న్యూఢిల్లీ, మార్చి 4: అంగారక (కుజ) గ్రహం సోమవారం భూమికి మరింత సమీపానికి వస్తున్నందున కాంతివంతంగా దర్శనం ఇవ్వనున్నాడు. ‘ఈనెల 3న అంగారక గ్రహం సూర్యునికి ఎదురుగా, భూమికి చేరువగా వచ్చింది. సోమవారం భూమికి మరింత చేరువకావడంతో ఇంకా కాంతివంతంగా కనిపిస్తుంది’ అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రఘునందన్ చెప్పారు. తూర్పు ఈశాన్యాల మధ్య భూమికి 100.78 మిలియన్ కిలోమీటర్ల దూరంలో -1.23 మాగ్నిట్యూడ్‌లో శక్తివంతంగా అంగారకుడిని చూడవచ్చని ఆయన తెలిపారు. ‘ఏప్రిల్ వరకు అంగారకుడు ప్రకాశవంతంగా కన్పిస్తాడు. 2013 ఫిబ్రవరి వరకు ఈ గ్రహాన్ని ఆకాశంలో స్పష్టంగా చూడవచ్చు. అయితే రోజులు గడిచేకొద్ది కాంతి తగ్గుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
అంగారక (కుజ) గ్రహం సోమవారం భూమికి మరింత సమీపానికి వస్తున్నందున
english title:
n
Date:
Monday, March 5, 2012