హైదరాబాద్, ఆగస్టు 31: నగరంలో రోజురోజుకి ప్రబలిపోతున్న వ్యాధుల బారిన పడకుండా గ్రేటర్ ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలు వంటి అంశాల పట్ల వారిని చైతన్యవంతులను చేసేందుకు గాను సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రత్యేక అరోగ్య, అవగాహన శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా వైద్యారోగ్యశాఖ సంయుక్త్ధ్వార్యంలో నిర్వహించనున్న ఈ శిబిరాలు సెప్టెంబర్ 13 వరకు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 18 సర్కిళ్లలో ఎంపిక చేసుకున్న మురికివాడల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పదిరోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌గా నిర్వహించనున్న ఈ శిబిరాల్లో 180 మురికివాడలను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో వ్యాధి నివారణ చర్యలు, వ్యాధి నిర్థారణ, చికిత్సలతో పాటు రక్తనమూనాల సేకరణ, అంటువ్యాధుల బారిన పడుకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అయితే ఈ శిబిరాలకు సంబంధించి ఇప్పటికే సర్కిళ్ల వారీగా శిబిరాల నిర్వహణ షెడ్యూల్డ్‌ను సర్కిల్ అధికారులకు కూడా పంపినట్లు ఆయన వివరించారు. ఆయా మురికివాడల్లో నిర్వహించనున్న ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని అంటువ్యాధులైన మలేరియా, డెంగీ, అతిసార, టైఫాయిడ్, డిఫ్తీరియా, కలరా, హైపటెటిస్ వంటి వ్యాధుల బారిన పడరాదని ఆయన సూచించారు.
ఎవరెవరికి ఏ బాధ్యతలు
వ్యాధి నివారణే లక్ష్యంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ఆరోగ్య, అవగాహన శిబిరాలతో పాటు బల్దియా కమిషనర్ వివిధ అధికారులకు పలు విధులను కేటాయించారు. శిబిరాల నిర్వహణ, వ్యాధుల నిర్థారణ బాధ్యతలను జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోకి వచ్చే స్థానిక హెల్త్ సెంటర్లకు చెందిన సిబ్బందితో పాటు సర్కిల్ అసిస్టెంటు మెడికల్, హెల్త్ ఆఫీసర్లకు అప్పగించారు. అలాగే అలాగే దోమలను గుడ్డు దశలోనే నియంత్రించేందుకు గాను యాంటీ లార్వా ఆపరేషన్ బాధ్యతలను అసిస్టెంటు ఎంటమాలజీ అధికారులకు అప్పగించారు.
శానిటేషన్ బాధ్యతలను అసిస్టెంటు హెల్త్, మెడికల్ అధికారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అసత్యప్రచారాన్ని తిప్పికొట్టండి: బాబు
తార్నాక, ఆగస్టు 31: తెలుగుదేశం పార్టీపై ఇతర పార్టీలు బురదచల్లడానికి చేస్తున్న అసత్యప్రచారాన్ని తిప్పికొట్టడానికి నగర నేతలు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నగర పార్టీనేతలకు సూచించారు. తెలుగుప్రజల ఆత్మగౌరవ యాత్రకు బయలుదేరి వెళుతున్న సందర్భంగా నగర నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా విషయంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడిన తీరును ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, ఇతర పార్టీలైన కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెరాస చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించని పక్షంలో ప్రజలు వారి అబద్ధపు మాటలను నిజమని నమ్మే ప్రమాదం ఉందని అన్నారు. ఇక్కడ నగర నేతలు మాత్రం ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీపై చేస్తున్న అసత్యప్రచారాలను తిప్పి కొట్టాలని, ఇప్పటివరకు నేతల తీరు ఆశించిన స్థాయిలో లేదని ఇకనైనా తీరుమార్చుకోవాలని మందలించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు తలసాని, సాయన్న, అరవింద్‌కుమార్‌గౌడ్, పి.ఎల్.శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శులు ఎం.ఎన్.శ్రీనివాస్, వనం రమేశ్ తదితర నేతలు పాల్గొన్నారు.