న్యూయార్క్, సెప్టెంబర్ 4: వింబుల్డన్ విజేత, బ్రిటన్‌కు చెందిన మూడో సీడ్ ఆటగాడు ఆండీ ముర్రే ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో అతి కష్టం మీద క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ప్రీ క్వార్టర్స్‌లో అతనికి 64వ ర్యాంకర్ డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్) చివరి వరకూ గట్టిపోటీనిచ్చాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌ని ముర్రే 6-7, 6-1, 6-4, 6-4 ఆధిక్యంతో సొంతం చేసుకున్నాడు. 2011లో యుఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన టాప్ సీడ్ నొవాక్ జొకొవిచ్ 18వ సారి ఓ గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. అతను 43వ ర్యాంక్ ఆటగాడు మార్సెల్ గ్రానొలెర్స్ (స్పెయిన్)ను 6-3, 6-0, 6-0 తేడాతో చిత్తుచేసి, సెమీస్‌లో స్థానం కోసం 21వ సీడ్ మిఖలయ్ వొజ్నీతో పోరును ఖారారు చేసుకున్నాడు. అంతకు జరిగిన మారథాన్ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వొజ్ని సుమారు నాలుగు గంటలు పోరాడి, 6-3, 3-6, 6-7, 6-4, 7-5 స్కోరుతో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు లేటన్ హెవిట్‌పై విజయం సాధించాడు. 2001లో యుఎస్ టైటిల్ సాధించిన హెవిట్ ఈసారి అద్భుతంగా ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఓడినప్పటికీ, అతను చూపిన పోరాట పటిమ అందరినీ ఆకర్షించింది. కాగా, స్విట్జర్లాండ్‌కు చెందిన తొమ్మిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా కూడా క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. అతను గత ఏడాది సెమీఫైనలిస్టు తొమాస్ బెర్డిచ్‌ను 3-6, 6-1, 7-6, 6-2 తేడాతో ఓడించాడు. సెమీ ఫైనల్స్ చేరేందుకు అతను ముర్రేను ఢీకొంటాడు.
టైటిల్ దిశగా పేస్
పురుషుల డబుల్స్ విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన రాడెక్ స్టెపానెక్‌తో కలిసి ఆడుతున్న భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన పేస్, స్టెపానెక్ జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఐసమ్ ఉల్ హక్ ఖురేషి, జీన్ జూలియన్ రోజర్ జోడీపై 6-1, 6-7, 6-4 తేడాతో విజయం సాధించి సుమీ ఫైనల్స్ చేరింది. ఫైనల్‌లో స్థానం సంపాదించడానికి ఈ జోడీ కడ వరకూ శ్రమించాల్సిన అవసరం ఉంది. సెమీస్‌లో టాప్ సీడ్ జోడీ, ‘బ్రియాన్ సోదరులు’ మైక్, బాబ్‌ను పేస్, స్టెపానెక్ ఢీకొంటారు. ఈ జోడీని ఓడించి ఫైనల్ చేరడం వీరికి అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం.
ఫెదరర్ రిటైర్ కాడు: జొకొవిచ్
ఇటీవల వరుస పరాజయాలతో అల్లాడుతున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెదరర్‌కు ప్రస్తుత నంబర్‌వన్ నొవాక్ జొకొవిచ్ అండగా నిలిచాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో 19వ సీడ్ టామీ రొబ్రెడో చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలైన తర్వాత ఫెదరర్ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు చెలరేగాయి. అయితే, అతను రిటైరయ్యే అవకాశాలు ఏమాత్రం లేవని, అసలు అలాంటి పరిస్థితి తలెత్తలేదని జొకొవిచ్ వ్యాఖ్యానించాడు. ఫెదరర్‌ను అసాధారణ ప్రతిభావంతుడిగా ప్రశంసించాడు. ఆటకు వయసు అడ్డంకి కాదని అతను విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. 35 ఏళ్ల వయసులో టామీ హాస్ ‘టాప్-10’ జాబితాకు చేరువయ్యాడని గుర్తుచేశాడు. హాస్ గొప్పగా ఆడుతుండగా, ఫెదరర్ మళ్లీ ఫామ్‌లోకి రాడని అనుకోవడానికి వీలులేదని చెప్పాడు. కెరీర్‌లో 17 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను సాధించడమే ఫెదరర్ సామర్థ్యానికి నిదర్శనమని అన్నాడు. త్వరలోనే అతను మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
క్వార్టర్స్‌లో స్థానం శయుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్
english title:
p
Date:
Thursday, September 5, 2013