ఖాట్మండు, సెప్టెంబర్ 3: శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు తృటిలో ఓటమి నుంచి బయటపడింది. కెప్టెన్ సునీల్ చత్రీ ఇంజ్యూరీ టైమ్‌లో గోల్ అందించి 1-1 తేడాతో ఈ మ్యాచ్‌ను డ్రా ముగించడంతో భారత జట్టు పరువు నిలబెట్టుకుంది. ఈ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఇంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ సెల్ఫ్ గోల్ చేయడంతో 1-0 తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. మంగళవారం జరిగిన మ్యాచ్ 82వ నిముషంలో అతీకర్ రెహ్మాన్ మెషు బంగ్లాదేశ్ జట్టుకు తొలి గోల్‌ను అందించగా, భారత్‌కు 94వ నిముషంలో చివరి కిక్‌తో చత్రీ ఈక్వలైజర్‌ను సాధించిపెట్టాడు.
బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ డ్రా
english title:
draw
Date:
Wednesday, September 4, 2013