Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

’సీమాంధ్రుల సత్తాచాటిన ఏపీ ఎన్జీవోలు‘

$
0
0

గుంటూరు, సెప్టెంబర్ 7: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున సీమాంధ్ర ఉద్యోగులు భారీ సభను విజయవంతం చేసి సీమాంధ్రుల సత్తా ఏమిటో ఎపి ఎన్జీవోలు నిరూపించారని వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా సభను నిర్వహించిన ఎపి ఎన్జీవోలకు ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే తమ న్యాయమైన సమస్యలను వివరించేందుకు ఎపి ఎన్జీవోలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను తెలంగాణ వేర్పాటు వాదులు అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. అయితే దృఢ నిశ్చయంతో ఉన్న సీమాంధ్రులు ఎదురొడ్డి భారీ సభను కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసి యుపిఎ, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించారన్నారు. ఎపి ఎన్జీవోలు అలుపెరగని ఉద్యమంతో యుపిఎ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసి పడ్తున్న ఉద్యమ జ్వాలలో కాంగ్రెస్, వంతపాడుతున్న వేర్పాటు వాది చంద్రబాబు నాయుడు, ఆయన సారధ్యం వహిస్తున్న టిడిపిలు మాడిమసికాక తప్పదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టిడిపిలు తమ పంథా మార్చుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, విధానపరమైన ప్రకటనను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని కాపాడండి
యడ్లపాడు, సెప్టెంబర్ 7: ప్రకృతి మనకు ప్రసాదించిన పచ్చదనం, పారిశుద్ధ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ కోరారు. శనివారం ఆయన యడ్లపాడు మండలం జాలా ది గ్రామంలో జిల్లాలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాలాదిలోని గ్రామభారతి అనే స్వ చ్చంద సంస్థ శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో మొక్కలు కూడా బాగా పెరుగుతాయని, అందరూ మొక్కలు నాటాలని, దీనిపై తగు శ్రద్ధ కనబర్చాలని కోరారు. కేంద్రప్రభుత్వం మరుగుదొడ్లకు 9,100 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నా ఆసక్తి కనబర్చక పోవడం విచారకరమన్నారు. ఎప్పుడో రాజుల కాలం నాటి చెరువులు తప్ప గత కొద్ది కాలంగా మనం ఏర్పాటు చేసుకున్న నీటి వనరులు ఏమీ లేవన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. జిల్లా అటవీశాఖ అధికారి సలామ్ మాట్లాడుతూ జిల్లాలో 1/3వ వంతు ఉండాల్సిన రిజర్వు ఫారెస్ట్ క్రమంగా తగ్గిపోతోందని విచారం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లాలో అన్ని పంచాయతీల్లో కలిపి 5 లక్షల మొక్కలు నాటాలని ధ్యేయంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామభారతి స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు, న్యాయవాది ఘంటా రామారావు, సిఆర్ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు కందిమళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎంపిపి రఘురామారావు, రోటరీ క్లబ్ 3150 గవర్నర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండ గా 15 ఏళ్ల క్రితం నక్కవాగు కరకట్టల అభివృద్ధి విషయమై సేకరించిన రైతుల పొలాలకు నష్టపరిహారం లభించలేదని తుర్లపాడు తదితర గ్రామాల రైతులు ఎంతో నష్టపోయారని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహనరావు వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. 15 సంవత్సరాల నాడు సేకరించిన భూమికి ప్రస్తుత ధరల ప్రకారం నష్టపరిహారం నిర్ణయించి వెంటనే ఇప్పించాలని కోరారు.

‘ఆత్మగౌరవ యాత్ర జిల్లాలో విజయవంతం’
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 7: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర విజయవంతమైందని రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో యాత్ర ఐదు నియోజకవర్గాల్లోని 13 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 52 గ్రామాలు, 220 కిలోమీటర్లు సాగిందన్నారు. మండుటెండలను, అకాల వర్షాలను సైతం ప్రజలు లెక్కచేయకుండా యాత్రకు బ్రహ్మరథం పట్టారన్నారు. మహిళలు అర్ధరాత్రి సమయంలో కూడా బారులు తీరి యాత్రకు నీరాజనం పట్టారన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పాలనను తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు యాత్ర సీమాంధ్ర ప్రజల్లో భరోసా నింపిందన్నారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి వెన్నా సాంబశివారెడ్డి మాట్లాడుతూ 1983లో అన్న నందమూరి తారక రామారావు చైతన్య రథయాత్ర చేసిన తీరును చంద్రబాబు యాత్ర తలపించిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ నాయకులు చంద్రగిరి ఏడుకొండలు, కొర్రపాటి నాగేశ్వరరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, కంకణంపాటి శ్రీనివాసరావు, పప్పుల దేవదాసు, సగ్గెల రూబెన్, బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్చరీలో అనూషకు
నాలుగో స్థానం
తాడేపల్లి, సెప్టెంబర్ 7: జాతీయ స్థాయి జూనియర్ ఆర్చరీ పోటీల్లో తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడు ప్రాంతానికి చెందిన ఏడూరు అనూష రెడ్డి నాలుగో స్థానం పొందారు. పూనే ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి జూనియర్ ఆర్చరీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆమె పాల్గొన్నారు. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న అనూషరెడ్డి ఓల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
హైదరాబాద్ సభ విజయవంతం మంచి పరిణామం
గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 7: పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటి సారిగా ఎన్నో ఆటంకాలు ఎదురైనా హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సభ జయప్రదం కావడం మంచి పరిణామమని అవగాహన సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి రచయిత జాషువా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు ఎ హరి మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు, బెదిరింపులు ఎదురైనా రెచ్చిపోకుండా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబు, ఇతర నిర్వాహక సభ్యులు అభినందనీయులన్నారు. ఇంతకాలంగా హైదరాబాద్‌లో ప్రత్యేక రాష్ట్ర వాదన తప్ప మరొకటి వినిపించక పోవడమనే ఫాసిస్టు ధోరణి ప్రబలిపోయిందని, ఈ సభ సీమాంధ్రులకు స్ఫూర్తినిచ్చే విధంగా జరిగిందన్నారు. ఆంధ్ర ప్రయోజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు పిఎస్ మూర్తి మాట్లాడుతూ ఎంత రెచ్చగొట్టినా విద్వేష ప్రసంగాలు లేకుండా, రాజకీయ నాయకుల పాత్ర లేకుండా అంచనాకు మించి వచ్చిన జనంతో సేవ్ ఆంధ్రప్రదేశ్ విజయవంతమైందని తెలిపారు. ఈ సమావేశంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, విద్యావేత్త చంద్రయ్య, ఆర్‌వి సింగరయ్య, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
సమైక్య మట్టి గణపతి ప్రతిమల ఊరేగింపు
పొన్నూరు, సెప్టెంబర్ 7: ప్రకృతి, తోటి మనుషులోనూ సమైక్యంగా జీవించాలని, విడిపోవడం మన సంస్కృతి కాదన్న సూత్రాన్ని వినాయకచవితి చాటి చెబుతోందని పేర్కొంటూ పొన్నూరులోని లిటిల్‌జమ్స్ విద్యార్థులు ప్రత్యేకంగా మట్టితో రూపొందించిన సమైక్య గణపతి ప్రతిమలతో పురవీధుల్లో శనివారం ర్యాలీ జరిపారు. సమైక్యంగా జీవిద్దామని నినదిస్తూ మట్టి గణపతి ప్రతిమలతో విద్యార్థులు జరిపిన ప్రదర్శన పురఃప్రముఖులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో లిటిల్‌జమ్స్ సంస్థ డైరెక్టర్ ఎంఎల్ సుభాషిణి, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, గౌతమి తదితరుల నేతృత్వంలో విద్యార్థి నాయకులు రేష్మా, వౌనిక, సాయికీర్తి, సొహెల్, సంతోష్ నాయకత్వం వహించారు.

ఈతకు వెళ్లి శవమై తేలిన యువకుడు

నూజెండ్ల, సెప్టెంబర్ 7: ఈతకోసం గుండ్లకమ్మకు వెళ్లిన ఓ యువకుడు శవమై తేలాడు. ఈ సంఘటన మండలంలోని త్రిపురాపురం గుండ్లకమ్మ నదిలో శనివారం వెలుగుచూసింది. ఐనవోలు ఎస్‌ఐ శివాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వినుకొండ పట్టణం కట్టమీద బజారుకు చెందిన ఎస్‌కె మస్తాన్‌వలి కుమారుడు రసూల్ (20) గత ఆదివారం మిత్రులతో కలసి చాట్రగడ్డపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదికి వెళ్లాడు. అప్పటినుండి రసూల్ జాడ తెలియలేదు. తల్లిదండ్రులు స్నేహితులను విచారించగా తనతో వచ్చిన రసూల్ బయటకు వచ్చాడని, ఆ తదుపరి మాకు తెలియదని చెప్పారు. శనివారం త్రిపురాపురం గుండ్లకమ్మనదిలో గుర్తుతెలియని శవం ఉందని మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా తమ కుమారుడేనని తండ్రి మస్తాన్ గుర్తించారు. విఆర్‌వో మన్మోహన్ ప్రసాద్ శవపంచనామ నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఐనవోలు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

3 కోట్లతో ఆలయ అభివృద్ధికి చర్యలు

పెదకాకాని, సెప్టెంబర్ 7: మండల కేంద్రమైన పెదకాకానిలోని శివాలయం పాలకమండలి సమావేశం శనివారం దేవస్థాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కాజ అంకమ్మరావు అధ్యక్షత వహించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా నిలిచిపోయిన పలు పనులపై సమీక్షించారు. జాతీయ రహదారి నుండి దేవాలయం వరకు ఐదు అడుగుల సిసి రోడ్డు, ఆలయ ప్రాకార మండప నిర్మాణం, సరస్వతీదేవి ఆలయం, శాలహార ప్రాకార నిర్మాణం, శుక్రవారపు మండపం, దేవాలయ రాజగోపురం, జనరేటర్ గది, డార్మిటరీ నిర్మాణం, మెగా వాటర్ ట్యాంకు నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేసేందుకు సుమారు 3 కోట్ల రూపాయలను వెచ్చించేందుకు సమావేశంలో తీర్మానించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ వారి ఆమోదం పొంది భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ అంకమ్మరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఈమని చంద్రశేఖరరెడ్డి, పాలకమండలి సభ్యులు కె సాంబశివరావు, ఎ వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్యస్వామి, పి విజయబాబు, వెంకట్రావ్, సంజయ్, ఎ అమ్మణ్ణి, పి శశికుమార్, ఎక్స్ అఫిషియో సభ్యులు పిడిఎం ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

హ్యాపీసింగ్ మృతదేహం కోసం
ముమ్మరంగా గాలింపు
తాడేపల్లి, సెప్టెంబర్ 7: కిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం కనకదుర్గమ్మ వారిదిపై నుండి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విజయవాడ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన హ్యాపిసింగ్ మృతదేహం ఇంకా లభించలేదు. మృతదేహం కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్) ఎస్‌ఐ త్రిపాఠి, 35 మంది సిబ్బందితో కలిసి నాలుగు మరబోట్ల ద్వారా 30 కిలో మీటర్ల మేరకు కృష్ణానదిలో గాలించినప్పటికీ హ్యాపీసింగ్ మృతదేహం లభ్యం కాలేదు.
అదుపుతప్పిన ద్విచక్ర వాహనం
ఇద్దరు యువకుల మృతి
గురజాల, సెప్టెంబర్ 7: వేగంగా ప్రయాణీస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని అంబాపురం గ్రామసమీపంలో శనివారం జరిగింది. సంఘటన వివరాలప్రకారం...మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన గాదె సతీష్‌కుమార్‌రెడ్డి, అదే మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన దొండేటి ఆదినారాయణరెడ్డి ద్విచక్రవాహనంపై నడికుడి రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. హైదరాబాదునుండి రైలులో వస్తున్న తన స్నేహితుడిని తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై నడికుడి రైల్వేస్టేషన్‌కు వెళుతుండగా, మార్గమధ్యలోని కొత్త అంబాపురం గ్రామసమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సతీష్‌కుమార్‌రెడ్డి (19), ఆదినారాయణరెడ్డి (20)లు అక్కడికక్కడే మృతి చెందారు. సతీష్‌కుమార్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిల మృతదేహాలను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సతీష్‌కుమార్‌రెడ్డి గుంటూరులోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, ఆదినారాయణరెడ్డి పొలం పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈమేరకు గురజాల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
దారిదోపిడీ కేసులో ఆరుగురి అరెస్ట్
మంగళగిరి, సెప్టెంబర్ 7: జాతీయ రహదారిపై మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఈనెల 3వ తేదీన మోటారుసైకిళ్లు అడ్డుపెట్టి లారీని ఆపి కత్తితో బెదిరించి డ్రైవర్, క్లీనర్‌నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక వెండి ఉంగరం, 285 రూపాయల నగదును దోచుకున్న కేసులో నిందితులైన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నార్త్‌సబ్ డివిజన్ డిఎస్పీ ఎం మధుసూదనరావు వెల్లడించారు. శనివారం రూరల్ సిఐ కార్యాలయంలో సిఐ మురళీకృష్ణ, ఎస్సై నాగకుమారిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నిందితులను మీడియాకు చూపి కేసు వివరాలను డిఎస్పీ వివరించారు. ఎపి 16 టివి 3857 నెంబరు గల లారీలో డ్రైవర్ అచ్యుత రామకృష్ణ లక్ష్మీప్రసాద్, క్లీనర్ కల్లు శ్రీనివాసరావు ధాన్యం లోడుతో నాయుడుపేటకు వెళుతుండగా ఆత్మకూరు వద్ద దుర్గావైన్స్ ఎదుట నిందితులు మంగళగిరికి చెందిన మేకతోటి కిరణ్, ఆకురాతి రఘునాధ్, మేకతోటి హేమంత్, అత్తోట సతీష్, కొవిలి ఎఫ్రాయిం, ఆత్మకూరుకు చెందిన తోట శశివర్థన్ రెండు మోటారు సైకిళ్లతో వచ్చి లారీకి అడ్డుపెట్టి దోచుకున్నారు. బాధితుడు రామకృష్ణ లక్ష్మీప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా నిందితుల కోసం గాలిస్తుండగా చినకాకాని వద్ద ఉన్నట్లు సపాచారం అందడంతో సిఐ మురళీకృష్ణ అరెస్ట్ చేసి వారినుంచి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిస కావడం వల్లే 22 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న ఈ యువకులు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారని, వీరిపై షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నామని, నిఘా ఉంచుతామని, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను మంచిదారిలో పెట్టుకోవాల్సిందిగా కోరతామని డిఎస్పీ మధుసూదనరావు వెల్లడించారు. తల్లిదండ్రులు పట్టించుకోక పోవడం వల్లే వీరు వ్యసనాలకు బానిసలయ్యారని ఆయన పేర్కొన్నారు.
అదుపులోకి వచ్చిన జ్వరాలు
* జిల్లా అదనపు వైద్యాధికారిణి నాగమల్లేశ్వరి
భట్టిప్రోలు, సెప్టెంబర్ 7: గత రెండు మాసాలుగా విజృంభిస్తున్న సీజనల్ జ్వరాలు అదుపులోకి వచ్చినట్లు జిల్లా అధనపు వైద్యాధికారిణి డాక్టర్ నాగేమల్లేశ్వరి అన్నారు. మండల కేంద్రమైన భట్టిప్రోలు దళితవాడలో శుక్రవారం జయమ్మ (40), చల్లపల్లి నాగేంద్రం(55)లు జ్వరాల కారణంగా మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపిన నేపథ్యంలో శనివారం స్థానిక పిహెచ్‌సి సిబ్బందితో నాగమల్లేశ్వరి ఆయా కుటుంబాల వద్ద వివరాలు సేకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విష జ్వరాల కారణంగా వారు మృతి చెందలేదని, నాగేంద్రం గుండెపోటుతో మృతిచెందగా, జయమ్మ సాధారణ మరణంగా గుర్తించినట్లు చెప్పారు. అనంతరం స్థానిక పిహెచ్‌సిలో నాగమల్లేశ్వరి వైద్యసిబ్బందితో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా1.16లక్షల మంది ప్రజలు జ్వరాల బారిన పడ్డారని వారిలో తెనాలి డివిజన్‌లో ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. వైద్యశాలలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేయించామన్నారు. ఆమెవెంట జిల్లా మలేరియా వైద్యాధికారి జనార్ధన్, పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ రవి, వెల్లటూరు వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.

హత్యకేసులో నిందితుల అరెస్టు

మాచర్ల, సెప్టెంబర్ 7: పాత కక్షల నేపథ్యంలో గత నెల 21వ తేదీన దుర్గి మండల పరిధిలోని కంచకరగుంట గ్రామంలో పొలాల్లో వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులను శనివారం మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్‌పీ మెయిన్ కెనాల్ పక్కన అరెస్టు చేసినట్లు గురజాల డీయస్పీ ఇంజారపు పూజ తెలిపారు. రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డీయస్పీ పూజ మాట్లాడుతూ దుర్గి మండల పరిధిలోని కంచరగుంట గ్రామానికి చెందిన శ్రీపతి చెన్నయ్యను అదే గ్రామానికి చెందిన చవకాల మస్తానయ్య, చవకాల నాగబ్రహ్మయ్య, చవకాల సాయిబాబు, గోపిదేవి నాగరాజు, శ్రీనివాసరావుతో పాటు హత్యకు సహకరించిన బంధువులు మొత్తం 6గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీయస్పీ తెలిపారు.
దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు
ఈనెల 2వ తేదిన పాత మాచర్లలో ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి నగలు దోచుకెళ్ళిన కేసులో నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు గురజాల డీయస్పీ తెలిపారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, విజయపురిసౌత్ ఎస్ సింగయ్య స్థానిక కొత్తపల్లి అడ్డరోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా ముద్దాయి వీరంశెట్టి శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద ఉన్న చోరికి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు.

సమైక్యాంధ్ర సాధనకు పార్టీలకతీతంగా ఉద్యమించాలి
మాచర్ల, సెప్టెంబర్ 7: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీమాంధ్రకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఉద్యమంలోకి రావాలని ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి పిలుపు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం వైయస్సార్‌సీపీ మహిళా విభాగం చేపట్టిన రిలే నిరాహారదీక్షలను ఎమ్మెల్యే పీఆర్కే ప్రారంభించి మాట్లాడుతూ సమైక్య ఉద్యమంపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు షర్మిల బస్సుయాత్ర చేపట్టారని అన్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన ఇచ్చేంత వరకు ఉద్యమం కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ బత్తుల ఏడుకొండలు మహిళా విభాగం నాయకురాలు పద్మ, పట్టణ యువజన విభాగం కన్వీనర్ తురకా కిషోర్, పట్టణ కన్వీనర్ పోలూరి నరసింహారావు ఉన్నారు.
ఆటోవాలల సంఘీభావం
రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని అన్నదమ్ముల్లా ఉన్న ఇరు ప్రాంతాలకు చెందిన వారి మధ్య చిచ్చుపెట్టవద్దంటూ శనివారం పర్నాడు సాగరుమాత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ విభజనతో రాష్ట్రంలోని కార్మిక, కర్షక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదు సీమాంధ్ర నుండి విడిపోతే సుమారు 50 సంవత్సరాలు వెనక్కు పోతామని ఆందోళన వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
కర్లపాలెం, సెప్టెంబర్ 7: సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ జెఏసి ఆధ్వర్యంలో స్థానిక ఐలాండ్ సెంటర్‌లో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారంకు ఐదవరోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు షేక్ జున్నా ప్రారంభించారు. శిబిరంలో మహిళా ఉపాధ్యాయినిలు అనసూయదేవి, పద్మావతి దేవి, చారులత, ఝాన్సీలక్ష్మి, ఆదిలక్ష్మిలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రకటనను కేంద్రం చేసేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
మోకాళ్ళపై నిలబడి విద్యార్థినుల వినూత్న నిరసన
వినుకొండ, సెప్టెంబర్ 7: వినుకొండ నియోజకవర్గ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక ఆర్టీసి బస్టాండ్ డిపోఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారంనాటికి పదోరోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని వెలుగొండ ప్రాజెక్టు సబ్‌డివిజనల్ ఇంజనీర్ యు విజయలక్ష్మీ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. సాగు, తాగునీటికి సీమాంధ్రప్రజలు అలమటిస్తారన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడాలని కోరారు. జడ్పీ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయినులు ఎన్‌సిహెచ్‌పిజె లక్ష్మీ, ఎం లావణ్య మాట్లాడుతూ సీమాంధ్రప్రజల కోసం సమ్మెలో పాల్గొన్నప్పటికీ, పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సమ్మె చేస్తున్నామన్నారు. సమ్మె అనంతరం విద్యార్థుల సిలబస్‌ను పూర్తిచేస్తామన్నారు. రోడ్డుపైనే విద్యార్థినీ విద్యార్థులు ఆట,పాటలతో గడిపారు. రాష్టవ్రిభజనకు నిరసనగా విద్యార్థులు మోకాళ్ళపై నిలబడి నిరసనను వ్యక్తంచేశారు. రిలే నిరాహారదీక్షాశిబిరంలో ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

రేపల్లెలో సమైక్యాంధ్ర సునామి

రేపల్లె, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి సమైక్యాంధ్ర ఒక్కటే మార్గమని రాష్ట్ర రైతు సమాక్య నాయకులు కేసన శంకరరావు అన్నారు. రేపల్లె మండలంలోని జాట్రగడ్డ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తాయి. ఈసందర్భంగా ముఖ్య అతిథి కేసన శంకరరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ద్వారా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలుచేసి తెలుగుతల్లిని కన్నీటికి గురిచేసిన ఘనత సోనియాకు తక్కుతుందని విమర్శించారు. విభజనవల్ల డెల్టా ప్రాంతం ఎడారిగా మారపోతుందన్నారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధంచేసి సమైక్యాంధ్ర నినాదాలతో గ్రామం మారుమోగింది. బుచ్చిరామకృష్ణ, గంగాధరరావు, తిరుపతిరావు, కెకె రావు, సుజాత పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయుల నిరసన
వినుకొండ, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్థానిక పల్నాడు రోడ్డులో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారంనాటికి ఆరోరోజుకు చేరుకున్నాయి. దీక్షాశిబిరాన్ని ప్రముఖ నేత్రవైద్యులు డాక్టర్ దస్తగిరి ప్రారంభించారు. దీక్షలో ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని కూర్చున్నారు. జిల్లా యుటిఎఫ్ గౌరవాధ్యక్షులు ఎ నాగేశ్వరరావు, తదితరులు కూర్చున్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దీక్షాశిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఎమ్మెల్యే ఆంజనేయులు సిడబ్యూసి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంతవరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దాడిని ఖండించిన న్యాయవాదులు
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర న్యాయవాదులు హైకోర్టు వద్ద శాంతియుతంగా మానవహారాన్ని చేస్తుండగా, తెలంగాణా న్యాయవాదులు, గుర్తుతెలియని తెలంగాణా మద్దతుదారులు సీమాంధ్ర న్యాయవాదులపై దాడి చేయడాన్ని పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధయ్య, తదితరులు శనివారం స్థానిక జూనియర్ సివిల్‌జడ్జికోర్టు ఎదుట నిరసనను వ్యక్తం చేశారు. దాడి చేసినవారిని అరెస్ట్ చేయకుండా సీమాంధ్ర న్యాయవాదులను అరెస్ట్‌చేయడాన్ని ఖండించారు.
కొనసాగుతున్న టిడిపి రిలే నిరాహారదీక్షలు
రాష్ట్ర విభజనను నిరసిస్తూ వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో స్థానిక శివయ్య స్థూపం సెంటర్‌లో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం నాటికి ఎనిమిదోరోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో బొల్లాపల్లి టిడిపి నాయకులు మేరాజోత్ హనుమానాయక్, షేక్ సుభాని, పువ్వాడ వీరాంజనేయులు, పత్తి వెంకట్రావు, వి వెంకటకోటేశ్వరరావు, నాగరాజు, దాసరి చక్రవర్తి, గురవయ్య, రవి పాల్గొన్నారు. దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించి మాట్లాడుతూ యుపిఎ స్వార్థ రాజకీయాల కోసమే తెలుగుజాతిని రెండుముక్కలు చేసిందని విమర్శించారు.

కొనసాగుతున్న ఉద్యోగ జేఏసి రిలే నిరాహారదీక్షలు
నరసరావుపేట, సెప్టెంబర్ 7: స్థానిక ఆర్డీవో కార్యాలయంవద్ద ఉద్యోగ జేఏసి ఆధ్వర్యంలో చేస్తున్న సమైక్యాంధ్ర రిలే నిరాహారదీక్షలు శనివారం నాటికి 26వరోజుకు చేరుకున్నాయి. దీక్షాశిబిరంలో హిందూస్కూల్ డైరెక్టర్ పివి రావు, ప్రిన్సిపల్ శివప్రియ, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ బాలుర పాఠశాల ఎన్‌సిసి విద్యార్థులు పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. పలు కూడళ్ళల్లో ఎన్‌సిసి విద్యార్థులు కవాతును నిర్వహించారు. హిందూస్కూల్ విద్యార్థినీ విద్యార్థులు దీక్షాశిబిరంలో దేశభక్తిగీతాలు, కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

సమైక్యాంధ్రకోసం కాంగ్రెస్‌ను వీడేందుకైనా సిద్ధమే
బాపట్ల, సెప్టెంబర్ 7: రాష్ట్రాన్ని విభజించడానికి సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం సరికాదని, సమైక్యాంధ్రప్రదేశ్‌ను సాధించడానికి ఇప్పటికే పదవికి రాజీనామా ఇచ్చిన తాను కాంగ్రెస్‌ను వీడడానికైనా సిద్ధమేనని ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోమ్ ఆవరణలో నిర్వహించిన సమైక్యాంధ్ర జెఎసి సమావేశంలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి సమైక్యాంధ్ర కోసం ఎంతటిపోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించి, సభ్యులందరిచే సమైక్యాంధ్ర నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాతబస్టాండ్ ఆవరణలో సీనియర్ సిటిజన్స్ పాల్గొన్న రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని, లేకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం కానున్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎపిఎన్జీఓల సదస్సు జయప్రదం కావడం పట్ల సమైక్యాంధ్ర జెఎసి బాపట్ల చైర్మన్ అంబటి మురళీకృష్ణ, సివిల్ సొసైటి కోఆర్డినేటర్ అల్లం గోపికృష్ణ, ఉపాధ్యాయ జెఎసి నేతలు హర్షం ప్రకటించారు.
కొనసాగుతున్న దీక్షలు
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరం 36వ రోజుకు చేరగా, వెదుళ్లపల్లి సెంటర్‌లో సామూహిక నిరసన దీక్షలు 13వరోజుకు చేరాయి.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>