పాలమూరు, సెప్టెంబర్ 1: యుపిఏ ప్రభుత్వం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కె.యోసుపు డిమాండ్ చేశారు. డిటిఎఫ్ ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పాలమూరు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుండి క్లాక్‌టవర్ చౌరస్తాలో గల అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ కొనసాగింది. శాంతి ర్యాలీకి టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచార్యులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు యోసుపు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను శాంతి ర్యాలీ ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు.
డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు యోసేపు
english title:
bill
Date:
Monday, September 2, 2013