నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే సీమాంధ్ర ప్రాంతంలో లొల్లి జరుగుతుందని, ఈ లొల్లి ఎందుకు జరుగుతుందో ఆ ప్రాంత ప్రజలకే అర్థం కావడంలేదని బిజెపి నాయకులు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం గోపాల్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకోసం రాజ్యాంగ బద్దంగా ఉద్యమం కొనసాగుతున్నదని, సమైక్యాంధ్ర ఆంటూ 13 జిల్లాల వారు అప్రజాస్వామికంగా లొల్లి చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసే సమయంలో రాజ్యాంగ ప్రకారంగా కల్పించిన హక్కులను సీమాంధ్రులు హరించడం వల్లనే తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. రాజ్యాంగ ప్రకారం కల్పించిన ముల్కీరూల్స్‌ను కొట్టివేసేందుకే జై ఆంధ్ర ఉద్యమం పుట్టిందని ఆరోపించారు. సీమాంధ్రలో కొనసాగుతున్న లొల్లి స్వార్థం, రాజ్యాంగానికి విరుద్దమని విమర్శించారు.
*లొల్లి ఆపి రాజధానిపై చర్చించుకోవాలి * ఎమ్మెల్యే నాగం
english title:
nagam
Date:
Monday, September 2, 2013