Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మితిమీరుతున్న న్యాయవ్యవస్థ జోక్యం

$
0
0

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రభుత్వం విఫలమవుతున్నందున తాము జోక్యం చేసుకోక తప్పటం లేదన్న వాదనతో న్యాయ వ్యవస్థ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్న తీరు అత్యంత ప్రమాదకరమని ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ప్రభుత్వం పని చేయకుండా ఉంటే పని చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలే తప్ప ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యతలను స్వీకరించటం న్యాయవ్యవస్థకు తగదని ఆయన స్పష్టం చేశారు.
112వ రాజ్యాంగ సవరణ బిల్లు, జాతీయ జ్యుడీషియల్ కమీషన్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులపై ప్రసంగిస్తూ ఆయన న్యాయవ్యవస్థ పని తీరు, జవాబుదారీతనం మెరుగుపడవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చట్టాల పరిధిలో పని చేస్తుంది. కార్యనిర్వాహక వర్గం తీసుకున్న నిర్ణయాలు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రద్దవుతాయి. కానీ న్యాయ స్థానాల అధికారాలు, పరిధిపై ఒక స్పష్టమైన అవగాహన లోపించిందని జైట్లీ చెప్పారు. న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలోని వివిధ అధికరణలను తనకు అనుకూలంగా మార్చుకుని యదేచ్ఛగా తన పరిధిని పెంచుకుంటోందని ఆయన చెప్పారు. చట్టాలను చేసే అధికారం న్యాయ వ్యవస్ధకు లేదని ఆయన కరాఖండిగా చెప్పారు. అధికారాల విభజనపై స్పష్టమైన అవగాహన లేకపోవటంతో న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం మధ్య ఘర్షణ తప్పటం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను సైతం న్యాయస్థానాలు నిర్ణయిస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో న్యాయమూర్తులే ఈ ఫీజులను నిర్ణయించాలని ఆదేశించటం విడ్డూరంగా ఉందని అంటూ, ఈ నిర్ణయం వల్ల న్యాయమూర్తులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని ఛలోక్తి విసిరారు. ఇనుప ఖనిజం రవాణా కూడా ఎప్పుడు జరగాలో న్యాయ వ్యవస్థ నిర్ణయించే పరిస్థితి నెలకొందని ఆయన గుర్తుచేశారు. పదవీ విరమణ చేసిన వారికి తక్షణమే ఉపాధి లభిస్తున్న తీరు పదవి నుంచి విరమించటానికి ముందు వెలువరిస్తున్న తీర్పులపై విపరీతమైన ప్రభావం చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
పదవీ విరమణ చేసిన వారికి ఉపాధి కల్పించే ప్రక్రియకు స్వస్తి చెప్పి కావాలంటే పదవీ విరమణ వయోపరిమితిని పెంచవలసిందిగా ఆయన సూచించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు న్యాయమూర్తుల నియామకాలను ఖరారు చేయటానికి నేషనల్ జ్యూడీషియల్ కమీషన్ నియమాకాన్ని ఆయన స్వాగతించారు. ఈ బిల్లును స్థారుూ సంఘానికి నివేదించి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి నివేదికను అందచేయవలసిందిగా కోరాలని సూచించారు.

ప్రభుత్వ బాధ్యతలను కోర్టులు తీసుకోవడం ప్రమాదకరం చట్టాలను చేసే అధికారం జ్యుడీషియరీకి లేదు అరుణ్ జైట్లీ హెచ్చరిక
english title: 
judiciary

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>