వీరవాసరం, మార్చి 4: వీరవాసరం గ్రామంలో ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో మత్యపురి రోడ్ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో లోపం తలెత్తడంతో సుమారు 500 గృహాల్లోని టీవీలు, విద్యుత్ బల్బులు కాలి బూడిదయ్యాయి. ఒక్కసారిగా అకస్మాత్తుగా జరిగిన ఈసంఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పటి వరకు టీవీలు చూస్తున్న ప్రజలు ఇళ్లల్లో వైర్లు కాలిన వాసన రావటంతో భయభ్రాంతులయ్యారు. ఎవరికివారు రోడ్డుపైకి వచ్చి విద్యుత్ అధికారులకు ఫోన్ చేయడంతో ఒకేసారి ఇళ్ళల్లోని విద్యుత్‌వైర్లు, టీవీలు కాలిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే విద్యుత్ సిబ్బంది రాత్రి 10గంటల వరకు సమస్య పరిష్కారానికి కృషి చేసినా ఫలితం కానరాలేదు. అధికారులు ఈవిషయంపై సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖ ఎఇ రెడ్డి అనారోగ్యం దృష్ట్యా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎవరికి ఫిర్యాదులో ప్రజలకు అర్ధంకావడం లేదు. ఎలక్ట్రికల్ ఎఇ సెలవులో ఉన్నారని కొంతమంది, అనారోగ్యంతో ఉండటం వల్ల సెల్ స్విచాఫ్ చేసారని మరికొంతమంది సిబ్బంది తెలపటంతో సమస్య ఎవరికి వివరించాలో అర్ధంకాక ప్రజలు అయోమయంలో పడ్డారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఫోన్ చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన నష్టానికి ఎపి ట్రాన్స్‌కో పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యుత్ ఉపకరణాలు దగ్ధం
english title:
fggh
Date:
Monday, March 5, 2012