ాకాల, సెప్టెంబర్ 7: తిరుపతి, చిత్తూరు జాతీయ రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట మలుపు వద్ద శనివారం తెల్లవారుజామున లారీ చింతచెట్టును ఢీకొనడంతో డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే మృతిచెందారు. కాగా మృతులు ఇద్దరు విజయవాడకు చెందినవారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి తిరుపతికి క్యాబేజీ లోడుతో బయలుదేరిన లారీ తెల్లవారుజామున నేండ్రగుంట వద్ద చింతచెట్టును ఢీకొంది. దీంతో విజయవాడ వెంకటేశ్వరనగర్కు చెందిన లారీడ్రైవర్ శ్రీనివాసరావు(42), క్లీనర్ శివ(32) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మలుపు వద్ద వేగంగా వచ్చిన లారీ చింతచెట్టును ఢీకొనడంతో లారీ ధ్వంసం కాగా డ్రైవర్, క్లీనర్ దేహాలు తునాతునకలయ్యాయి. సమాచారం అందుకున్న పాకాల సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ మురళీమోహన్ సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఇద్దరు మృతిచెందారు. శవాలను శవపరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం, మలుపును గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
* డ్రైవర్, క్లీనర్ దుర్మరణం
english title:
c
Date:
Sunday, September 8, 2013