Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పెల్లుబికిన నిరసన

$
0
0

విజయనగరం, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. గత నెల రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పలు రకాలుగా నిరసనలు చేపట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్టు జిల్లా ఐకాసా చైర్మన్ గంటా వెంకట్రావు స్పష్టం చేశారు. అందులో భాగంగా గురువారం అర్థరాత్రి నుంచి 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు నేతృత్వంలో జిల్లా కేంద్రంలో బిఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ కార్యాలయాలను ముట్టడించారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సమైక్యాంధ్ర కోసం విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి వౌనం పాటించడం ఏం బాగోలేదన్నారు. రాష్ట్రం రగిలిపోతుంటే ప్రధాని వౌనం వహించడం భావ్యమా అని ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల నేతలను చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఆయన కోరారు. కాగా, కాంగ్రెస్ నేతలు ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అన్న ఆలోచనలో ఉన్నారే తప్ప ఇక్కడ పరిస్థితి ఏ రకంగా తయారైందో వారికి అర్థం కావడం లేదన్నారు. మొత్తం జనజీవనం అంతా స్తంభించిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్, డాక్టర్ విఎస్ ప్రసాద్, ప్రసాదుల రామకృష్ణ, సైలాడ త్రినాద్, ఎస్‌ఎన్‌ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
కలెక్టరేట్ వద్ద ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో రిలే దీక్షలను కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంపిడివోల సంఘం నేత సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఏ రకంగా నష్టపోతామనే విషయమై వివరించారు. విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ వద్ద ఇంటర్ విద్య అధ్యాపకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, బొత్స సత్యనారాయణ, తెలంగాణా నేతలు కోదండరామ్ నేతల తలల పోస్టర్లను ప్రదర్శించారు. న్యాయవాదులు, ఇంటర్ విద్య, ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మొక్కలను నాటారు. చీపురుపల్లిలో షిర్డిసాయి భక్తులు మూడు రోడ్ల కూడలి వద్ద సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పూసపాటిరేగలో మహిళా గర్జన నిర్వహించి తప్పెటగుళ్లతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయురాలు హైమవతికి కళ్లుతిరిగి కిందపడిపోవడంతో సహచర ఉద్యోగులు ఆమెకు ఉపచర్యలు చేశారు. ఇదిలా ఉండగా ఐకాసా పిలుపు మేరకు బొబ్బిలిలో 72 గంటల బంద్ నిర్వహించారు. పార్వతీపురంలోని బొండపల్లిలో విద్యార్ధులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సాలూరులో 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ విధంగా జిల్లా అంతటా సమైక్యాంధ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
నేడు బైక్ ర్యాలీ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి జిల్లాలోని పార్వతీపురం వరకు మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు కురపాం ఎమ్మెల్యే జనార్థన్‌తాట్రాజ్ పేర్కొన్నారు. బైక్ ర్యాలీ అనంతరం పార్వతీపురంలో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రసంగిస్తారని ఆయన వివరించారు.
విద్యుత్ సమ్మెకు సహకరించాలి
విజయనగరం (కంటోనె్మంట్) : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టే 72 గంటల సమ్మెకు ప్రజలు సహకరించాలని విద్యుత్ ఉద్యోగుల జెఎసి కన్వీనర్ వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆ శాఖ ఉద్యోగులంతా గురువారం దాసన్నపేట విద్యుత్ భవనం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్ వరప్రాసద్ మాట్లాతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెబాట పట్టినప్పటకి ప్రజావసరాల ధృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరవుతూ వివిధ రూపాల్లో ఉద్యమం చేపట్టినట్లు చెప్పారు. అయితే ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు సీమాంధ్ర విద్యుత్ జెఎసి నిర్ణయం మేరకు 72 గంటల పాటు సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ముందుగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినప్పటకి సిఎం అభ్యర్థన మేరకు ఈ సమ్మెను 72 గంటలకు కుదించినట్లు పేర్కొన్నారు. అయితే సమ్మె కారణంగా ప్రజలకు పలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మంచినీరు, ఆసుపత్రులు వంటి అత్యవసర సేవలకు మాత్రం సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కన్వీనర్ మామిడి అప్పలనాయుడుతోపాటు మరో పది మంది విద్యార్థులను గురువారం ఉదయం బీమిలి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అబ్ధుల్ రవూఫ్ మరో పదిమంది విద్యార్థులు ఉన్నారు. భీమిలిలోని ఒక కళాశాల అద్దాలు పగులగొట్టారనే ఆరోపణతో వీరిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కాగా, మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ తమపై తప్పుడు కేసులు బనాయించి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెసు నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వీరికి అక్కడ స్థానికులు బెయిల్ ఇప్పించినట్టు తెలిసింది.
కొనసాగుతున్న దీక్షలు
నెల్లిమర్ల, సమైక్యాంధ్ర మద్దతుగా నెల్లిమర్ల వివేకానంద కూడలిలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం గురువారం కూడా కొనసాగింది. కార్యక్రమంలో సమైక్యవాదులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంటుందని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడగొడితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు.
నదీ జలాల సమస్య, విద్యుత్ పంపిణీ సమస్య ఏర్పడుతుందన్నారు. అన్నదమ్ముల్లా ఉన్నవారిని విడగొట్టడం తగదన్నారు. కార్యక్రమంలో జెఎసి ప్రతినిధులు మద్దిల సన్యాసిరావు పతివాడ త్రినాధ్, తాళాడ మహేష్, కడలి గణేష్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎస్.కోటలో..
శృంగవరపుకోట : ఈనెల 18వ తేదీన ఎన్‌జిఓలు, జెఎసి ఆధ్వర్యంలో జరగనున్న సమైక్య శంఖారవం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సమైక్యతగా ముందుకు రావాలని జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం స్థానిక దేవీబొమ్మ కూడి జెఎసి శిబిరం వద్ద గోపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మోహన్‌రాజు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా 18 జరిగే సమైక్య శంఖారం కార్యక్రమానికి ఎస్‌కోట జెఎసి తరపున భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాల సిబ్బంది ఈ విషయాన్ని గ్రహంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్ధులు పాల్గొనే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం జరిగిన ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో మండలంలో కుమ్మరపేటకు చెందిన మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మధ్యాహ్నం జిల్లాలో ఆర్‌డబ్ల్యుఎస్ సిబ్బంది బైక్ ర్యాలీని ఎస్.కోటలో నిర్వహించారు. స్థానిక దేవీబొమ్మ జంక్షన్‌వద్ద మోకాళ్లపై నిలుచుని సమైక్యాంధ్రకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. అలాగే జిల్లాలో శుక్రవారం జరగనున్న బంద్ ఎస్.కోటలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమైక్యవాదుల నిరసనలు
విజయనగరం , సెప్టెంబర్ 12: రాష్టవ్రిభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు, ఎం.ఆర్.కళాశాల అధ్యాపకులు చేపడుతున్న రిలేనిరాహారదీక్షలో కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వీరు చేపడుతున్న నిరసనదీక్షలకు అన్నివర్గాల ప్రజల నుంచి మద్ధతు లభిస్తోంది. మున్సిపల్ ఉద్యోగులు చేపడుతున్న రిలేనిరాహారదీక్షా శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ నాయకుడు, విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. రాష్టవ్రిభజన జరిగితే సీమాంధ్రలో మున్సిపాలిటీలు అభివృద్ధికి దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా మున్సిపాలిటీలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.అప్పయ్యశెట్టి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
డెంకాడలో..
డెంకాడ : పూసపాటిరేగ మండలంలో ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతుంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. గురువారం జాతీయ రహదారిపై మహిళల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీలు మావహారం చేపట్టా రాష్ట్ర విభజకు వ్యతిరేకంగా పలు గీతాలు ఆలపించారు. జెఎసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనను ఆపే వరకు ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. అవసరం అయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామాల్లో పర్యటించిన ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తప్పెటగుళ్ల కళాకారుల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. అలాగే డెంకాడలో ఉపాధ్యాయులు, ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగ జెఎసి నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ కొంత మంది స్వార్ధ రాజకీయాలకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు. అంటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శు, ఉపాధ్యాయులు, విఆర్వోలు,
గరివిడి, : సమైక్యాంధ్రను కొనసాగించాలని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గరివిడిలోని వరక్త,వాణిజ్య విద్యా సంస్థలు గురువారం చేపట్టిన బంద్ విజయవంత అయింది. గరివిడిలోని అన్ని వ్యాపార సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మూతపడ్డాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన కారుణలు రైల్వే గేటు నుండి స్థానిక సినిమాహాలు జంక్షన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే సమైక్య ఉద్యమం మరింత ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు.
కాగా వరక్త వాణిజ్య, విద్యాసంస్థల ఆధ్వర్యంలో వెయ్యి మీటర్ల జాతీయ జెండాను గరివిడి పట్టణంలో ప్రధాన రహదారిపై ఎగుర వేశారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా సమైక్యవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నెల్లిమర్ల, : సమైక్యాంధ్ర మద్దతుగా శక్రవారం నుంచి నిర్వహించినున్న 48 గంటల బంద్‌ను విజయవంతం చేయాలని జెఎసి కన్వీనర్ మద్దిల సన్యాసిరావు కోరారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం జెఎసి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48 గంటల బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో యూనియన్ సంఘాలకు ప్రయివేటు వాహనదారులను, బ్యాంకు ఉద్యోగులను కోరామని తెలిపారు. వీరందరూ సహకరిస్తారని చెప్పారు.

పైడితల్లి ఉత్సవాలకు ఎగ్జిబిషన్ సిద్ధం
విజయనగరం, సెప్టెంబర్ 12: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకొని రైల్వే స్టేషన్ సమీపంలో ఎగ్జిబిషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జెయింట్ వీల్, మోటార్ బైక్, ఇతర రకాల విన్యాసాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ యజమాని హుస్సేన్‌జైన్ తెలిపారు. ఈ ఏడాది అలకానంద ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. కాగా, మగధీర సినిమాలోని ఉదయ్‌పూర్ సంస్థానం నమూనాతో ప్రవేశద్వారం ఏర్పాటు చేశామని వివరించారు. త్వరలోనే ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఉజ్వల భారతావని కోసం యువజన సైకిల్ యాత్ర
విజయనగరం, సెప్టెంబర్ 12:దేశంలో యువతరాన్ని శక్తివంతం చేసేందుకు ఉజ్వల భారతావని కోసం యువజన సైకిల్ యాత్రను చేపడుతున్నట్టు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి బికె అన్నపూర్ణ చెప్పారు. ఈ యాత్రలో 20 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్టు చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 111 ప్రాంతాల్లో యాత్రలు జరుగుతాయని, మన రాష్ట్రంలో విజయనగరం నుంచి కాకినాడ వరకు సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ యాత్రను 17న విజయనగరంలోని వెంకటలక్ష్మి ధియేటర్ నుంచి ప్రారంభమవుతుందని వచ్చే నెల 4వ తేదీన కాకినాడ చేరుకుంటుందన్నారు. 17న పట్టణంలో సైకిల్ యాత్ర చేసి రాత్రికి ఇక్కడే బస చేస్తామన్నారు. ఆ మరుసటి రోజు ఇక్కడ నుంచి బయలుదేరి గజపతినగరం, సాలూరు, బొబ్బిలి, మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, పూసపాటిరేగ, జామి, ఎస్.కోట, కొత్తవలస, గాజువాక, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, పిఠాపురం, కాకినాడ వరకు యాత్రను కొనసాగిస్తామన్నారు.

నేడు ఆదిభట్ల డాక్యుమెంటరీ ప్రదర్శన
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 12: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జీవితవిశేషాలపై డాక్యుమెంటరీని ఈనెల 14వతేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రదర్శిస్తామని గురాన అప్పలనరసమ్మ ట్రస్ట్ (గేట్) ప్రధాన కార్యదర్శి ఎస్‌విఎన్ గురుప్రసాద్ తెలిపారు. గురువారం ఇక్కడ ఫోర్ట్‌సిటీ స్కూల్‌లో ఆదిభట్ల ఉత్సవ ఆహ్వాన ప్రతులను ఉత్సవకమిటీ సభ్యులు ఆవిష్కవిస్తున్నారు. ఈ సందర్భంగా గురుప్రసాద్ మాట్లాడుతూ ఆదిభట్ల నారాయణదాసు జీవితంపై హైదరాబాద్‌కు చెందిన కినె్నరచిత్ర నిర్మించిన హరికథ-మన కళాసంపద అనే డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామన్నారు. ఈ ప్రదర్శనోత్సవాన్ని గేట్, ఫోర్ట్‌సిటీ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు. ఈ ప్రదర్శన ఉత్సవంలో డాక్యుమెంటరీ నిర్మాత మద్దాళి రఘురామ్, మధుర వచస్వి మానాప్రగడ శేషశాయి, అధికార భాషా సంఘం సభ్యుడు డాక్టర్ ఏ.గోపాలరావు, గురాన సాధూరావు, పి.ఎ.ప్రసాదరావుపాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గేట్ అధ్యక్షురాలు పెనుమజ్జి విజయలక్ష్మి, సాయి సేవాసంస్థ వ్యవస్థాపకుడు మేకా కాశీవిశే్వశ్వరుడు, ఒక స్కూల్ కరస్పాండెంట్ మధు పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>