న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రముఖ ట్రిపుల్ జంప్ క్రీడాకారుడు రంజిత్ మహేశ్వరి డోపింగ్ నేరానికి ఎప్పుడు శిక్షను ఎదుర్కోలేదని భారత అథ్లెటిక్ ఫెడరేషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనకు అర్జున అవార్డును ప్రదానం చేయవచ్చా లేదా అనే దానిపై కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకోనుంది. మహేశ్వరి అర్జున అవార్డు అంశంపై నెలకొన్న వివాదంపై అథ్లెటిక్ ఫెడరేషన్ నిన్న రాత్రి నివేదిక సమర్పించిన తర్వాత కేంద్ర క్రీడల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం తన శాఖ అధికారులతో సమావేశమైనారు. అయితే ఈ రోజు తాము ఈ అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, బహుశా రేపు తీసుకోవచ్చని కేంద్ర క్రీడల శాఖ కార్యదర్శి పికె దేబ్ చెప్పారు.
గత నెల 31న మహేశ్వరికి అర్జున అవార్డును ప్రదానం చేయడానికి కొన్ని గంటల ముందు 2008లో జరిపిన డోప్ టెస్టులో విఫలమయినాడా లేదా అనే విషయంపై దర్యాప్తు పూర్తయ్యే దాకా ఈ అవార్డుకోసం వేచి ఉండాలంటూ ఆయనకు చెప్పడం జరిగింది. అయితే దేబ్ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో గనుక నిర్దోషి అని తేలితే అవార్డును అందజేస్తామని ఆయనకు హామీ కూడా ఇచ్చారు. అయితే తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, అవార్డుకు తాను అర్హుడినేనని మహేశ్వరి మొదటినుంచి వాదిస్తూ ఉన్నాడు.
ప్రముఖ ట్రిపుల్ జంప్ క్రీడాకారుడు రంజిత్ మహేశ్వరి
english title:
arjuna
Date:
Wednesday, September 4, 2013