Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆగ్రహజ్వాలలు

$
0
0

విజయనగరం, సెప్టెంబర్ 11: బంద్‌లు..ర్యాలీలు.. రాస్తారోకోలు..మానవహారాలు..మోకాలిపై నిరసనలు..వంటావార్పు... దిష్టిబొమ్మల దగ్ధంతో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు ఉద్దృతమవుతొంది. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు సమైక్యాంధ్ర ఉద్యమం చేపడుతుండగా, మిగిలిన సంఘాలు ఏకత్రాటిపైకి వచ్చి నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేయనున్నట్టు స్పష్టం చేశాయి. బుధవారం ఐకాసా ఆధ్వర్యంలో 17 సంఘాలు కలసి సంయుక్తంగా ఐకాసగా ఏర్పడ్డారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ అశోక్‌బాబు నిర్ణయాలను జిల్లా అంతటా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఐకాసకి చైర్మన్‌గా గంటా వెంకట్రావు, మిగిలిన సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు కన్వీనర్లు, కో-కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గంటా వెంకట్రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం అనేక నిరసనలు చేపట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని మండిపడ్డారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ఈ నెల 12న అర్థరాత్రి నుంచి 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో స్వచ్చందంగా పాఠశాలలు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించిన ప్రభూజీ మాట్లాడుతూ గత 45 రోజులుగా సమైక్యాంధ్ర కోసం పోరాటం సాగిస్తున్నట్టు తెలిపారు. నూతన చైర్మన్‌గా గంటా వెంకట్రావును ఎన్నుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. 13న కేంద్ర కార్యాలయాల ముట్టడి, 14న మహిళా ఉద్యోగులతో కోట జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరీ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. 15, 16 తేదీల్లో రాష్టస్థ్రాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వివరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఈ బంద్‌లో ఆసుపత్రులు, మెడికల్ షాపులకు మినహాయింపునిచ్చినట్టు చెప్పారు. కన్వీనర్ డి.ఈశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని 34 మండలాల్లో ఈ బంద్‌ను పాటిస్తామని స్పష్టం చేశారు.
. ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్టు సమాచారం.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోనియా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెనక్కి నడిచారు. పట్టణంలోని మయూర జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఈ నడక సాగింది. అనంతరం అక్కడ కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పూసపాటిరేగలో జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి రాస్తారోకో నిర్వహించారు. గుర్లలో మోటార్ బైక్‌పై ర్యాలీ నిర్వహించారు. ఈ విధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సమైక్యాంధ్ర కోసం నిరసనలు పెల్లుబుకుతున్నాయి.
కళ్లకు గంతలు కట్టుకొని వెనక్కి నడిచిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణా విభజనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని మయూర జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కళ్లకు గంతలు కట్టుకొని వెనక్కి నడిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్నామన్నారు. తెలంగాణా ప్రకటన వెలువడినప్పటి నుంచి రాష్ట్ర విభజన ఆపాలని ఉద్యమం చేస్తున్నామన్నారు. జిల్లాలో మొదట తామే రిలే దీక్షలు చేపట్టి ఇతరులకు మార్గదర్శకులుగా నిలిచామన్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తే ఇక్కడ పార్టీ బలంగా లేనందున రాష్ట్రం నుంచి నాయకులను రప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత 30 ఏళ్లుగా అశోక్‌గజపతిరాజు తన ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు పిల్లా వినాయకమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న, రాజేష్, వేణు, పట్నాన పైడిరాజు, అబ్ధుల్ కరీమ్ తదితరులు పాల్గొన్నారు.
బొత్స క్యాంపు కార్యాలయంపై రాళ్లు విరిసిన దుండగులు
గరివిడి : సమైక్యాంధ్ర ఉద్యమ సెగ రాష్ట్ర మంత్రి, పిపిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంపై రాళ్లు రువ్విన సంఘటనకు దారితీసింది. బుధవారం ఉదయం (మిగతా 2వ పేజీలో)
గుర్తు తెలియని దుండగులు గరివిడిలోని మంత్రి బొత్స క్యాంపు కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో ముందుభాగంగాలోని అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గత కొంత కాలంగా మంత్రి సత్యన్నారాయణపై జిల్లా వ్యాప్తంగా సమైవాదులు లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో గరివిడి క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ రాళ్లు రువ్విన సంఘటన జరగడంతో అప్రమత్తం అయ్యారు. చీపురుపల్లి సర్కిల్ ఇన్స్‌పెక్టర్, స్థానిక ఎస్సై కాంతికుమార్, సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాళ్లు రువ్విన సంఘటనలో నిందితుల కోసం ఆరా తీస్తున్నారు. బొత్స తన సొంత నియోజకవర్గంలో సమైక్యవాదుల నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం కాంగ్రెస్ వర్గీయులలో చర్చనీయంసం అయింది.
పంట రుణాల మంజూరులో రూ.80 లక్షలు గోల్‌మాల్?
సాలూరు, సెప్టెంబర్ 11 : పట్టణంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో పంట రుణాల మంజూరులో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై త్రిసభ్య కమిటీ బుధవారం విచారణ చేపట్టింది. బ్యాంకులో నకిలీ పత్రాలతో పంట రుణాలు పొందిన వైనం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పంట రుణాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించడంతో అక్రమాలు జరిగినిట్లు భోగట్టా. ఒక పంట వేసి వేరొక పంట కింద రుణాలు పొందారు. ఎక్కువ మంది రైతులు చెరకు పంట సాగు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపి రుణాలు పొందినట్టు బృందం గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బిసిల కింద ఈరుణాలు పొందారు. లబ్ధిదారులకు మంజూరైన రుణానికి, రైతులకు అందిన రుణానికి మధ్య వ్యత్యాసం ఉందని విచారణ బృందంలోని సభ్యులు రమణ, రమణమూర్తి, నాయుడులు గుర్తించారు. దీంతో పంట రుణాలు మంజూరు వ్యవహారంపై పూర్తి విచారణ కొనసాగించారు. ఈఏడాది కొత్తగా మంజూరు చేసిన రుణాలను కూడా పరిశీలించారు. 160 రుణాలకు సంబంధించి విచారణ చేస్తున్న బృందం , తహశీల్దార్, విఆర్‌ఓల సంతకాలతోపాటు ఇతర ధ్రువపత్రాలు నకిలీవిగా గుర్తించారు. మధ్యవర్తుల పాత్రపై వారు విచారణ కొనసాగిస్తున్నారు. సుమారు 80 లక్షల రూపాయల మేరకు దుర్వినియోగం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విషయమై బ్రాంచి మేనేజర్ భీమరాజును వివరణ అడగ్గా, రైతులు ఆయిల్‌పామ్ వేసి చెరకు పంట వేసినట్టు రుణాలు పొందారని చెప్పారు. అయితే ఫోర్జరీ పత్రాలతో అడంగల్ సర్ట్ఫికేట్లను జతపరిచినట్టు పేర్కొన్నారు. రుణాల మంజూరుపై విచారణ కొనసాగుతున్న విషయం వాస్తవమేనని అన్నారు.
సమైక్యాంధ్ర
ఉద్యమం.. ఉద్ధృతం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం గత 45 రోజులుగా అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు అన్నారు. బుధవారం ఇక్కడ ఇందిరానగర్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో మానవహారం, వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం రావణకాష్టంలా తగలబడిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఎందుకు వౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారంలో ఉన్న వాళ్లకి కనీస బాధ్యతలను నిర్వర్తించాలి గదా అని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం చెలరేగినపుడు శ్రీకృష్ణ కమిటీని నియమించారని, ఆ కమిటీ అన్ని అంశాలను ప్రస్తావించిందన్నారు. అయితే వాటిమీద ఏం మాట్లాడకుండా ఏకపక్షంగా తెలంగాణ విభజన నిర్ణయాన్ని ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్లు ఏం చేయబోతున్నారో స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ పిసిసి నేత బొత్స తెలంగాణాకు అనుకూలంగా మద్దతునిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉద్యమం చేపట్టడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి.ఎస్.ప్రసాద్, ఎస్‌ఎన్‌ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ చేపట్టిన అయ్యప్ప భక్తులు
విజయనగరం (కంటోనె్మంట్): సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో బుధవారం అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. పూల్‌భాగ్ అయ్యప్పస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మయూరి కూడలి వద్ద మానవహారం చేపట్టారు. అనంతరం కన్యకాపరమేశ్వరీ ఆలయానికి చేరుకుని అక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గురుస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పత్తిగిల్లి మోహనరావు, ఒబ్బిలిశెట్టి భానుప్రకాష్, కె.కామేశ్వరరావు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్టవ్రిభజన జరిగితే మున్సిపాలిటీల ప్రగతి అధోగతే
విజయనగరం (్ఫర్టు) : రాష్టవ్రిభజన జరిగితే సీమాంధ్రలో మున్సిపాలిటీల ప్రగతి ఆథోగతిపాలవుతుందని మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.అప్పయ్యశెట్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన రిలేనిరాహారదీక్షలో మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పయ్యశెట్టి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా రాష్టవ్రిభజన ప్రకటన ఏలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే మున్సిపాలిటీలు ఆర్థిక సంక్షోభంలో ఉండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్టవ్రిభజన జరిగితే అభివృద్ధి అథోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగులు చేపడుతున్న రిలేనిరాహారదీక్షలను మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
రాష్టవ్రిభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్ధతుగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపడుతున్న సమైక్య ఉద్యమం పతాకస్థాయికి చేరుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికీ 30రోజులు పూర్తయింది. ఎ.పి.ఎన్జీఒ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు గతనెల 12వ తేదీ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అప్పటి నుంచి పలురూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్న కార్మికులు రాష్ట్రాన్ని విభజించే అధికారం ఎవరికీ లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బుధవారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్టవ్రిభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆర్టీసీకి పెద్దఎత్తున నష్టం జరుగుతుందని, పల్లెవెలుగు బస్సులు తిరగలేని పరిస్థితులు దాపురిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు భానుమూర్తి, శ్రీనివాసరాజు, బిఆర్‌కె పరమహంస, ఎంఎస్‌ఎన్‌రాజు, బిఎస్ రాములు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీ
చీపురుపల్లి, : ఇక్కడి జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో రామలింగాపురం గ్రామానికి చెందిన యువత బుధవారం పాల్గొన్నారు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలల,పాఠశాల బస్సులను సమైక్యవాదులు నిలిపి వేసి విద్యార్ధులతో ర్యాలీ నిర్వహించారు. మూడు రోడ్ల జంక్షన్ వద్ద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు, ర్యాలీ చేశారు. స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ ఆవరణలో ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమం వద్ద చిన్నపిల్లతో తెలంగాణా అమ్మాయి, సీమాంధ్ర అబ్బాయి పేర్లతో వివాహాన్ని జరిపించి నిరసన తెలిపారు. స్థానిక కోర్టు ఆవరణలో న్యాయశాఖ సిబ్బంది సమైక్య ఉద్యమాన్ని చేపట్టారు. మండలంలోని ఇటకర్లపల్లి, గొల్లలములగాం, పెదనడిపల్లి, మెట్టపల్లి, తదితర గ్రామాల్లో సమైక్యవాదులు ర్యాలీ చేస్తూ లావేరు రహదారిపై మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ నారు సింహాద్రినాయుడు, శ్రీరాములునాయుడు, బొత్స గౌతమ్‌నాయుడు, వలిరెడ్డి రవీంధ్రనాయుడు, విద్యార్ధి జెఎసి ప్రతినిధులు శ్రీను, వాసు ఉపాధ్యాయులు జెఎహి ప్రతినిధులు అంపోలు సత్యన్నారాయణ, మురళి, జి.సత్యన్నారాయణ, కోర్టు సిబ్బంది అచ్చిబాబు, గున్నయ్య పోలినాయుడు, సన్యాసిరావు, పాల్గొన్నారు.

బంద్‌లు..ర్యాలీలు.. రాస్తారోకోలు..మానవహారాలు..మోకాలిపై నిరసనలు..వంటావార్పు... దిష్టిబొమ్మల దగ్ధంతో
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>