న్యూయార్క్, సెప్టెంబర్ 3: గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో 17 సార్లు చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నాలుగో రౌండ్‌లోనే అనూహ్య ఓటమితో నిష్క్రమించాడు. ఈ టోర్నీలో 7వ సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన ఫెదరర్‌ను స్పెయిన్‌కు చెందిన 19వ సీడ్ ఆటగాడు టామీ రాబెర్డో సోమవారం అర్ధరాత్రి (్భరత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఆరంభం నుంచే హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో టైబ్రేకర్‌కు దారితీసిన తొలి సెట్‌ను 6-7 తేడాతో చేజార్చుకున్న ఫెదరర్ ఆ తర్వాత రాబెర్డో జోరును ఏమాత్రం ప్రతిఘటించలేకపోయాడు. ఫలితంగా 3-6, 4-6 తేడాతో వరుసగా మరో రెండు సెట్లలో ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇటీవల జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌లో ఎదురైన ఓటమి నుంచి ఇంకా తేరుకోని ఫెదరర్‌కు ఇది మరో పెద్ద ఓటమి కాగా, యుఎస్ ఓపెన్‌లో రాబెర్డో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడం ఇదే తొలిసారి. ఫెదరర్‌తో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లలో తలపడిన రాబెర్డోకు ఇదే తొలి విజయం. ఇంతకుముందు ఫెదరర్ చేతిలో ఎదురైన 10 పరాజయాల్లో ఏడింటిని నాలుగో రౌండ్‌కు ముందే ఎదుర్కొన్న రాబెర్డో ఇప్పుడు ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కాగా, పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్, డేవిడ్ ఫెరర్, ఫ్రాన్స్‌కు చెందిన రిచర్డ్ గాస్కెట్ తమతమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, మహిళల సింగిల్స్ విభాగంలో ఇటలీకి చెందిన రాబెర్టా విన్సీ, ఫ్లావియా పెనె్నటా, స్లొవేకియా క్రీడాకారిణి డానియేలా హంతుచోవా ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌ను అధిగమించారు. ఈ టోర్నీలో రెండో సీడ్ ఆటగాడిగా బరిలోకి దిగిన ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ జర్మనీకి చెందిన 22వ సీడ్ ఫిలిప్ కోల్‌ష్రెబర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 7-6 తేడాతో చేజార్చుకున్నప్పటికీ ఆ తర్వాత 6-4, 6-3, 6-1 తేడాతో వరుసగా మూడు సెట్లను కైవసం చేసుకుని హార్డ్ కోర్ట్‌లో వరుసగా 19 విజయాన్ని నమోదు చేయగా, నాలుగో సీడ్ ఆటగాడు డేవిడ్ ఫెరర్ 7-6, 3-6, 7-5, 7-6 తేడాతో సెర్బియాకు చెందిన 18వ సీడ్ జాంకో తిప్సెర్విక్‌ను ఓడించాడు. అలాగే హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్కెట్ 6-7, 7-6, 2-6, 7-6, 7-5 సెట్ల తేడాతో కెనడాకు చెందిన 10వ సీడ్ ఆటగాడు మిలోస్ రావోనిక్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు.
హాలెప్‌కు పెనె్నటా చెక్
కాగా, ఈ టోర్నీలో అన్ సీడెడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన ఫ్లావియా పెనె్నటా మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో 6-2, 7-6 వరుస సెట్ల తేడాతో రొమేనియాకు చెందిన 21వ సీడ్ సైమోనా హాలెప్‌ను మట్టికరిపించగా, 10వ సీడ్ రాబెర్టా విన్సీ 6-4, 6-2 తేడాతో ఇటలీకే చెందిన కమీలా గియోర్గీని సునాయాసంగా చిత్తు చేసింది. అమెరికాకు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి ఆలిసన్ రిస్కేతో జరిగిన మ్యాచ్‌లో హంతుచోవా 6-3, 5-7, 6-2 సెట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.
దివిజ్ జోడీ నిష్క్రమణ
ఇదిలావుంటే, పురుషుల డబుల్స్ విభాగంలో దివిజ్ శరణ్ (్భరత్), యెన్ సున్ లు (చైనీస్ తైపీ) జోడీ మూడో రౌండ్‌లో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్తాన్‌కు చెందిన ఐజమ్ ఉల్‌హక్, అతని భాగస్వామి జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) 7-6, 3-6, 6-3 సెట్ల తేడాతో దివిజ్-యెన్ జోడీని ఓడించారు. అలాగే పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో డోడిగ్-మెలో, పెయా-సోరెస్, హుయి-ఇంగ్లాంట్, మహిళల డబుల్స్ మూడో రౌండ్‌లో హ్లవకోవా-హార్డెకా తమతమ ప్రత్యర్థులపై విజయాలు సాధించారు.
యుఎస్ ఓపెన్ నాలుగో రౌండ్‌లోనే ఔట్ రాబెర్డో చేతిలో ఘోర పరాజయం క్వార్టర్స్‌కు నాదల్, ఫెరర్, గాస్కెట్, విన్సీ
english title:
federer
Date:
Wednesday, September 4, 2013