Clik here to view.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: సామా న్య, మధ్యతరగతి ప్రజలను అధిక ధరలు పీడిస్తున్నాయని, ప్రజల బాధలపై కేంద్ర రాష్ట్రాలకు పట్టింపు లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఉల్లి ధర పెరిగిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం నాడు బిజెపి మహిళామోర్చ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మహిళా మోర్చ అధ్యక్షురాలు మాలతీరాణి అధ్యక్షత వహించారు. మహిళలను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తున్న ఉల్లిధర మార్కెట్‌లో 52 రూపాయిలకు అమ్ముతుండగా మహిళా మోర్చ ఆధ్వర్యంలో రూ.20 చొప్పున విక్రయించి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పదిక్వింటాళ్ల ఉల్లిపాయలను ప్రజలు గంటలో వచ్చి కొనుగోలు చేయడం విశేషమని, పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటనే అద్దం పడుతోందని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ధరలు అదుపుచేయలేక చేతులెత్తేసిన ప్రధాని కుంభకర్ణుడి నిద్రలో ఉన్నారని అన్నారు. బిజెపి ఎన్‌డిఎ హయాంలో ఆరేళ్ల పాటు ధరలు పెరగనీయకుండా స్థిరీకరించగలిగిందని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి జి. పద్మజారెడ్డి, ఉపాధ్యక్షురాలు అరుణజ్యోతి, ఉమామహేశ్వరి, పి అరుణ, కార్యదర్శి గీతారాణి తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) ఉల్లిగడ్డలు అమ్ముతూ నిరసన తెలుపుతున్న బిజెపి నేతలు దత్తాత్రేయ తదితరులు