ప్రత్యేక విమానంలో, సెప్టెంబర్ 4: రాబోయే ఒకటి, రెండేళ్లలో భారత రేటింగ్ దిగజారడానికి మూడింటా ఒక వంతుకుపైగా ఎక్కువ అవకాశాలున్నాయని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) చేసిన తాజా అంచనాను భారత్ తోసిపుచ్చింది. అలాంటి అవకాశాలేమీ లేవనే ధీమాను వెలిబుచ్చింది. బుధవారం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఒడిదుడుకులను తట్టుకునేలా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తూ పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన ఎస్‌అండ్‌పి అంచనాలను కొట్టిపారేస్తూ, అలాం టి అవకాశాలు లేవని స్పష్టం చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే 8వ జి-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేస్తున్న ఈ పర్యటనలో మాయారామ్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో విలేఖరులతో మాయారామ్ ఎస్‌అండ్‌పి రేటింగ్ వ్యాఖ్యలపై మాట్లాడారు. కాగా, ఇటీవల ఎస్‌అండ్‌పి భారత్‌పై తమకు నెగటివ్ ఔట్‌లుక్ ఉందని, రాబోయే ఒకటి, రేండేళ్లలో భారత రేటింగ్ దిగజారే అవకాశాలున్నాయంది. కరెంట్ ఖాతా లోటు (సిఎడి) భారత్‌ను బాధిస్తోందని, డాలర్ విలువతో పోల్చితే రికార్డు స్థాయిలో పడిపోతున్న రూపాయి పతనం కూడా సమస్యలకు కారణమంది. దీనిపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులుగా మాయారామ్ స్పందిస్తూ సిఎడిని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2013-14లో 3.7 శాతానికి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు పునరుద్ఘాటించారు. మరోవైపు ఆర్‌బిఐ గవర్నర్ రాజన్ సైతం భారత రేటింగ్‌కు ఢోకా లేదని చెప్పారు. ఎస్‌అండ్‌పి హెచ్చరికల్లో కొత్తదనమేమి లేదని పేర్కొన్నారు.
....................
బుధవారం న్యూఢిల్లీలో హీరో మోటోకార్ప్ కొత్త వ్యాపార విభాగమైన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ప్రారంభంలో ఆ సంస్థ చైర్మన్ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్, ఎండీ రాహుల్ ముంజాల్
ఎస్‌అండ్‌పి అంచనాను తోసిపుచ్చిన మాయారామ్
english title:
r
Date:
Thursday, September 5, 2013