Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తెలుగు గడ్డను కాపాడేందుకు ప్రతి పౌరుడు ఉద్యమించాలి

$
0
0

తోట్లవల్లూరు, సెప్టెంబరు 6: తెలుగు ప్రజలు నివాసించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు ఉద్యమించాలని జెఎసి నాయకుడు, మండల వైఎస్‌ఆర్ సిపి కన్వీనర్ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తోట్లవల్లూరులో పొలిటికల్, ఉపాధ్యాయ, ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు శుక్రవారానికి 25వ రోజుకు చేరాయి.

బంటుమిల్లిలో ఉపాధ్యాయులు, రిక్షా వర్కర్ల ప్రదర్శన

బంటుమిల్లి, సెప్టెంబర్ 6: సమైక్యాంధ్ర కోరుతూ బంటుమిల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 24వ రోజుకు చేరాయి. బంటుమిల్లి మండల రిక్షా వర్కర్స్ యూనియన్ నాయకులు గౌరిశెట్టి దుర్గారావు, బొర్రా పైడయ్యల ఆధ్వర్యంలో రిక్షా వర్కర్స్ దీక్ష చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు జెఎసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రిక్షా వర్కర్స్ జాతీయ రహదారిపై వంటా వార్పు నిర్వహించారు.

అలుపూ సొలుపూ లేని సమైక్య ఉద్యమం
విజయవాడ, సెప్టెంబర్ 6: నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఆరంభమై 38 రోజులు దాటుతున్నా ఉద్యమకారుల్లో అలుపు సొలుపూ కన్పించడం లేదు. ఏరోజుకారోజు మరింత సమధికోత్సాహంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా న్యాయవాదుల విధుల బహిష్కరణ కొనసాగుతున్నది. ప్రభుత్వరంగ సంస్థల గ్రంథాలయాల మున్సిపల్ ఉద్యోగులు, ఆర్‌టిసి కార్మికుల నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరింది. ఆందోళన బాటలో పయనిస్తున్న విద్యుత్ ఉద్యోగులు తమ తమ కార్యాలయాల్లో సహాయ నిరాకరణ చేపట్టారు. దీనికి జెఎసి వైస్ చైర్మన్ ఎం. సత్యానందం నాయకత్వం వహించారు. సీమాంధ్రలోని 800 మంది మున్సిపల్ ఇంజనీర్లు శనివారం నుంచి నిరవధిక సమ్మెలోకి దిగబోతున్నారు. వీధిలైట్లు, తాగునీటి విభాగాలు మినహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని నిలిపివేయనున్నారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాశ్వత అధ్యక్షులు గోకరాజు గంగరాజు, అధ్యక్ష, కార్యదర్శులు కెఎస్ రామచంద్రరావు, ఎల్. రామకృష్ణ నాయకత్వంలో 300 మంది సభ్యులు గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో కృష్ణానదిలోకి దిగి నడుంలోతు నీటిలో ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేసారు. విద్యార్థి జెఎసి కన్వీనర్ దేవినేని అవినాష్ నాయకత్వంలో వందలాది విద్యార్థులు బెంజిసర్కిల్‌లో నినాదాల మధ్య ఆటపాటలతో నిరసన తెలిపారు. వైఎస్సార్సీ సెంట్రల్ ఇన్‌చార్జ్ పి. గౌతంరెడ్డి నాయకత్వంలో సింగ్‌నగర్‌లో నూజివీడు రహదారిపై వంటా వార్పు జరిగింది. విద్యార్థులు క్రికెట్ ఆడారు. యువ సమైక్య కన్వీనర్ పోతిన విజయకుమార్ ఆధ్వర్యంలో కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్‌లో ర్యాలీ జరిగింది. రవికిరణ్ ఆమరణ దీక్ష చేపట్టారు. వీరికి సంఘీభావంగా పలువురు రిలేదీక్షలో పాల్గొన్నారు. బిసి ఐక్యవేదిక కార్యదర్శి కామందుల నరసింహారావు, బిసి యువజన ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గాసి రవి నాయకత్వంలో కొత్తపేట గంగానమ్మ గుడి వద్ద రిలే దీక్షలు ఆరంభమయ్యాయి.
నలంద డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో...
నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనూరాధ నాయకత్వంలో అధ్యాపకులు, విద్యార్థులు కళాశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర ప్రజలందరూ ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.
రెల్లికుల రిలే దీక్షలు
రెల్లికుల ఐక్య కో ఆర్డినేటర్ మాడుగుల నాగమల్లేశ్వరరావు నాయకత్వంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న రిలే దీక్షల్లో ఆఖరి రోజున శిబిరాన్ని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం, విద్యార్థి జెఎసి కన్వీనర్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. 30 మంది వరకు దీక్షలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ జెఎసి కన్వీనర్ పోతిన రాము, పొలిటికల్ జెఎసి కన్వీనర్ కొలనుకొండ శివాజీ, మాజీ కార్పొరేటర్లు మహాదేవ అప్పాజీ, నూకల నాగేశ్వరరావు, అడపా శేషు, ఎలకల చలపతిరావు, సైకం సాయిబాబు, వివిధ పార్టీల నేతలు బుద్దా నాగేశ్వరరావు, కంది గంగాధరరావు, తదితరులు శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్ కోసం తరలివెళ్లిన ఉద్యోగులు
విజయవాడ, సెప్టెంబర్ 6: గత 24 రోజులుగా నిరవధిక సమ్మెతో పాటు వివిధ రూపాల్లో తమ సమైక్య నినాదాన్ని వినిపిస్తున్న ఎన్జీఓలు తమ ఆందోళనలో భాగంగా ఈనెల 7న హైదరాబాద్‌లో తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. సమ్మెలో వున్న ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ వైపు బయలుదేరాయి. కృష్ణా జిల్లా నుంచి దాదాపు 6,500 మందికి పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు కదంతొక్కుతూ బయలుదేరారు. ఉద్యోగ సంఘాల జెఎసి జిల్లా కన్వీనర్ ఎ.విద్యాసాగర్ నాయకత్వంలో వేర్వేరు వాహనాలలో భారీ ర్యాలీగా తరలివెళ్ళారు. 1500 మంది పైగా రైలుమార్గంలో వెళ్ళగా, 4000 మంది వరకు 125 ప్రైవేటు బస్సుల్లో, అలాగే మరో ఐదారు వందల మంది కార్లు, జీపులలో తరలివెళ్ళారు. మున్సిపల్ ఉద్యోగుల జెఎసి కన్వీనర్ డి.ఈశ్వర్ నాయకత్వంలో 300 మంది పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాల్గవతరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తరలివెళ్ళారు. ఆర్టీసీ కార్మికులు, గ్రంధాలయ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పయనమయ్యారు. ప్రతి వాహనంపైనా సమైక్యాంధ్ర బ్యానర్లు, పతాకాలు రెపరెపలాడుతున్నాయి. మార్గమధ్యంలో దారిపొడవునా నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమనేతలు అనేక మంది వీరికి వీడ్కోలు పలికారు.

అసమర్థ ప్రధాని వల్లే అవస్థలు
టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజం
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 6: ప్రజలు అధికారం ఇస్తే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించటం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు నగర ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆత్మగౌరవం పేరుతో చంద్రబాబు నాయుడు జిల్లాలో నిర్వహిస్తున్న యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీ కాళేశ్వరరావుమార్కెట్ సెంటర్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మండిపోతోందని దీనికి కారణం గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వమని ఆయన నిప్పులుచెరిగారు. తెలుగు బాషామాట్లాడే ప్రజలు అందరు తెలుగువారేనని వారికి ఎక్కడ అన్యాయం జరిగిన వీరికి రక్షణకవచంగా ఉండేందుకే హైదరాబాద్‌ను వదలి పెట్టి ప్రజల మధ్యకు వచ్చినట్లు ఆయన వివరించారు. 9 సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశంపార్టీకే దక్కిందన్నారు. వివిధ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఉపాధి, ఉద్యోగ, విద్య, వైద్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్, మెడికల్, యూనివర్సీలు, హైటెక్ సిటీ నిర్మాణం, జాతీయ స్థాయిలో ఎయిర్‌పోర్ట్, ప్రాజెక్ట్‌లు, తదితర వాటిని ఏర్పాటుచేసిన కారణంగానే ప్రపంచ దేశాలకు చెందిన అనేక మంది ప్రధానమంత్రులు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి వారి దేశాల్లో ప్రచారం చేసుకున్నారన్నారు. గతంలో తెలుగువారు అంటే ఎక్కడకువెళ్ళిన ఎంతోగౌరవం ఉండేదని ప్రస్తుతం వేరొక రాష్ట్రానికి వెళితే అక్కడ తెలుగువారికి సరైన రీతిలో గౌరవం ఇవ్వటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలుపాటు జరిగే అభివృద్ధిని కేవలం 9 సంవత్సరాల వ్యవధిలోనే అభివృద్ధి చేసి సమర్థవంతమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ పెరొందిందన్నారు. పాతబస్తీ ప్రజలు తన ఎడల చూపిన ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రధాని మంత్రి మన్‌మోహన్‌సింగ్ అత్యంత అసమర్థుడైన ప్రధాన మంత్రి అని బాబు పియం పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమోత్తారు. అన్నివర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి జరిగిన అన్యాయాన్ని గురించి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుంటే సీమాంధ్రకు చెందిన ఎంపిలు చోద్యం చూస్తున్నారని ఇక్కడ ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా ఎంపిలు సోనియాగాంధీ పెంపుడుకుక్కలుగా వ్యవహరిస్తున్నారని బాబు కాంగ్రెస్‌పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభ, పార్లమెంట్‌లో ఉన్న తెలుగుదేశంపార్టీ సభ్యులు సోనియాగాంధీని మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు మధ్య ఉన్న తేడాను ఈ రాష్ట్ర ప్రజలు గమినించాలని బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కేవలం 2 జిల్లాలకే పరిమితం కాగా టిఆర్‌ఎస్ ఒక జిల్లాకే పరిమితం ఐతే తెలుగుదేశంపార్టీ అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా అఖండ విజయం సాధించిన విషయాన్ని గమనించిన యుపిఎ చైర్‌పర్సన్ భవిష్యత్‌లో తెలుగుదేశంపార్టీని అణచి వేయటానికే తెలంగాణ విభజన అంటూ తెరపైకి ఒక సమస్యను తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టి నేడు చోద్యం చూస్తోందని బాబు సోనియాపై విమర్శలు గుప్పించారు.గ్రామాల్లో అన్నదమ్ముల మధ్య అభిప్రాయబేధాలు వస్తే పంచాయతీ పెద్దలు సమక్షంలో ఇద్దరికి ఆమోదయోగ్యమైన తీర్పు ఇవ్వటం జరుగుతుందని కనీసం గ్రామ పంచాయతీకి ఉన్న బుద్ధికూడ ఢిల్లీ పెద్దలకు లేకపోయిందని బాబు పరోక్షంగా కాంగ్రెస్‌పార్టీ పెద్దలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి వస్తున్న మంటల్లో చలి కాచుకుంటున్న కాంగ్రెస్‌పార్టీకి రానున్నఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధిచెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సోనియాగాంథీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిమంత్రి చేయటానికి కేవలం నోట్లు జల్లి సీట్లను కైవసం చేసుకోవటానికే తెలంగాణలో టిఆర్‌యస్, సీమాంధ్రలో వైయస్‌ఆర్ పార్టీలచేత తోలుబొమ్మలాటలు ఆడిస్తుందని ఈ రాష్ట్ర ప్రజలు జరుగుతున్న వాస్తవాలను గుర్తించి రానున్న ఏన్నికల్లో ఇటువంటి పార్టీలకు సరైన రీతిలో బుద్ది చెప్పి ప్రజల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలుగుదేశంపార్టీకే పట్టం కట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఈ రాష్ట్రాన్ని వివిధ రూపాల్లో దోచుకొని కొంత మొత్తాన్ని వైయస్ జగన్‌కు మిగిలిన వాటాను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పంపిణీ చేయటంలోనే ఆయన సియం పదవీ కాలం పూర్తయిందన్నారు. జలయజ్ఞం అంటూ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్‌ను నిర్మించలేదని ఆపేరుతో ఈ రాష్ట్రానికి చెందిన ధనాన్ని దోచుకున్న వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేయగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని అనుమతులను అప్పటి కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్న విపి సింగ్‌తో చర్చలు జరిపి స్వయంగా తీసుకువచ్చిన ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను సియంగా ఉన్న సమయంలోనే కర్ణాటకలో ఆల్‌మట్టీ డ్యామ్ ఎత్తును పెంచటానికి అంగీకరించలేదని ప్రస్తుతం కృష్ణా మిగుల జలాల విషయంలో కేంద్రం పట్టించుకోక పోవటం ఈ జలాలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలి పోతున్నాయని ఆయన కేంద్ర ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు. అక్రమ అస్తుల కేసులో జైలులో ఉన్న వైయస్ జగన్ యోగక్షేమాలను స్వయంగా భారత ప్రధాని మంత్రి మన్‌మోహన్‌సింగ్ జగన్ తల్లి విజయమ్మతో మాట్లాడటం గమినిస్తే అధికార కాంగ్రెస్‌పార్టీ తల్లి కాంగ్రెస్‌లాగా ఉంటే వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పిల్ల కాంగ్రెస్ కాదా అని బాబు ప్రశ్నించారు. వైయస్ జగన్‌కు బెయిల్ కోసమే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవటం నిజం కాదా? అని బాబు ప్రశ్నించారు. కార్యక్రమంలోపశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించే సత్తా ఒక్క తెలుగుదేశంపార్టీకే ఉందన్నారు. తెలుగుదేశంపార్టీ అర్బన్ కన్వీనర్ నాగుల్ మీరా, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేశినేని నాని, జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, రాష్ట్ర నాయకుడు వర్లా రామయ్య తదితరులు మాట్లాడారు.

ఇటలీ-ఇడుపులపాయ మధ్య ఒప్పందం
సబ్ కలెక్టరేట్, సెప్టెంబర్ 6: తెలుగుజాతి న్యాయంకోసం నా చివరి రక్తం బొట్టు వరకు పోరాడతానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర శుక్రవారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ప్రారంభమైన యాత్ర బిఆర్‌టిఎస్ రోడ్డు, అయోధ్యానగర్ నుంచి సింగ్‌నగర్ వరకు సాగింది. అయోధ్యానగర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కృష్ణాజిల్లా ఎన్టీఆర్ జన్మించిన ప్రాంతమని, అలాంటి ప్రాంతంలో ప్రజలు ఉద్వేగంతో ఉన్నారని అన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమేనని ధ్వజమెత్తారు. తెలుగుజాతి గొప్పదనాన్ని చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకు ఎన్టీఆర్ నిలిచి ఉంటారని, అలాంటి నాయకుడు మనకు స్ఫూర్తి అని చెప్పారు. సీమాంధ్రలో 35రోజులుగా ఆగ్రహ జ్వాలలు రగులుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కాలక్షేపం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాలే చేస్తుందని ప్రజాసంక్షేమం పట్టించుకోవటం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న టిఆర్‌ఎస్ (కారు గుర్తు) ఆ కారుకు డీజిల్ పోయిస్తుంది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (్ఫ్యన్ గుర్తు)కి విద్యుత్ సరఫరా చేస్తున్నది కూడా కాంగ్రెస్సేనని అన్నారు. కారును కొనుగోలు చేసి, ప్యాన్‌ను కూడా కొనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేసారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ అసమర్ధుడని, అవినీతి జరుగుతున్నా చూస్తూ ఉండే వ్యక్తని అన్నారు. బొగ్గు కేటాయింపుల ఫైల్స్‌కు రక్షణ కల్పించలేని వ్యక్తి దేశానికి ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. తన 9 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి జరిగిందని, ఇది నేను చేసిన తప్పుగా భావిస్తున్నానని, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేవాడినని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటలీ నుంచి ఇడుపులపాయకు సంధి కుదిరిందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ, కేశినేని నాని, వర్ల రామయ్య, బోండా ఉమా, నాగుల్‌మీరా, గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు.
సమైక్య ఉద్యమంలోకి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు
అజిత్‌సింగ్‌నగర్, సెప్టెంబర్ 6: రాష్ట్ర విభజన నిరసిస్తూ జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజనీర్లు కూడా ఉద్యమ బాట పడుతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలక, నగరపాలక సంస్థలలో పనిచేసే ఇంజనీర్లు, పబ్లిక్ హెల్త్ విభాగ అధికారులు ఉద్యమంలోకి అడుగిడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖాధికారులకు కూడా సమైక్యాంధ్ర మున్సిపల్ ఇంజనీర్స్ అండ్ పబ్లిక్ హెల్త్ జెఏసి ఆధ్వర్యంలో సమ్మె నోటీసులను అందజేసారు. ఈ మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ఇంజనీర్లు, పబ్లిక్ హెల్త్ అధికారుల జెఏసి నాయకులు కూడా కమిషనర్ జిఎస్ పండాదాస్‌కు సమ్మె నోటీసు అందజేసారు. సీమాంధ్ర జిల్లాలలో జరిగే అన్ని అభివృద్ధి పనులను నిలిపివేస్తున్నారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే భాగంగా అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తామని జెఏసి నాయకులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రాష్ట్ర పురపాలక, నగర పాలక సంస్థల ఉద్యోగులు, కమిషనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా తాము సైతం రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్య ఉద్యమంలోకి అడుగిడుతున్నామని సమైక్యాంధ్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజనీర్ల జెఏసి కన్వీనర్ మరియన్న, కో కన్వీనర్ మెహర్‌బాబా, మీడియా కన్వీనర్ ఉదయభాస్కర్‌లు తెలిపారు. ఈనెల 10న మరోసారి జెఏసి సమావేశాన్ని నిర్వహించి అత్యవసర సేవలకింద వచ్చే మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణల నిలిపివేతలపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకొంటామని, ఇప్పటికైనా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సమైక్య రాష్ట్ర ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేసారు.

‘సమైక్య సభను అడ్డుకుంటే తెలంగాణ హుళక్కే!’
విజయవాడ, సెప్టెంబర్ 6: గత 24 రోజులుగా నిరవధిక సమ్మెలోనున్న ప్రభుత్వ ఉద్యోగులు సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించదలచిన బహిరంగ సభను తెలంగాణవాదులు ఏ మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేసినా సమైక్యవాదులు మరింత విజృంభించి పోరాడగలరని దీంతో ఎంత తపస్సు చేసినా మరో నూరేళ్ళు తెలంగాణ వచ్చేది లేదంటూ సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు హెచ్చరించారు. సమైక్యాంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షుడు షేక్ జలీల్ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి శుక్రవారం నాడిక్కడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖర్లతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛతో ఎవరు ఎక్కడైనా సభ నిర్వహించుకునే హక్కు ఉందన్నారు. దీనికి షరతులు వర్తించవన్నారు. అసలు ఈ సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచే తెలంగాణవాదులు అడ్డుకుంటాం... అడ్డుకుంటాం... అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తూ వస్తున్నారన్నారు.

తెలుగు ప్రజలు నివాసించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రతి
english title: 
udyaminchali

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>