హైదరాబాద్, ఆగస్టు 31: ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, రూపాయి విలువ పతనంతో బేజారవుతున్న మహానగర వాసులపై మరో పిడుగు పడింది. ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరను పెంచటంతో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా పెట్రోలు వాహనదారులపై మరింత భారం పడింది. లీటరు పెట్రోలుకు రూ. 2.35 పైసలు పెంచగా, అలాగే డీజిల్ లీటరుకు రూ. 50పైసల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంచిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నట్లు కూడా స్పష్టం చేసింది. రూపాయి విలువ గణనీయంగా పతనం కావటంతో చమురు ధరలు పెరిగినందుకే పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో శనివారం రాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పెట్రోలు బంకుల వద్ద పాతధరకే పెట్రోలు, డీజిల్‌లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు క్యూ కట్టారు. కొన్ని ప్రాంతాల్లోని పెట్రోలు బంకుల నిర్వాహకులు కృత్రిమ కొరతను సృష్టించి, అర్థరాత్రి నుంచి ఎక్కువ ధరకు విక్రయించుకునేందుకు యత్నించారు. మరికొన్ని చోట్ల స్టాక్ లేదని వ్యాఖ్యానించిన బంకుల నిర్వాహకులు వాహనదారులు నిలదీశారు.
ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు,
english title:
m
Date:
Sunday, September 1, 2013