సిడ్నీ, సెప్టెంబర్ 4: పాకిస్తాన్ నుంచి వచ్చి ఇటీవలే ఆస్ట్రేలియా పౌరసత్వం పొంది, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన ఫవాద్ అహ్మద్‌పై కొందరు జాతి వివక్షతో విమర్శలు చేయడం దురదృష్టకరమని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఒక ప్రకటనలో పేర్కొంది. మత విశ్వాసాలను అనుసరించి అతను తన దుస్తులపై మద్యం కంపెనీకి చెందిన లోగోను ధరించడానికి విముఖత వ్యక్తం చేశాడని, అతని అభ్యర్థనను తాము ఆమోదించామని తెలిపింది. లోగో ధరించని ఫవాద్ ఇంగ్లాండ్‌తో టి-20 మ్యాచ్‌లు ఆడినప్పుడు ప్రేక్షకులు జాత్యహంకారంతో విమర్శలు గుప్పించడం బాధాకరమని తెలిపింది. క్రికెటర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దని ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులకు సూచించింది. మతాన్ని, దేశాన్ని లేదా ప్రాంతాన్ని క్రికెట్‌కు ఆపాదించరాదని హితవు పలికింది. ఫవాద్ మత విశ్వాసాలు అతని వ్యక్తిగతమని, జట్టు ప్రయో జనాలకు ఇబ్బంది కలగనంత వరకూ అతను తన మత సూ త్రాలను అనుసరించవచ్చని సిఎ స్పష్టం చేసింది. మైదానం లోకి దిగిన తర్వాత క్రికెట్‌ను ఒక ఆటగాడిగానే చూడాలని, అతని వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి హేళన చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని సిఎ వ్యాఖ్యానించింది. ఈ వివా దానికి ఇంతటితో తెరదించి, మ్యాచ్‌లు సజావుగా జరిగేందు కు సహకరించాలని అభిమానులను కోరింది.
..................
మెక్సికో ఫార్వర్డ్ అనిసా గజార్డో (కుడి)తో బంతి కోసం తలపడుతున్న అమెరికా ఫుట్‌బాల్ క్రీడాకారిణి హీతర్ ఒ రెల్లీ. వాషింగ్టన్‌లో జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అమెరికా 7-0 ఆధిక్యంతో మెక్సికోను ఓడించింది.
పాకిస్తాన్ నుంచి వచ్చి ఇటీవలే ఆస్ట్రేలియా పౌరసత్వం పొంది,
english title:
p
Date:
Thursday, September 5, 2013