హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఇంజనీరింగ్ యుజి కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న ఎమ్సెట్ కౌనె్సలింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపికకు సెప్టెంబర్ 3 నుండి 12వ తేదీ వరకూ అవకాశం కల్పిస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు సోమవారం నాడు చెప్పారు. తెలిపారు. సెప్టెంబర్ 17న ఇంజనీరింగ్ సీట్లను ఖరారు చేస్తామని, సెప్టెంబర్ 23లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని, 23వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని అధికారులు చెప్పారు. ఆగస్టు 31వ తేదీ నుండి మరో మారు అన్ని ర్యాంకుల వారూ తమ సర్ట్ఫికేట్లను పరిశీలన చేయించే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు చైర్మన్ వివరించారు. వెబ్ ఆప్షన్ల విషయంలో విద్యార్ధులు అప్రమత్తంగా ఉండాలని కొన్ని ప్రైవేటు కాలేజీల మాటలు నమ్మి స్క్రాచ్‌కార్డులు వారికి అందజేయవద్దని అధికారులు సూచించారు.
ఎన్‌సిసి, స్పోర్ట్సు, సిఎపి, పిహెచ్ అభ్యర్ధులు సైతం తమ ధృవపత్రాలతో కౌనె్సలింగ్‌కు 31 నుండి హాజరుకావాలని ఆయన చెప్పారు. 31న అన్ని క్యాటగిరిలకు చెందిన వారు 50వేల ర్యాంకు వరకూ, 1న 50వేల నుండి లక్ష ర్యాంకు వరకూ, 2న లక్ష ఒక ర్యాంకు నుండి 1.50 లక్షల ర్యాంకు వరకూ, 3న 1,50,001 ర్యాంకు నుండి చివరి ర్యాంకు వరకూ హాజరుకావాలని చెప్పారు. అలాగే సెప్టెంబర్ 3,4 తేదీల్లో 40వేల ర్యాంకు వరకూ, సెప్టెంబర్ 5,6 తేదీల్లో 40,001 నుండి 80,000 ర్యాంకు వరకూ, 7,8 తేదీల్లో 80,000 ర్యాంకు నుండి 1,20,000 ర్యాంకు వరకూ, 9,10 తేదీల్లో 1,20,000 ర్యాంకు నుండి 1,60,000 ర్యాంకు వరకూ 11,12 తేదీల్లో 1,60,001 ర్యాంకు నుండి చిట్టచివరి ర్యాంకు వరకూ హాజరుకావాలని పేర్కొన్నారు. తమ ఆప్షన్లను మరో మారు మార్చుకునే అవకాశం 13, 14 తేదీల్లో కల్పిస్తామని రఘునాధ్ చెప్పారు. 13వ తేదీన లక్ష ర్యాంకు వరకూ, 14న 1,00,001 ర్యాంకు నుండి చివరి ర్యాంకు వరకూ ఆప్షన్లను మార్చుకునే వీలుందని అన్నారు. గణేష్ చతుర్ధి సందర్భంగా 9వ తేదీన హెల్ప్‌లైన్ సెంటర్లు పనిచేయవని కూడా అధికారులు వివరించారు. సీట్ల కేటాయింపు 17వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
కాగా సోమవారం నాటి సర్ట్ఫికేట్ల పరిశీలనకు సీమాంధ్ర ప్రాంతంలో 387 మంది, తెలంగాణలో 128 మంది కలిపి 510 మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. ఇంత వరకూ మొత్తం 1,29,734 మంది అభ్యర్ధులు తమ సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ కె. రఘునాధ్ వివరించారు.
13న తిరిగి మార్చుకునే అవకాశం 17న సీట్ల కేటాయింపు 23 నుండి తరగతులు ప్రారంభం
english title:
web options
Date:
Tuesday, September 3, 2013