న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: తెలుగుదేశం సీమాంధ్ర ఎంపీలు గురువారం గాంధీ టోపీలతో తమ సమైక్యాంధ్ర గళం వినిపించారు. గాంధీ విగ్రహం వద్ద ‘రఘపతి రాఘవ రాజారామ్’ గీతాన్ని ఆలపించారు. ఎంపీలు నారాయణరావు,వేణుగోపాల్ రెడ్డి,కిష్టప్ప, శివప్రసాద్‌తోపాటు రాజ్యసభ సభ్యులు వైఎస్ చౌదరి సిఎం రమేష్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రను యథాతధంగాకొనసాగించాలన్నదే తమ డిమాండని తెలుగుదేశం ఎంపీలు స్పష్టం చేశారు. తెలంగాణకు తాము వ్యతినేకం కాదని, సీమాంధ్రకు అన్నివిధాలా న్యాయం జరగాలన్నదే తమ డిమాండని నర్సరావుపేట ఎంపీ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. (చిత్రం) పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ‘రఘపతి రాఘవ రాజారామ్’ గీతాన్ని ఆలపిస్తున్న తెలుగుదేశం ఎంపీలు
తెలుగుదేశం సీమాంధ్ర ఎంపీలు గురువారం గాంధీ టోపీలతో తమ
english title:
tdp mps
Date:
Friday, September 6, 2013