బిజినేపల్లి, మార్చి 5: గత ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ జడ్పీచైర్మన్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి శ్రీరామ రక్షగా పనిచేస్తాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని లింగసా నిపల్లి, వసంతాపూర్, గుడ లనర్వ, కారుకొండ గ్రామాలల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం వట్టెంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి స్వల్ప ఓట్లతో ఓటమి చెందారని ఈసారి ముక్కోణపు పోటీల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2004లో అధికారం లోకి రాగానే రైతులకు ఉచిత కరెంటు అందిస్తూ 1200 కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేయడం జరిగిందన్నారు. రైతులకు , మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతోపాటు ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదని లక్ష్యంతో ఒకరూపాయికే కిలో బియ్యం ఇవ్వడం జరుగుతున్న దన్నా రు. ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలల్లో అడిగినవారందరికీ ఇళ్లు విక లాంగులకు, వితంతు వులకు 500ల రూపాయల పెన్షన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి సమగ్ర వంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. పేద విద్యా ర్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఫీజురీయంబర్స్ మెంట్ ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు రేణుకారెడ్డి, మాజి జడ్పిటిసి పరుషరాములు, మాజీ సర్పంచ్‌లు వెంకటస్వామి, శ్రీనివాస్‌గౌడు, బోనాసి రాములు పాల్గొన్నారు.
* మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి
english title:
fg
Date:
Tuesday, March 6, 2012