మల్కాజిగిరి, సెప్టెంబర్ 15: ఎమ్మెల్యే రాజేందర్ రోడ్లు ఊడ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పిలుపు నిచ్చారు. ఆదివారం జన్ సేవాసంఘ్ ‘మార్వాడి‘ వారి ఆధ్వర్యంలో పరిసరాల పర్యావరణంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంఘం నిర్వాహకులతో కలిసి మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. పరిసరాల్లో నెలకొన్న చెత్తాచెదరాన్ని తొలగించి పరిసరాలను శుభ్ర పరిచారు. జన్ సేవాసంఘ్ నిర్వాహకులు డా.ఎఎన్.సింగ్, మధన్‌లాల్, రాధేశ్యామ్, రామ్, ఓం శ్రవణ్, ప్రేమ్‌నాథ్, నేనారామ్, యోగ్రాజ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ యాదవ్, పూర్ణచందర్రావు, పివి.సత్యనారాయణ, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాజేందర్ రోడ్లు ఊడ్చి అందరికీ ఆదర్శంగా
english title:
mla
Date:
Monday, September 16, 2013