన ఇప్పటి వరకు అయిన లింకు ప్రక్రియలో ఎక్కువ శాతం ఎజెన్సీల్లో పూర్తయినా, ఇంకా బ్యాంకుల్లో మిగిలి ఉన్నందునే ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నట్లు తెలిపారు. నగదు బదిలీ పథకం కింద సబ్సిడీ సిలెండర్ల అమలుకు మరికొంత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు తెలిసింది. ఇందుకు సానుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.
* పనిచేయనున్న బ్యాంక్‌లు, గ్యాస్ ఏజెన్సీలు
english title:
p
Date:
Sunday, September 1, 2013