Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విభజన జరిగితే అంధకారమే

$
0
0

వినుకొండ/ రేపల్లె, సెప్టెంబర్ 11: యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి తన పుత్రుడు రాహుల్‌గాంధీపై ఉన్న మమకారం రాష్ట్రప్రజలపై లేదని, దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్‌సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. సమైక్య శంఖారావ బస్సుయాత్ర బుధవారం పట్టణానికి చేరుకుంది. వినుకొండ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహంవద్ద వైఎస్ షర్మిల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆంధ్రరాష్ట్రాన్ని విభజన చేసి తెలుగుప్రజల మధ్య సోనియాగాంధీ చిచ్చుపెట్టారన్నారు. రాష్టవ్రిభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విద్యార్థులు, వివిధ జేఏసి సంఘాల ఆధ్వర్యంలో గత 40రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే యుపిఎ ప్రభుత్వం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్టవ్రిభజనకు అంగీకారం తెలుపుతూ చంద్రబాబునాయుడు గతంలో కాంగ్రెస్‌ప్రభుత్వానికి పంపించి, ప్రస్తుతం సీమాంధ్రులను నమ్మించేందుకు చేస్తున్న ఆత్మగౌరవ బస్సుయాత్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మంత్రులు పదవులకు రాజీనామా చేయకుండా సీట్లకోసం పాకులాడుతున్నారని షర్మిల విమర్శించారు. రాష్టవ్రిభజనపై తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో ఈ రెండుపార్టీలకు సీమాంధ్రులు గుణపాఠం చెబుతారన్నారు. ఎప్పుడూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడి సామాన్యుల హృదయాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గూడు కట్టుకున్నారని వైసిపి నాయకురాలు షర్మిల అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కేంద్రప్రభుత్వం మూలికే నక్కపై తాటికాయపడ్డ చందంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ తదితర ధరలను పలుమార్లు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కేసులు నమోదు చేసి జైలుపాలు చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీకే చెల్లిందన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు రాజీనామాలు చేసి, ఉద్యమాల్లోకి వస్తే కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేయకుండా డ్రామాలు ఆడుతున్నారని ఘాటు విమర్శించారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో చేసిన బస్సుయాత్రలో ఎక్కడా సమైక్యవాదం పదాన్ని వాడకుండా జాగ్రత్తపడ్డారన్నారు. ప్రజల ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకనే బాబు ఆత్మగౌరవ యాత్రకు ముగింపు పలికారన్నారు. సమైక్యశంఖారావయాత్రకు వినుకొండ నియోజకవర్గంలోని వేలాది మంది ప్రజలు సభావేదిక వద్దకు చేరుకుని షర్మిల రాకకోసం ఎదురుచూశారు. ఉదయం తొమ్మిది గంటలకు పట్టణానికి చేరుకోవాల్సిన వైఎస్ షర్మిల బస్సుయాత్ర మధ్యాహ్నం 12.30గంటలకు చేరుకున్నారు. సభానంతరం పొన్నూరు మీదుగా రేపల్లె చేరుకున్న షర్మిలకు కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అక్కడ ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. కాగా వినుకొండ పట్టణానికి తొలిసారిగా వచ్చిన వైఎస్ షర్మిలను చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్‌ను జైలులో పెట్టించారన్నారు. సీమాంధ్ర ప్రజలకోసం జగన్ జైలులో ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే, ప్రభుత్వం జగన్ దీక్షను భగ్నం చేసిందన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలునుండి బయటకు వచ్చి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ సిఎం అయితే పేదప్రజలకు సంక్షేమపథకాలు అందుతాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తొలుత వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, రావి వెంకటరమణ, కావటి మనోహర్, నసీర్ అహ్మద్, సాయిబాబు, దేవళ్ళ రేవతి, వినుకొండ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ నన్నపనేని సుధ తదితరులు ప్రసంగించారు. ఈకార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ లతీష్‌రెడ్డి, కె చెన్నకేశవరెడ్డి, చికెన్‌బాబు , బాజీ, అనుమాల నాసర్‌రెడ్డి, పుల్లారెడ్డి, శివారెడ్డి, వెంకిరెడ్డి, అంజిరెడ్డి, సుబ్బారెడ్డి, గౌస్ మొహిద్ధీన్, సుప్రీం, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానంద’
గుంటూరు, సెప్టెంబర్ 11: భారతదేశ గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని చికాగో సర్వసభ సమ్మేళనంలో అంతర్జాతీయంగా చాటిచెప్పిన మహానీయుడు, ధీరోదాత్తుడు స్వామి వివేకానంద అని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ శ్లాఘించారు. బుధవారం స్వామి వివేకానంద 150 జయంతి ఉత్సవ సభ స్థానిక పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వార్థచింతన వీడి దేశం కోసం తమ జీవితాలను మలుచుకోవాలని స్వామివివేకానంద పిలుపునిచ్చారని, ఆయన చూపిన బాటను అనుసరించాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉందన్నారు. ఆయన గొప్పతనం తెలియాలంటే చికాగో సభలో చేసిన ప్రసంగం చదవాలని తెలిపారు. జిల్లా రూరల్ ఎస్‌పి సత్యనారాయణ మాట్లాడుతూ యువతలో దాగివున్న శక్తిని వెలికితీసి ఉన్నత విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అర్బన్ జిల్లా ఎస్‌పి రమణకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మార్కులు సాధించడమే లక్ష్యంగా భావించక జీవితాన్ని అన్ని కోణాల్లో ఆవిష్కరించుకోవాలని సూచించారు. మాజీ ఐఎఎస్ అధికారి, స్వామి వివేకానంద 150 జయంతి ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ సి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి దశ, దిశా చూపించిన ధీరోదాత్తుడు వివేకానంద అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వర్లు, వి బాబు, స్వామీజీలు, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు వివేకానంద ముఖచిత్రంతో రూపొందించిన టీషర్ట్‌లు ధరించి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

తంగెడ వద్ద కృష్ణానదిలో యువకుడి గల్లంతు

దాచేపల్లి, సెప్టెంబర్ 11: మండలం తంగెడ వద్ద గణేష్ నిమజ్జనోత్సవానికి వెళ్లిన యువకుడు ప్రమాద వశాత్తు కృష్ణానదిలో మునిగి గల్లంతయిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన గోపి (18) అనే యువకుడు గణేష్ నిమజ్జనోత్సవానికి తంగెడ వద్ద కృష్ణానదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలోపడి మునిగి గల్లంతయ్యాడు. సమీపంలో ఉన్న జాలర్లు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాచేపల్లి ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటన ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యను ముమ్మరం చేశారు.
కదంతొక్కుతున్న సమైక్యవాదులు

* 16వ తేదీ నుండి 72 గంటల విద్యాసంస్థల బంద్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, సెప్టెంబర్ 11: ఎందరో మహానుభావుల త్యాగఫలితంగా సిద్ధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయంపై సమైక్యవాదులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళనలతో కదంతొక్కుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని గత 43 రోజులుగా నగరంలో ఎన్జీవోలు, పలు కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకో, ఆందోళన కార్యక్రమాలతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమై విభజనాగ్రహ సెగలు నింగినంటుతున్నాయి. విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఈనెల 16 తేదీ నుంచి 72 గంటల పాటు విద్యాసంస్థల బంద్‌కు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 16,17,18 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు బంద్‌కు సహకరించి, సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేలా చూడాలని జెఎసి జిల్లా కన్వీనర్ నిమ్మకాయల చక్రి, నూనె పవన్‌తేజ, రావిపాటి సాయికృష్ణ తదితరులు పిలుపునిచ్చారు. కాగా ఈనెల 13వ తేదీన స్థానిక మహిమా గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి విద్యార్థి యువజన రాష్ట్ర కన్వీనర్ షేక్ జిలాని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన పోస్టర్‌ను నాయకులు బిక్కునాయక్, భట్టు ప్రవీణ్, సయ్యద్ కలాం, సిద్ధార్ధ, రాజేష్ తదితరులు ఆవిష్కరించారు. ఇలా ఉండగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక గుంటూరు జిల్లా నేతృత్వంలో గురువారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎపి ఎన్జీవోల గుంటూరు తాలూకా యూనిట్ అధ్యక్షుడు డి దయానందరాజు, కార్యదర్శి కెఎన్ సుకుమార్‌లు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరంవద్ద నుండి హిందూ కళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వరకూ వేలాది మంది ఉద్యోగులతో కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్రను కోరుతూ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. చేనేతలు పొడుగును ప్రదర్శిస్తూ, ట్రాక్టర్‌పై మగ్గం, రాట్నం, చిన్నారులు తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ వేషధారణలు ధరించి జడివానలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీ ప్రజలను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నా మాస్టారు, నాయకులు రాఘవేంద్రరావు, మల్లిఖార్జునరావు, ఉడుతా పెద్దన్న, గోలి వెంకటేశ్వరరావు, సిహెచ్‌వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహిళా ఉద్యోగులు రిలే దీక్షలను కొనసాగించారు. 29వ రోజుకు చేరిన ఈ దీక్షలో గోగులమూడి అనురాధ, జి సరోజిని దేవి పాల్గొనగా సంఘ సభ్యురాలు కె ఝాన్సీలక్ష్మి దీక్షలను ప్రారంభించారు. కాగా గురువారం సమైక్యాంధ్ర ఉద్యమంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కోనా దేవదాసు, ప్రాంతీయ కార్యదర్శి ఎస్‌ఎం సుభాని ప్రకటించారు. సమైక్యాంధ్ర సాధన కోసం న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాద గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. న్యాయశాఖ సిబ్బంది పి ఝాన్సీలత, కెఎస్‌విఎన్ దుర్గరాజు, టివి కృష్ణారావు దీక్షలో పాల్గొనగా గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జెఎసి కన్వీనర్ ఎల్‌విఎస్ మూర్తి దీక్షలను ప్రారంభించారు. బార్ మాజీ ఉపాధ్యక్షురాలు వై పార్వతి, ముంతాజ్‌బేగం, లక్ష్మీశైలజ, సృజన లక్ష్మీప్రసన్న తదితర న్యాయవాదులు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పాత గుంటూరులోని పార్కు సెంటర్‌లో వినాయకునికి లక్ష దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జెఎసి రాష్ట్ర కోఆర్డినేటర్ మండూరి వెంకటరమణ, వేమూరి సూర్యం, ఎలుకా వీరాంజనేయులు, సౌపాటి రత్నం, జి గోపి, షేక్ ఇమామ్, కె రవితేజ, నంద తదితరులు పాల్గొన్నారు.

ధీరోదాత్త గుణ సంపన్నుడు స్వామి వివేకానందుడు

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 11: భారతీయ సనాతన ధర్మ వాణిని చికాగో సర్వమత మహాసభలో వినిపించి, ప్రపంచ ప్రజలు, అంతర్జాతీయ మేధావుల దృష్టినాకర్షించిన స్వామి వివేకానంద ధీరోదాత్త గుణ సంపన్నుడని పలువురు కొనియాడారు. మేధావుల్లో మేధావిగా, ఆధ్యాత్మిక సాధకుల్లో అగ్రగణ్యుడిగా, మహనీయ మూర్తిగా కీర్తిపొందిన స్వామి వివేకానంద 150వ జయంతి మహోత్సవాన్ని బుధవారం నగరంలోని పలు సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ప్రదర్శనలు కూడా జరిగాయి. స్వామి వివేకానంద సూక్తులు ప్రబోధించిన అమృత వాక్కులన్నీ భారతీయ సమాజానికి మరిముఖ్యంగా, యువతకు కరదీపికలని వక్తలు పేర్కొన్నారు. వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువతరం అన్ని రంగాల్లో అభ్యుదయ పథంలో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. పలుచోట్ల స్వామి వివేకానంద నిలువెత్తు చిత్రపటాలకు పుష్పమాలలు అర్పించారు. మనపై మనకు విశ్వాసం కలిగితే భగవంతునిపై విశ్వాసం అదే సిద్ధిస్తుందని, తద్వారా మానవాభ్యున్నతికి సోపానమవుతుందని శ్రీ శివకల్యాణానంద భారతీస్వామి, శ్రీనాధ పీఠ సంచాలకులు, కవి పిఎస్‌ఆర్ ఆంజనేయ ప్రసాద్, ఆధ్యాత్మిక శిరోమణి జి రామతులసమ్మ, స్వాతంత్య్ర సమరయోధురాలు పివి సుశీలాదేవి, వెంకటేశ్వరస్వామి దేవాలయ పాలకవర్గ సభ్యులు, సంస్కృత భారతి, హిందూసేన తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు.
సమైక్యతే మా నినాదం... విభజిస్తే ఊరుకోం
* ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 11: రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ నినాదమని, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకుంటే ఊరుకోబోమని టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మూడు ప్రాంతాల వారు అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను వదిలి వెళ్లేది లేదన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా కీలుబొమ్మగా మారారని, రాష్ట్ర విభజన అంశంపై రాష్టప్రతి జోక్యం చేసుకోవాలని కోరారు. ఎపి ఎన్జీవోల సభ విజయవంతమైన నాటి నుండి తెలంగాణ నేతలు రోజుకో విధంగా వ్యాఖ్యలు చేస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తెలంగాణాలో టిఆర్‌ఎస్‌తో, సీమాంధ్రలో వైఎస్‌ఆర్ సిపితో పొత్తులు పెట్టుకుని తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రధానిని కలవాలని తమ పార్టీ అధినేత కోరితే అవకాశం కల్పించలేదని, విజయమ్మ కోరగానే వెంటనే అవకాశం కల్పించడాన్ని చూస్తే వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందం అర్థమవుతుందన్నారు. షర్మిల యాత్రలో జగన్ బయటకు వస్తారని ప్రకటించడంతోనే జగన్ కేసులు నీరుగారుతున్నాయన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, చంద్రగిరి ఏడుకొండలు, కొర్రపాటి నాగేశ్వరరావు, మానుకొండ శివప్రసాద్, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

చేనేత సంక్షేమానికి కృషి : మురుగుడు

మంగళగిరి, సెప్టెంబర్ 11: చేనేత పరిశ్రమ, కార్మికుల సంక్షేమం, చేనేత సొసైటీల మనుగడకు కృషి చేస్తానని ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు అన్నారు. బుధవారం స్థానిక మార్కండేయ కల్యాణ మండపంలో చేనేత సొసైటీలు, వస్త్ర ఉత్పత్తిదారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో చేనేత పరిశ్రమపై జిల్లాస్థాయి సమీక్షను మురుగుడు నిర్వహించారు. ఈ సందర్భంగా మురుగుడు మాట్లాడుతూ చేనేత పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వంతో చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ ప్రభుత్వం రద్దు చేసిన రిబేటును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరతామని, చేనేత సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని అన్నారు. చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ చేనేత వస్త్ర విక్రయాలపై ప్రభుత్వం ఇస్తున్న 20 శాతం రిబేటు పథకాన్ని కొనసాగించాలన్నారు. సొసైటీలకు ఆప్కో చెల్లించాల్సిన బకారు

* సమైక్య శంఖారావ సభలో వైఎస్ షర్మిల
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>