ఇటిక్యాల, సెప్టెంబర్ 1: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని నాగర్‌కర్నూల్ ఎంపి మంద జగన్నాథం అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొండేరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్, అమరుల త్యాగాలు, ఉద్యోగస్థులు జరిపిన సకల జనుల సమ్మె ఫలితమే సోనియాగాంధీ, యుపిఏ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు నడుం బిగించిందన్నారు. తెలంగాణలో 13 సంవత్సరాల పాటు జరిపిన ఉద్యమం తెలుగువారుకాదా అని.. సీమాంధ్రలో జరుపుతున్న ఉద్యమం తెలుగుజాతేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సిడబ్ల్యూసి నిర్ణయం, పలు దఫాలుగా సీమాంధ్ర మంత్రులు, ఎంపిలతో చర్చలు జరిపే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఇచ్చారని గుర్తు చేశారు. అదిష్టాన నిర్ణాయానికే కట్టుబడి ఉంటామని చెప్పిన సీమాంధ్రులు నేడు అడ్డుకునేందుకే ఉద్యమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.
ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు రవిప్రకాష్, గుమ్మగోవర్ధన్, వెంకటేశ్వర్‌రెడ్డి, రామిరెడ్డి, రవి, యోహాన్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ కమిటిని ఎంపి సమక్షంలో ఎన్నుకున్నారు. అలంపూర్ తాలుకా అధికార ప్రతినిధిగా రవిప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా సల్వారెడ్డి, ప్రచార కార్యదర్శులుగా నాగేష్, లక్ష్మయ్యశెట్టి, వడ్డేపల్లి మండలం నుంచి జయన్న, సత్యన్నగౌడ్, హనుమంతు, ఇటిక్యాల నుంచి వెంకటేశ్వర్‌రెడ్డి, మన్యంగౌడ్, ప్రేమ్‌కుమార్ తదితరులను ఎన్నుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని నాగర్‌కర్నూల్
english title:
manda
Date:
Monday, September 2, 2013