భీమవరం, మార్చి 4: సిఫి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ పోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల నుండి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. క్రీడాకారులు అద్భుతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అలరిస్తున్నారు. ఆదివారం జరిగిన పోటీల్లో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. జర్మనీ దేశానికి చెందిన కెప్లెర్ మార్క్ అలెగ్జాండర్, భారత్‌కు చెందిన వెర్మా యుఎం గొగాన్‌తో తలపడ్డారు. కెప్లెర్ 6-4,6-4 పాయింట్లతో విజయం సాధించాడు. తిపితీ దేశానికి చెందిన పెంగ్‌హెంగ్ ఇంగ్, జపాన్‌కు చెందిన కితామొతాకీపై 6-2, 6-3పాయింట్లతో విజయం సాధించాడు. జింబాబ్వేకు చెందిన ఫైన్‌మార్క్ భారత్‌కు చెందిన టక్కర్‌పై 7-5, 6-0పాయింట్లతో విజయం సాధించాడు. బ్రిటన్‌కు చెందిన బగ్బీబైస్, జపాన్‌కు చెందిన సైతోచూ పై 6-4, 7-5 పాయింట్లతో విజయం సాధించారు. అలాగే జర్మనీకి చెందిన బర్లాక్‌మైక్ పై కజకిస్తాన్‌కు చెందిన ధూల్‌దేవ్‌దాని 6-1,6-0 పాయింట్లతో విజయం సాధించాడు. భారత్‌కు చెందిన ఖాన్‌షబాజ్ భారత్‌కే చెందిన శర్మపై 6-2, 6-3పాయింట్లతో విజయం సాధించాడు. సోమవారం నుండి మెయిన్‌డ్రా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో స్వీడన్, భారత్, ఐర్లాండ్, జపాన్, తిపితే, బ్రిటన్, ఉబ్జెకిస్థాన్‌కు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను కనబరచనున్నారు. భారత్‌కు చెందిన సురేష్ కృష్ణ, వివేక్‌షోకేన్, ఆకాశ్‌వా, విఘ్నేష్‌కు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. అలాగే మెన్స్ డబుల్ విభాగంలో భారత్‌కు చెందిన బాలాజి, ఎన్ శ్రీరామ్, మురుగేశన్, ప్రశాంత్, రాజగోపాలన్, మాలిక్, షోకిన్‌వివేక్, గజ్జర్, సాకేత్ తమ ప్రతిభను కనబరచనున్నారు. రెండు రోజుల పాటు జరిగిన క్వాలిఫయింగ్ పోటీలలో జపాన్, జర్మనీ, భారత్‌కు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించారు. ఈ ఏడాది భారత్‌లో ఎఫ్-1 ఫ్యూచర్స్, ఎఫ్-2 ఫ్యూచర్స్ టోర్నమెంట్లు న్యూ ఢిల్లీ తదితర ప్రాంతాలలో జరిగాయి. ఇండియా ఎఫ్-3 ఫ్యూచర్స్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్‌లో నిర్వహిస్తున్నారు.
నేటి నుండి మెయిన్ డ్రా పోటీలు - సిఫి టెన్నిస్ టోర్నీ
english title:
hhh
Date:
Monday, March 5, 2012