విశాఖపట్నం, సెప్టెంబర్ 12: భారతదేశంలో రాజకీయాలకతీతంగా స్వేచ్ఛాయుత కార్మిక ఉద్యమాన్ని నిర్మించడానికి కానె్ఫడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌టియుఐ) విశేషంగా కృషి చేస్తుందని జాతీయ అధ్యక్షుడు ఎన్.కనకారావు తెలిపారు. డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్‌లో ఢిల్లీలోజంతర్‌మంతర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకతీతంగా స్వేచ్ఛాయుత కార్మిక ఉద్యమాన్ని నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తుందని, కార్మిక సంఘాన్ని సామాజిక ఉద్యమంగా మలిచేందుకు నిరంతరం శ్రమిస్తోందన్నారు. ప్రధానంగా దేశంలో ఉన్న కోటి మంది డొమెస్టిక్ వర్కర్లు ఉన్నారని, వీరందరి సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరు సాగిస్తున్నామన్నారు. ఈ నెల 5,6 తేదీల్లో వారణాసిలో జరిగిన సిఎఫ్‌టియుఐ మహాజనసభలో నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నకుందన్నారు. తాను అధ్యక్షునిగాను, ప్రధాని కార్యదర్శి నీరజ్ చోబే, కోశాధికారిగా అజిత్ శ్రీవాత్సవ్‌లతోపాటు మరో 20 మంది సభ్యులు కార్యనిర్వాహాకమండళని, 15 మంది సభ్యులు జాతీయ సలహామండలిని ఎన్నుకుందన్నారు.1997లో కార్మిక సంఘాన్ని ఒక సామాజిక ఉద్యమంగా మలచిన ఆశోక్‌కుమార్ అధ్యక్షతను ఇది అవతరించిందని, పబ్లిక్ సర్వీసులు, రవాణా, వ్యవసాయం, వస్త్ర, దుస్తుల తయారీ, మత్స్యకార, అంగన్‌వాడీ, నిర్మాణం, ఇంటిపని, దుకాణాలు ఇత్యాది రంగాలకు చెందిన కార్మిక సంఘాలు అంబరీష్ త్రివేది నాయకత్వంల అనుబంధితమయ్యాయన్నారు. 11 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 20 రాష్ట్రాలకుచెందిన 274 కార్మిక సంఘాలు దీనికి అనుబంధంగా ఉన్నట్టు చెప్పారు. ప్రైవేటైజేషన్, డిస్‌ఇనె్వస్ట్‌మెంట్, వ్యవసాయ, మత్స్యకార తదితర అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయడం, కనీస వేతనాలుకార్మిక చట్టాల అమలు అంగన్‌వాడీ స్థితిగతలు మెరుపరచడం, ఐఎల్‌ఓ కనె్వన్షన్ సి-189ను ఇంటి పనివారి సంక్షేమం దృష్ట్యా భారత ప్రభుత్వం ఆమోదించడం వంటి అంశాలపై నాల్గవ మహాజన సభ అనేక తీర్మానాలను ఆమోదించిందన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, ఆర్ధిక సామాజిక సహకార రంగాల్లో కార్మికులకు సముచిత స్థానాన్ని కల్పించడం వంటి వాటితో ఐటియుసి తనదైన లక్ష్యాలను సాధించే అశయాలతో పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు వివి రమణ, బాబురావు, ఎస్.ఎస్ పట్నాయక్, ఎన్.సత్యనారాయణ,సురేశ్ పాల్గొన్నారు.
ఐక్య నినాదం..
మానవహారాలు, దీక్షలతో నిరసనలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 12: సమైక్య ఉద్యమం తీవ్రరూపం దాల్చడంలో భాగంగా పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సమైక్య హోరు ఎక్కడా తగ్గకపోగా మరింత జోరందుకుంటోంది. విశాఖ నగరంలో గురువారం కూడా సమైక్య నినాదాలు, నిరసనలు, దీక్షలు, మానవహారాలతో హోరెత్తిత్తింది.
ఆర్టీసీ కార్మికుల శిరోముండనం
ఆర్టీసీ ఎన్‌ఎంయు కార్మికులు గురువారం శిరోముండనం సగం చేయించుకుని నిరసన తెలియజేశారు. మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఎన్‌ఎంయు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీస్థాయిలో కార్మికులు స్వచ్చంధణగా శిరోముండనం చేయించుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా మానవహారం, శిరోముండన కార్యక్రమాలను చేపట్టారు. ఎన్‌ఎంయు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావుతోపాటు నాయకులు టిఎస్ రావు, ఎన్‌ఎం కృష్ణ, బి.దేముడు, కెఏ రాజు, బంగారయ్య, ఎంవి రా, సిహెచ్.హరిబాబు, కె.రమేశ్, ఎస్.ఆర్ రావు తదితరులు శిరోముండనం చేయించుకున్న వారిలో ఉన్నారు. అనంతరం సగం గుండుపై సమైక్యాంధ్రప్రదేశ్ అనే స్టికర్లు అంటించుకుని జంక్షన్ చుట్టూ సమైక్యాంధ్ర నినాదాలతో ధర్నా చేపట్టారు. మండుటెండలో రోడ్డుపై పడుగుని దాదాపు గంటసేపు ట్రాఫిక్‌ను నిర్బంధించి నినాదాలు చేశారు. ఈ సందర్భణగా యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు వారి సొంత జెండాలు లేకుండా కేవలం సమైక్యాంధ్ర అనే సింగిల్ ఎజెండాతో జీతాలు కూడా లేకుండా నెల రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని సీమాంధ్రమంత్రులు, రాజీనామాలు చేయాలని, డ్రామాలు మానాలన లేనిపక్షంలో కడుపు మంటలతో ఉద్యమం చేస్తున్న కార్మికుల ఆగ్రహ జ్వాలలు చవిచూడాల్సి వస్తుందన్నారు. కేంద్రం సీమాంధ్రుల నిరసనలను అర్ధం చేసుకుని విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధులు వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నారన్నారు. ఆర్టీసీ జెఏసి కన్వీనర్ పివివి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సీమాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విదంగా మాట్లాడం మానుకోవాలని హెచ్చరించారు. సమైక్యసభలో ఓ కానిస్టేబుల్‌కు డబ్బులిచ్చి మరీ విద్వేషాలు పెంచడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.నందగోపాల్, పిఎన్ రావు, ఎంవిఆర్ మూర్తి, ఏకె శివాజీ, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల సమ్మె
* ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సంస్థ
* సెల్ ఫోన్ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు
* సంస్థ సిజిఎం మూర్తి
విశాఖపట్నం, సెప్టెంబర్ 12: విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి దిగారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పరిధిలోకి వచ్చే ఐదు జిల్లాలకు చెందిన ఏడు వేల మందికి పైగా ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు అంతా గురువారం సమ్మెలో పాల్గొని నిరసన తెలియజేశారు. అయితే సమ్మె కారణంగా ఈ జిల్లాల్లో విద్యుత్ వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు వీలుగా ఆయా జిల్లాలకు సంబంధించిన సెల్ నెంబర్లను సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ కెఎస్‌ఎన్ మూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 9440812386/08942227361, విజయనగరం-9440812447/08922222942, విశాఖపట్నం-9440812487/08912718091, తూర్పు గోదావరి-9440812583/08832463354, పశ్చిమ గోదావరి 9440812702/08812231287నెంబర్లకు సంబంధించిన నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేస్తే విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులు, కంట్రోలు రూములకు కేటాయించిన ఫోన్లను సద్వినియోగపర్చుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే విశాఖపట్నం సంస్థ కార్పొరేటరు కార్యాలయ కంట్రోల్ రూం 0891 2582333నెంబర్‌కు చేయవచ్చన్నారు.
నేటి నుంచి ఉద్యోగుల ఉగ్రరూపం
విశాఖపట్నం, సెప్టెంబర్ 12: సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ నెల రోజులుగా సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. సీమాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఆదాయం పూర్తిగా క్షీణించింది. ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రజలకు అందాల్సిన సేవలు అందడం లేదు. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే పాలన పూర్తిగా స్తంభించింది. ఈ పరిస్థితి ఎంతవరకూ వెళితే, అంతవరకూ వెళ్లనీ అంటూ కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ శాంతియుతంగా ఉద్యమించిన ఉద్యోగులు శుక్రవారం నుంచి ఉగ్రరూపాన్ని ప్రదర్శించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని కార్యాలయాలూ మూతపడ్డాయి. ఇకపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలపై దృష్టిసారిస్తున్నారు ఉద్యోగులు. అప్పుడే కేంద్రానికి ఇక్కడ జరుగుతున్న ఉద్యమం గురించి తెలుస్తుందని భావిస్తున్నారు. ఉద్యమం ఆరంభమైన తొలి రోజుల్లో విశాఖ పోర్టులో ఒక్క రోజు సమ్మె జరిపి, 100 కోట్ల ఆదాయానికి గండికొట్టారు. బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ముట్టడించి కార్యకలాపాలను స్తంభింపచేశారు. గురువారం ఆదాయపన్ను శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. శుక్రవారం నుంచి ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు అడ్డుగలనున్నారు. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమంపై హైకోర్టు ఈనెల 16న ఉత్తర్వులు ఇవ్వనుంది. ఆ ఉత్తర్వులు ఎలా ఉన్నప్పటికీ, ఉద్యమాన్ని తీవ్రరూపం చేయాలని భావిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని ఉద్యోగులు చేసిన డిమాండ్‌ను వారెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో కొంతమంది ప్రజా ప్రతినిధులు సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనను చవిచూడాల్సి వస్తోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. బుధవారం ముఖ్యమంత్రి ఇచ్చిన విందుకు కూడా ఆయన హాజరు కాలేదు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినందువలనే విందుకు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. కానీ బాలరాజు, పురంధ్రీశ్వరి, కిశోర్ చంద్రదేవ్ తమ తమ పదవులకు రాజీనామా చేయకపోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేల కోట్లలో నష్టం
ఇక ఉద్యోగుల సమ్మె ప్రారంభమై నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిగే కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్ టాక్స్‌లు మినహా మిగిలిన ఏ ఆదాయమూ ప్రభుత్వ ఖజానాలో జమకావడం లేదు. పంచాయతీరాజ్, నీటిపారుదల, సివిల్ సప్లైస్ తదితర శాఖల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఖజానా కార్యాలయంలో ఈ నెల రోజుల్లో కనీసం ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి అందాల్సిన మొత్తాలు అందలేదు. పెన్షన్‌దార్లకు పించను అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో ఒక్క ఆర్టీసీకే వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
21 సభకు సన్నాహాలు
ఇదిలా ఉండగా ఈనెల 21వ తేదీన విశాఖలో ఐదు లక్షల మందితో సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాన్ పొలిటికల్ జెఎసి నాయకులు గురువారం నగరంలో వివిధ వర్గాల వారిని కలిసి జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శాస్త్రోక్తంగా శాంతిహోమం
సింహాచలం, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ అంతటా అశాంతి జ్వాలలు రేగుతున్న తరుణంలో శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో గురువారం శాంతిహోమం నిర్వహించారు. సింహాచలేశుని ప్రతినిధిగా గోవిందరాజుస్వామి, ఉభయ దేవేరులకు స్నపన తిరుమంజనం జరిపించారు. ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం ప్రారంభమైన శాంతిహోమాలు, స్నపన తిరుమంజనాలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. 108 వెండి కలశాలతో సింహాద్రినాధునికి అష్టోత్తర శత కలశారాధన చేశారు. పంచామృతాలతో అర్చకులు స్వామివారిని అభిషేకించారు. ప్రధాన కలశను అర్చకుడు సీతారామాచార్యులు శిరస్సుపై ధరించి నాదస్వర వాయిద్యాల వేదపండితుల మంత్రోచ్ఛారణలతో దేవాలయంలో ప్రదక్షిణ చేశారు. చివరిగా ప్రధాన కలశలోని జలాలను సింహగిరి నరహరి అభిషేకించి పూర్ణాహుతి నిర్వహించారు. దేవస్తానం ఇఓ కె.రామచంద్రమోహన్ పూర్ణాహుతి ద్రవ్యాలను సమర్పించగా అర్చకులు హోమంలో వేసి పూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమునిపట్నం శాసనసభ్యుడు ముత్తెంశెట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. వర్షాల కోసం కూడా పూజలు చేయాలని ఇఓ, ప్రధానార్చకుడిని ఎమ్మెల్యే కోరారు. వైకుంఠవాసుని సన్నిధిలో వరదపాయసం వేడుక చేస్తామని ప్రధానార్చకుడు తెలిపారు. వరుణ జపాలు కూడా చేస్తామని ఆయన చెప్పారు.
అలరించిన శర్మిష్ఠ నృత్య ప్రదర్శన
వైశాఖి నృత్యోత్సవ సంబరం
విశాఖపట్నం , సెప్టెంబర్ 12: భారతీయ నృత్యాత్మకు సాధికార రూపమైన ఆ నృత్యసౌరభానికి ఆహుతులు ప్రణతులు అర్పించారు. ప్రపంచంలో ఎల్లలెరుగని కళల్లో ఒకటిగా భాసిల్లుతున్న భారతీయ నృత్యకళా ప్రక్రియల్లో విభిన్నమైనదిగా భావింపబడుతున్న ‘కథక్’ను సాక్షాత్తూ భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ తనయ శర్మిష్టా ముఖర్జీ తన నృత్యబృందంతో గురువారం సాయంత్రం కళాభారతిలో ప్రదర్శించి ‘వైశాఖి నృత్యోత్సవ’ సంరంభానికి శుభారంభం చేశారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సారధ్యంలో ఆరవ అఖిలభారత శాస్ర్తియ నృత్యోత్సవాన్ని వీక్షకులు హృదయాంగముగా ఆస్వాదించారు. తొలుత శర్మిష్ట ఋగ్వేదంలో ఉదహరించబడ్డ పురుషసూక్తాన్ని అద్భుతంగా నృత్యంలో వ్యక్తపరిచారు. యజ్ఞం వల్ల కలిగే పరిణామక్రమాన్ని, తద్వారా ప్రకృతి ఆవిర్భావ దశల్ని ఈ అంశం తెలియజేసింది. అనంతరం ‘లయపరిక్రమ’ అంశంలో లయగతుల వల్ల కాలచక్ర పరిభ్రమణం తృప్తి సన్యాల్, శివానీమల్హోత్రా, దివ్య నేత్రపర్వమైన నృత్యభంగిమలతో అందించారు. ఇక మూడవ అంశంగా ‘గుల్హన్ బహార్ బగీచా’ కదిలే ఊహలకు భావముంటే అవి నృత్యంలో ఎలా శోభిల్లుతాయో విశదీకరించింది. మాల్కోస్ రాగ మాధుర్యం నృత్య వైశిష్టానికి తన జత కలిపింది. ఇక చివరి అంశంగా శర్మిష్ట తన రెండుపదుల నృత్యశిక్షణలో తనదైన శైలిని ప్రతిబింబించిన ‘హి’ నృత్యరూపకంలోవ ‘డి ఫక్సు’ అంశాన్ని ఆలవోకగా ప్రదర్శించారు. అజ్ఞానం నుంచి జ్ఞానప్రభలు కొనితేవడంలో ఆదివక్తి స్ర్తి పాత్రను వెలుగులోకి తెచ్చింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ నృత్య కార్యక్రమం ముగిసింది. కళాకారులను ముఖ్య అతిథి కేంద్ర సహాయమంత్రి పురంధీశ్వరి దుశ్శాలువా, బొకేలతో సత్కరించి కార్యక్రమానికి తన సునిశితమైన వ్యాఖ్యానంతో డా.పేరాల బాలమురళి గుభాళింపు తెచ్చాడు. రెండో అంశంగా జెఎస్ ఈశ్వరప్రసాద్ భజన్ నృత్యంలో పలు అంశాల్ని ప్రదర్శించారు. వీరిరువురిని ‘నాట్యశ్రీ’ బిరుదుతో సత్కరించారు.
భారతీయ కళలు విశ్వసంకేతాలు: పురంధ్రేశ్వరి
ప్రపంచ దేశాల్లో భారతదేశానికి కళాపరంగా అపురూపమైన గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి పురంధ్రేశ్వరి కితాబునిచ్చారు. భౌగోళికంగా సమున్నతమైన ఈ కళలు ప్రాంతాల వారీగా విస్తరించి వాటి ఉనికిని నిక్షిప్తం చేసుకున్నాయన్నారు. ఉత్తరాదికి చెందిన కథక్ దేశంలోని 8 సుసంపన్నమైన నృత్యరీతుల్లో భిన్నమైనదని అన్నారు. ముస్లిం, హిందూ సాంప్రదాయ మేళవింపు గోచరమయ్యే ఈ నృత్యం మూడవ దశాబ్దం నాటిదని అన్నారు. లక్నో, బెనారస్, జైపూర్, హర్యానాల్లో ప్రాచుర్యం పొందిందని అన్నారు. శర్మిష్టముఖర్జీ తన గురువులైన గురురాజ్, విదూషి ఉమ, రాజేంద్రల శిష్యరికంలో రాటుదేలి ప్రపంచ దేశాల్లో మనదేశ బావుటాను ఎగురవేసారని కొనియాడారు. కేంద్రం నుండి సాంస్కృతిక రంగానికి జీవం కలిగేలా తనవంతు సాయం అందిస్తానన్నారు. గీతం వర్శిటీ చైర్మన్ డాక్టర్ ఎంవివిఎస్.మూర్తి మాట్లాడుతూ నగరంలోని వదాన్యుల సాయంతో నటరాజ్ సంస్థ తన కార్యక్రమం కొనసాగేలా కార్ఫస్‌ఫండ్‌ను రూపొందించుకోవాలన్నా. శాసనసభ్యుడు మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూ నటరాజ్ సారధి వర్మాగౌడ్ సత్సంప్రదాయాలకు బాటపరిచే కార్యక్రమాలకు ముందుకేగడం హర్షదాయకమని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు నృత్య కళపట్ల మన రాష్ట్రంలో లేకపోవడం బాధాకరమని విక్రంగౌడ్ ఆవేదన వ్యక్తపరిచారు. సింరుయోసిస్ సిఇఓ ఒ.నరేష్‌కుమార్, విజయ్‌నిర్మాణ్ ఎండి ఎస్.విజయ్‌కుమార్, ఎన్‌ఎండిఎ చైర్మన్ రేఖల కృష్ణగౌడ్ పాల్గొని ప్రసంగించారు. రతన్‌రాజ్, పుష్పక్ ప్రభృతులు నిర్వహణలో సహకరించారు.
అనకాపల్లి చెత్త సమస్య మళ్లీ మొదటికే
అనకాపల్లి , సెప్టెంబర్ 12: అనకాపల్లికి ప్రధాన సమస్య చెత్తసమస్య గడిచిన నాలుగునెలల క్రితం సుమారు నెలరోజులు పాటు అధికార్లులకు, ప్రజాప్రతినిధులకు అన్ని వర్గాల వారికి తలనొప్పి సమస్యగా పట్టిపీడించింది. ఎట్టకేలకు అనకాపల్లి చెత్తను లారీలతో గాజువాకకు తరలించడానికి అనుమతించడంతోప్రస్తుతానికి ఈ చెత్త సమస్య పరిష్కారం అయిందని ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే కొంతకాలం అనకాపల్లిలో సేకరించిన చెత్తను లారీల సహాయంతో గాజువాక తరలించేవారు. ఈ మధ్యకాలంలో అనకాపల్లి జివిఎంసి జోనల్ కార్యాలయం సమీపంలో ఉన్న స్థలంలో ప్రత్యాయమ్నయంగా కంపోస్టుయార్డు క్రింద ఉపయోగించి పట్టణంలో సేకరించిన చెత్తను అక్కడ డంపింగ్ చేసేవారు. అక్కడ నుండి పొక్లైనర్ సహాయంతో లారీలకు లోడింగ్‌చేసి గాజువాక తరలిస్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక ఐదవ వార్డు ప్రజలు చెత్తను అడ్డుకుంటున్నారు. గతంలో ఉన్న మున్సిపల్ కమీషనర్ మురళీధర్ 10రోజుల వరకే ఇక్కడ వేస్తామని అనంతరం వేరే ప్రాంతానికి చెత్తను తరలిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడివారు శాంతించారు. హామీ ఇచ్చి ఐదు నెలలు గడచినా చెత్తను మాత్రం వేరే ప్రాంతానికి తరలించలేదని ఆందోళనచేసి గురువారం ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీనివలన మలేరియా, డయోరియా, ఫైలేరియా తదితర వ్యాదులు వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన తట్టుకోలేక దుర్భరజీవితాన్ని గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఊరుచివర వేయాల్సిన చెత్తను గ్రామం మధ్యలో వేయడం ఇదేనా గ్రేటర్ పరిపాలన అని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉడ్‌పేట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏడిద చంటి, ఎల్‌ఎన్ శివరాం పాల్గొన్నారు.
డిఎస్పీ వైఖరిని నిరసిస్తూ అనకాపల్లి బంద్ విజయవంతం
జాతీయ రహదారిపై రాస్తారోకో
అనకాపల్లి, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్రవాదులపై వేధింపులకు పాల్పడిన అనకాపల్లి డిఎస్పి మూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి సమైక్యాంధ్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో తలపెట్టిన బంద్ సంపూర్ణంగాను, విజయవంతంగాను జరిగింది. డిఎస్పిని సస్పెండ్ చేసి ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఉదయం నుండే వ్యాపారులు స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి బంద్‌ను పాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను, పట్టణంలోని వాణిజ్యబ్యాంక్‌లను బంద్ నిర్వాహకులు మూసివేయించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్‌కు సైతం యాజమాన్యాలు సెలవుప్రకటించాయి. అనకాపల్లి పట్టణ సమైక్యాంధ్ర ఐక్యవేదిక చైర్మన్ మాదేటి పరమేశ్వరరావు, కన్వీనర్లు దాడి రత్నాకర్, ఎం. జానకిరామరాజు, బుద్ధ నాగజగదీష్, బిఎస్‌ఎంకె జోగినాయుడు తదితరుల నేతృత్వంలో బంద్ సంపూర్ణంగా విజయవంతం జరిగింది. డిఎస్పిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక బైపాస్ జాతీయ రహదారి జంక్షన్‌లో నిరసనకారులు బైఠాయించి ట్రాఫిక్‌ను స్తంభింపజేసారు. డిఎస్పి దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేసారు. మంత్రి గంటాకు వత్తాసు పలుకుతూ సమైక్యాంధ్రవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న డిఎస్పి డౌన్‌డౌన్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేసారు. నిరసనకారులనుద్ధేశించి మాజీమంత్రి దాడి వీరభద్రరావుప్రసంగిస్తూ అనకాపల్లి డిఎస్పి మూర్తి హద్దులుమీరి విచక్షణారహితంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మంత్రి గంటా శ్రీనివాసరావుదగ్గర ప్రాపకం కోసం సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ రంగుపులిమి ఉద్యమకారులను బెదిరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. డిఎస్పిని అదుపులో పెట్టలేకపోతే భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు మంత్రి గంటా బాధ్యత వహించాల్సివస్తుందని అనకాపల్లి అసెంబ్లీ వైఎస్‌ఆర్ సిపి నాయకులు కొణతాల లక్ష్మీనారాయణరావు(పెదబాబు) హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమకారుల పట్ల డిఎస్పి మూర్తి అనుసరించిన వైఖరి చాలా బాధాకరమని వైసీపి నేత రత్నాకర్, మాజీసర్పంచ్ బుల్లిబాబు తదితరులు పేర్కొన్నారు. డిఎస్పిని తక్షణమే సస్పెండ్ చేసి ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు నినాదాలు చేసారు. స్థానిక బైపాస్ రోడ్డు జాతీయ రహదారి జంక్షన్‌పై సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేసారు. అదే సమయంలో ఆ మార్గం గుండా వస్తున్న భీమునిపట్నం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావును సమైక్యాంధ్ర నిరసనకారులు ఘోరావ్‌చేసారు. సమైక్యాంధ్రకు జై కొట్టాలని, అనకాపల్లిలో సమైక్యాంధ్రవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన డిఎస్పిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా చూడాలని ఎమ్మెల్యే అవంతి డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు నినాదాలు చేసారు. ఈ నిరసనకు స్పందించిన ఎమ్మెల్యే అవంతి సమైక్యాంద్రకు అనుగుణంగా నినాదాలు చేసారు. అనకాపల్లి డిఎస్పిపై చర్యలు తీసుకునేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో వైసీపి నాయకులు బుద్ధ రాజేష్, దాడి జయవీర్, కాంగ్రెస్ నాయకులు వేగి రామకోటి, మాజీ సర్పంచ్ మళ్ల బుల్లిబాబు తదితరులు ఈ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న సమైక్యాంధ్రవాదులు
అనకాపల్లి, సెప్టెంబర్ 12: పట్టణంలో జరిగిన లక్షగళ గర్జన కార్యక్రమంలో ప్రశాంతంగా, శాంతియుతంగా జరగాలనే లక్ష్యంతో సమైక్యాంధ్ర ఉద్యమ నిర్వాహకులకు సూచనలు చేస్తే దానిని వక్రీకరించి తనపై ఆరోపణలు, అభాండాలు మోపడం అన్యాయమని అనకాపల్లి డిఎస్పి విఎస్‌ఆర్ మూర్తి పేర్కొన్నారు. డిఎస్పి వైఖరిని నిరశిస్తూ పట్టణంలో గురువారం బంద్ జరిగిన నేపధ్యంలో సంబంధిత అధికారి మూర్తి స్పందిస్తూ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పై విధంగా వివరణ ఇచ్చారు. అనకాపల్లిలో సమైక్యాంధ్ర ఉద్యమనేతలను పిలిచి సభలో ఏ చిన్న గొడవ జరిగినా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చి అనకాపల్లికి చెడ్డపేరు వస్తుందన్న భావంతో రాజకీయ నాయకుల అపోహ పడకుండా సభ జరపాలనే తాను కోరానన్నారు. అందుకు భిన్నంగా సమైక్యాంధ్ర ఉద్యమకారులను బెదిరించానని, రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నానని ఉద్యమనేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను తెలంగాణా ప్రాంతంలో పనిచేసి వచ్చినంత మాత్రాన రాష్ట్ర ఏర్పాటును ఆశిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తానుకూడా సమైక్యాంధ్ర వాదినినేనని డిఎస్పి స్పష్టం చేసారు. నెహ్రూచౌక్ జంక్షన్‌లో సమైక్యాంధ్ర ఉద్యమకారులు వేసిన టెంట్‌ను ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందనే కారణంతోనే కొంత పక్కకు తప్పించాను తప్ప ఇందులో వేరొక దురుద్ధేశ్యం లేదన్నారు. టౌన్ సిఐ శ్రీనివాసరావు, రూరల్ సిఐ శ్రీనివాసరావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మనేరియా ఆల్‌రౌండ్ ప్రతిభ
విశాఖపట్నం , సెప్టెంబర్ 12: న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన వన్‌డే సీరిస్ చివరి వన్‌డే మ్యాచ్‌లో అశోక్ మనేరియా సిక్సర్లతో మెరుపులు మెరిపించారు. ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో అశోక్ మనేరియా చెలరేగి ఆడి రెండు బవుండరీలు, ఎనిమిది సిక్సర్లతో 50 బంతుల్లోనే 69 పరుగులు, బవులింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్ ‘ఎ’ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అశోక్ మనేరియా 25 ఓవర్లలో టాడ్ అస్లే బవులింగ్‌లో మూడు సిక్సర్లు, ఒక బవుండరీతో 24 పరుగులు చేశాడు. ఆ తరువాత అస్లే వేసిన 27వ ఓవర్‌లో కూడా రెండు సిక్సర్లు, 37వ ఓవర్లో డేవ్‌సిచ్ బవులింగ్‌లో ఒక బవుండరీ, ఒక సిక్సర్ కొట్టి న్యూజిలాండ్ బవులర్లకు దడ పుట్టించాడు. అశోక్ మనేరియాకు తోడు నిలిచి స్కోరును పరుగులు తీయించడంలో సహకరించిన కేదార్ జాదవ్‌కు 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ లభించడంతో వీరద్దరు అయిదవ వికెట్‌కు 128 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. కేదార్‌జాదవ్ న్యూజిలాండ్ బవులర్ సోది వేసిన బంతిని గాలిలోకి లేపాడు, అయితే ఆండ్రసన్ క్యాచ్ జార విడవడంతో అర్థ సెంచరీని పూర్తి చేశాడు. ఆండ్రసన్ వదిలిన ఆ క్యాచ్‌కు న్యూజిలాండ్ జట్టు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆండ్రసన్ 20వ ఓవర్‌లో భారత్ జట్టు స్కోరు 151 పరుగుల వద్ద క్యాచ్‌ను జార విడిచాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేదార్ జాదవ్ 38 ఓవర్లలో జట్టు స్కోరు 207 పరుగుల వద్ద అవుటయ్యాడు.
రాహుల్, గిల్లెస్పి మాటల యుద్ధం
రాహుల్‌శర్మ, మార్క్ గిల్లెస్పిల మధ్య 47వ ఓవర్లో మాటల యుద్ధం జరిగింది. రెండవ పరుగుతీస్తున్న రాహుల్ శర్మను గిల్లెస్పి పిచ్‌పై అడ్డునిలవడంతో గుద్దుకుంటూ వెళ్లి పరుగును పూర్తి చేశాడు. దీంతో రాహుల్‌శర్మతో గిల్లెస్పి వాగ్యుద్దం చేశాడు. అంపైర్ కల్పించుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినప్పటికీ ఫీల్డింగ్‌లో కూడా గిల్లెస్పి రాహుల్‌శర్మను రెచ్చగొడుతునే ఉన్నాడు. అంపైర్ గిలెస్పిని మందలించడంతో వీరిద్దరి మధ్య పోరు చల్లారింది. మ్యాచ్ అనంతరం ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు డివి సుబ్బారావు ముగింపు ఉత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరై భారత్ ‘ఎ’ జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు ట్రోఫీ అందజేశారు. జట్టులో ఆటగాళ్లందరూ కలసికట్టుగా విజయం చేకూర్చారని ఉన్ముక్త్‌చంద్ జట్టు సభ్యులను అభినందించాడు. ఈ సీరిస్ జట్టులో యువ క్రికెటర్లకు మంచి పాఠాలు, అనుభవాన్ని నేర్పిందని న్యూజిలాండ్ కెప్టెన్ ఆండ్రుఎల్లిస్ అన్నాడు.