సెయింట్ జాన్స్, సెప్టెంబర్ 4: ఈ ఏడాది నవంబర్ మాసంలో భారత్‌లో పర్యటించేందుకు వెస్టిండీస్ అంగీకరించింది. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ స్వదేశంలో 200వ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశాన్ని కల్పించేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) సంసిద్ధత వ్యక్తం చేసింది. నవంబర్‌లో తమ జట్టు భారత్‌లో పర్యటిస్తుందని బోర్డు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ టూర్‌లో భాగంగా రెండు టెస్టులు, మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడుతుందని వివరించింది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం భారత్‌లో విండీస్ పర్యటన డిసెంబర్ 3న ప్రారంభమై, జనవరి 15వ తేదీతో ముగుస్తుంది. అయితే, నవంబర్‌లో జరగాల్సిన దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), అదే సమయంలో పర్యటించాల్సిందిగా విండీస్‌ను ఆహ్వానించింది. కెరీర్‌లో 198 టెస్టులు ఆడిన సచిన్ 200 టెస్టుల మైలురాయిని స్వదేశంలో చేరుకోవాలన్న ఉద్దేశంతోనే బిసిసిఐ ఈ మార్పులు చేసింది. డబ్ల్యుఐసిబి కూడా బిసిసిఐ ప్రతిపాదనకు అంగీకరించడంతో, సచిన్ తన ‘రికార్డు టెస్టు’ను తన స్వస్థమైన ముంబయిలో ఆడడం ఖాయమైంది.
మేము సిద్ధం..
ముంబయి: వెస్టిండీస్‌తో రెండో టెస్టును వాంఖడే స్టేడియంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) ప్రకటించింది. అది సచిన్‌కు కెరీర్‌లో 200వ టెస్టు అవుతుందని, కాబట్టి ముంబయిలోనే ఈ మ్యాచ్ ఆడడం సమంజసమని బిసిసిఐకి రాసిన లేఖలో ఎంసిఎ తెలిపింది. ఈ ప్రతిపాదనకు బోర్డు సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. రొటేషన్ విధానం ప్రకారం చూస్తే వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టులకూ ముంబయి వేదికయ్యే అవకాశం లేదు. అయితే, స్వదేశంలో సచిన్ 200వ టెస్టు ఆడాలన్న ఉద్దేశంతో ఏరికోరి వెస్టిండీస్‌ను ఆహ్వానించిన బిసిసిఐ, రొటేషన్ పద్ధతిని పక్కకు తప్పించే అవకాశం లేకపోలేదు. మొదటి టెస్టు ఎక్కడ జరిగినా, రెండో టెస్టు మాత్రం వాంఖడే స్టేడియంలో జరిగేలా చూడాలని బిసిసిఐ అధికారులను ఎంసిఎ కోరింది.
ఈ ఏడాది నవంబర్ మాసంలో భారత్‌లో పర్యటించేందుకు వెస్టిండీస్ అంగీకరించింది.
english title:
b
Date:
Thursday, September 5, 2013