విశాఖపట్నం , సెప్టెంబర్ 3: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో భారత్ ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్లకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ‘ఎ’ జట్టు బ్యాట్స్‌మెన్లు ఎ జగదీష్, మన్‌ప్రీత్ జునేజ నిలకడగా ఆడి ఆదుకోవడంతో రెండవరోజు ఆటముగిసే సమయానికి భారత జట్టు 38 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 94 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఎ జట్టు స్కోరుకన్నా ఇంకా 343 పరుగులు వెనుకబడి ఉంది. విశాఖలోని ఎసిఎ -విడిసిఎ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండోరోజు మంగళవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆట ప్రారంభంలోనే ఉన్ముక్త్‌చంద్ (4), విజయ్‌జోల్ (2) వికెట్లు కోల్పోయింది. పదహారు పరుగుల వద్ద రెండో వికెట్ పడిన సమయంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీష్ (40 నాటౌట్), మన్‌ప్రీత్ జునేజ (43 నాటౌట్) నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడవ వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం అందించారు. అంతకుముందు ఎనిమిది వికెట్లకు 300 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు 437 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో డాగ్‌బ్రాస్‌వెన్ 11 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 96 పరుగులు, సోధి మూడు బౌండరీలతో 57 పరుగులు చేసి తొమ్మిదవ వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్నందించారు. వీరిద్దరూ అదే స్కోరు వద్ద అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ ‘ఎ’ జట్టు బవులర్లలో కులకర్ణి మూడు, సక్సేనా రెండు, ఇంతియాజ్ అహ్మద్, వాగ్, అభిషేక్ నాయర్, ధృవ్ ఒక్కో వికెట్ వంతున తీసుకున్నారు.
న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల
english title:
a
Date:
Wednesday, September 4, 2013