వీపనగండ్ల, మార్చి 5: జిల్లాలో తానే పెద్ద మంత్రిని కావాలని దురాశతో తెలంగాణ వాదం పేరుతో రాజీనామా చేసిన జూపల్లి కృష్ణారావుకు ఉన్నకుర్చీకూడా లేకుండా పోయిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డికె అరుణ అన్నారు. సోమవారం ఆమె కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ వాదంపట్ల విశ్వాసంలేని జూపల్లి కృష్ణారావును ఓడించేందుకు ఓట్ల రూపంలో తమ అధికారాన్ని నిరూపించుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వంత ఊరులోని దేవాలయం ముందు బోరింగును కూడా వేయించుకోలేని అసమర్థ దేవాదాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావాని తాను అనుకోలేదన్నారు. దేవాదాయ శాఖ నచ్చక ప్రజలను మోసం చేయాలనుకుంటే గ్రామాల్లోని ప్రజలు, అతన్ని గ్రామ పొలిమెరల నుండి తరుముతున్నారన్నారు. దేవునిపైకూడా అతనికి నమ్మకంలేదని ప్రజలు అంటున్నారని ఆ దేవుడే అతనికి తగిన శిక్షవేయాలని మనమంతా కోరుకుందమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు, సీట్లే లక్ష్యమనే అంశం ప్రజలకు అర్థమయ్యిందన్నారు. కొత్తరాష్ట్రాల ఏర్పాటు జాతీయ పార్టీల ద్వారానే సాధ్యమవుతుందని, టిఆర్‌ఎస్ ఉద్యమం వల్ల తెలంగాణను ఇచ్చి కెసిఆర్‌ను హీరో చేయలేమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, డొంక హర్షవర్థన్‌రెడ్డి, గూడెం రవి, రాములు, శ్రీనివాసరెడ్డి, సత్యారెడ్డిలు పాల్గొన్నారు.
- జూపల్లిపై మంత్రి డికె అరణ ఎద్దేవా
english title:
fg
Date:
Tuesday, March 6, 2012