బ్రసెల్స్, సెప్టెంబర్ 4: ప్రపంచ అథ్లెటిక్స్‌లో తిరుగులేని వీరుడిగా పేరుప్రఖ్యాతులు ఆర్జించిన ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ 2016 రియో డి జెనీరో ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. రిడోలో స్వర్ణ పతకాలను సాధించడంతోపాటు, వచ్చే ఏడాది 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పడం, కామనె్వల్త్ గేమ్స్‌లో టైటిల్ సాధించడం తన లక్ష్యాలని బోల్ట్ పేర్కొన్నాడు. రియో ఒలింపిక్స్ అనంతరం రిటర్ అవుతానని ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో 27 ఏళ్ల బోల్ట్ ప్రకటించాడు. ప్రస్తుతం తాను మంచి ఫామ్‌లో ఉన్నానని, ఫిట్నెస్ సమస్యలు కూడా లేవని చెప్పాడు. అందుకే రిటైర్మెంట్‌పై ఇప్పట్లో ఆలోచించే అవసరం తనకు ఉండదని అన్నాడు. మాస్కోలో గత నెల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతోపాటు 100 మీటర్ల రిలేలోనూ స్వర్ణాలను బోల్ట్ సాధించాడు. ఈ మెగా ఈవెంట్‌లో బోల్ట్ మొత్తం మీద ఎనిమిది స్వర్ణాలు, మరో రెండు రజత పతకాలను కైవసం చేసుకున్నాడు. అదే విధంగా ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణ పతకాలు గెల్చుకున్నాడు. బాక్సింగ్‌లో మహమ్మద్ అలీ, ఫుట్‌బాల్‌లో పీలే మాదిరి గుర్తింపు సంపాదించుకోవాలంటే, రిటైరయ్యేలోగా జరిగే అన్న టోర్నీల్లోనూ అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. 2010లో గాయాల కారణంగా దాదాపు ఒక సీజన్ మొత్తం కీలక పోటీల్లో పాల్గొనలేకపోయినప్పటికీ, ఆతర్వాత ప్రపంచ అథ్లెటిక్స్‌పై తనదైన ముద్ర వేసిన బోల్ట్ మరోసారి గాయాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడతానని చెప్పాడు. 100 మీటర్లు, 200 మీటర్ల ఈవెంట్స్‌లో ప్రపంచ రికార్డులను నెలకొల్పడం, 100 మీటర్ల రిలేలో సహచరులతో కలిసి రికార్డును పంచుకోవడం తన కెరీర్‌లో మరపురాని ఘట్టాలని పేర్కొన్నాడు. 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేసి సృష్టించిన రికార్డును తానే అధిగమించడం కష్టమని అన్నాడు. అయితే, 19.19 సెకన్లతో తన పేరిట ఉన్న 200 మీటర్ల ప్రపంచ రికార్డును మెరుగుపరుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. గాయాల సమస్య లేకుండా పరుగులు తీయడంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని అన్నాడు. గతంలో ఎన్నడూ తాను కామనె్వల్త్ గేమ్స్‌లో పాల్గొనలేదని, వచ్చే సంవత్సరం ఆ లోటును కూడా భర్తీ చేస్తానని తెలిపాడు. అసాధారణ అథ్లెట్‌గా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే లక్ష్యమని బోల్ట్ చెప్పాడు.
ప్రపంచ అథ్లెటిక్స్‌లో తిరుగులేని వీరుడిగా
english title:
r
Date:
Thursday, September 5, 2013