Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దేవుడే దిక్కు!

$
0
0

ఏలూరు, మార్చి 4 : పేద, మధ్య తరగతి కుటుంబాలు తూనికలు, కొలతలు మధ్య దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. వ్యాపారస్తులు చాలామంది సాధారణంగానే ఈ దోపిడీకి అలవాటుపడిపోయారు. ఇలాంటి సమయంలో వినియోగదారుల హక్కులను గుర్తుచేసి వారికి న్యాయం చేసేందుకు అటు వినియోగదారుల సంఘాలు, ఇటు జిల్లా యంత్రాంగం అండగా ఉండాల్సిన పరిస్థితి కచ్చితంగా ఉంది. కానీ గత కొద్దికాలంగా అది పూర్తిగా కనుమరుగైంది. చివరకు వినియోగదారులు దారితోచని స్థితిలో చిక్కుకున్నారు. అంతేకాకుండా మోసాల వలలో చిక్కుకుపోయారు. వ్యాపారులు దోపిడీ చేస్తున్నా వారిని నిలదీయలేని నిస్సహాయత వారిని ఆవరించింది. జిల్లాలో ఈ పరిస్థితి గతంలో ఏనాడు లేనేలేదు. పాఠశాలస్థాయి నుంచి వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచి తగిన విధంగా బాలలు కూడా స్పందించేలా భారీ కార్యాచరణకు గతంలో రూపకల్పన జరిగినా అది ఇప్పటికీ పాఠశాల స్థాయి దాటలేదు. కన్సూమర్ క్లబ్‌లు పేరుతో పెద్ద ఎత్తున ఆర్భాటం చేసినప్పటికీ దానివల్ల ఫలితం లేకుండా పోయింది. చివరకు అవి కూడా కనుమరుగయ్యాయి. మరోవైపు గతంలో వినియోగదారుల సంఘాలు పూర్తి క్రియాశీలకంగా ఉండి హక్కులపై విస్తృత ప్రచారం చేస్తూ అధికారిక కార్యక్రమాల్లో దీనిపై ప్రత్యేక ప్రస్తావన తీసుకువస్తూ ఉండేది. కానీ అలాంటి దాఖలాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆ రకంగా వినియోగదారుడు ప్రస్తుతం దోపిడీ అంచున నిలబడి వున్నాడు. అతనికి అండగా ఏ ఒక్కరూ కూడా లేరు. ఇలాంటి పరిస్థితి వినియోగదారుల రక్షణ చట్టం అవతరించి 25 ఏళ్లు నిండుతున్న తరుణంలో రావడమే మొత్తం మీద విషాదం. రాష్టస్థ్రాయిలోనే పశ్చిమగోదావరి జిల్లాకు వినియోగదారుల ఉద్యమంలో ప్రత్యేక గౌరవం వుంది. ఎన్నో సార్లు ప్రభుత్వ ప్రశంసాలను కూడా అందుకుంది. ఏటా డిసెంబర్ 24వ తేదీని జాతీయ వినియోగదారుల దినోత్సవంగాను, ఈ నెల 15న ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగానూ నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి జాతీయ వినియోగదారుల దినోత్సవం మొక్కుబడిగా ముగిసిపోయింది. అదే దారిలో ఇప్పుడు ఈ నెలలో జరగాల్సిన కార్యక్రమం కూడా నిలుస్తోంది. దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాల్సిన అధికారులు, సంఘాలు దృష్టి పెట్టకపోవడం వల్ల మొక్కుబడిగా ముగుస్తున్నాయి. వినియోగదారుల వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వమే ఒక మంత్రిని ఏర్పాటు చేసినా జిల్లాస్థాయిలో దీనికి ప్రత్యేక గుర్తింపు లేకపోవడం విషాదంగా కనిపిస్తోంది. గత రెండేళ్లలో జిల్లా కన్సూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశాలుగానీ, ఆహార సలహా సంఘ సమావేశాలు గానీ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ సమావేశాల్లో ఎన్నో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రావడం, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉండటం జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీనితో జిల్లాలో కల్తీలు పెరిగిపోయాయి. తూనికలు, కొలతల మోసాలు అధికమయ్యాయి. చౌకడిపోల పనితీరు అధ్వాన్నంగా మారింది. లక్షలాది కారులకు కూడా తెల్లకార్డులు మంజూరు చేయడంతోపాటు కుటుంబాలకన్నా ఎక్కువ తెల్లకార్డులు జారీ అయ్యాయి. కిరోసిన్ అధికమొత్తం నల్లబజారుకు తరలిపోతోంది. చాలాచోట్ల స్థానిక అధికారులు, డీలర్లు కుమ్మక్కై వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్యాస్ డీలర్లు అధిక రేట్లు వసూలు చేస్తున్న ఫిర్యాదులున్నాయి. ఇలా ఏ విభాగం చూసినా ఆరోపణలు, ఫిర్యాదుల వెల్లువ కనిపిస్తోంది. కాగా ఏలూరులోని డి ఎస్‌వో కార్యాలయం పైన జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రాన్ని గతంలోనే ఏర్పాటు చేశారు. దానికి ఒక ఫోను, ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ కేంద్రం మూతపడిపోయింది. ఫోను మోగడం మానేసింది. సిబ్బందిని వేరేచోట సర్దుబాటు చేశారు. ఇక వినియోగదారుల సమస్యలను లేవనెత్తేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక జిల్లాలో మొదటి విడతలో 75 కన్సూమర్ క్లబ్‌లు, రెండవ విడతలో 50 కన్సూమర్ క్లబ్‌లను ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. దీనికి నిధులు, కో ఆర్డినేటర్ల ఏర్పాటు జరిగింది. కొంతకాలం ఈ క్లబ్‌లు బాగానే పనిచేసాయి. కానీ ఇవి పూర్తిగా ఇప్పుడు మూతపడిపోయాయి. ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావడం నిలిచిపోయింది. కన్సూమర్ క్లబ్‌ల ద్వారా ఎన్నోసార్లు జిల్లాకు రాష్టస్థ్రాయి అవార్డులు లభించాయి. అయినప్పటికీ వీటిని పట్టించుకున్న నాధుడు లేకుండా పోయాడు. ఇక ప్రతి రెండునెలలకు ఒకసారి నిర్వహించాల్సిన మండల ఆహార సలహా కమిటీ సమావేశం సక్రమంగా జరగడం మానివేసింది. గ్రామస్థాయిలో కూడా ఆహార సలహాకమిటీలు ఏర్పాటు చేయాలన్న సూచన కాగితాలకే పరిమితమైంది. అలాగే వినియోగదారుల ఉద్యమంలో కీలకంగా నిలుస్తున్న ఉద్యమకారులను గుర్తించి, గౌరవించే విధానానికి యంత్రాంగం స్వస్తి చెప్పడం కూడా విమర్శలకు కారణమైంది. ఇక వినియోగదారుల ఫోరం పనిచేస్తున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో వినియోగదారులకు న్యాయం చేయడం లేదన్న విమర్శలున్నాయి. అటు సిబ్బంది కొరత, సభ్యుల పోస్టుల ఖాళీ వంటివి దీనికి మరో కారణం. 90 రోజుల నుంచి 150 రోజుల్లోపు ఫోరంలో దాఖలైన కేసులు పరిష్కారం కావాలని నిబంధన వున్నప్పటికీ అలా జరగడం లేదని వినియోగదారుల ఉద్యమకారుడు బొబ్బిలి బంగారయ్య 3ఆంధ్రభూమి2 వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జిల్లా ఫోరంలో ఇచ్చిన తీర్పును అమలు జరపడానికి ఫోరానికి అధికారం లేకపోవడంతో తీర్పులు తీర్పులకే పరిమితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు న్యాయం జరగడం లేదని ఎంతోమంది వాపోతున్నారని చెప్పారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు ఫోరంలు వున్నాయని, ఆ విధంగానే పశ్చిమగోదావరి జిల్లాలోనూ మరో ఫోరం ఏర్పాటు చేసి కేసులను సత్వరం పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా వినియోగదారుల ఉద్యమానికి మళ్లీ ఊతం కల్పించి వినియోగదారుల రక్షణ చట్టాన్ని అర్ధవంతంగా వినియోగించే ప్రయత్నం జరగాలని పలువురు కోరుతున్నారు.

*మూలన పడ్డ వినియోగదారుల సంఘాలు *పట్టించుకోని యంత్రాంగం *వౌనంగానే దోపిడీ భరింపు
english title: 
gh

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>