Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గ్రేటర్‌లో ఇష్టారాజ్యం..!

$
0
0

కట్టుదిట్టంగా గ్రేటర్ చట్టం అమలు.. బల్దియా ఆస్తుల పరిరక్షణ.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన గ్రేటర్ విజిలెన్స్ రోజురోజుకీ నిర్వీర్యమైపోతోంది. విజిలెన్స్ అధికారులు.. కాంట్రాక్టర్లమిలాఖత్‌తో అక్రమాలకు అండదండగా నిలుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియాలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాల నియామకంలోనూ సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ అధికారులు ఈ శాఖను ప్రక్షాళన చేసే అంశంపై దృష్టి సారించకుంటే మున్ముందు నష్టమే..!
హైదరాబాద్, సెప్టెంబర్ 15: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం అమలు, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాల్సిన విజిలెన్స్ విభాగం విధులు రోజురోజుకీ ఇష్టారాజ్యంగా తయారవుతున్నాయి. ఫలితంగా గ్రేటర్‌లో రోజుకో అక్రమం చోటుచేసుకుంటున్నా, విచారణలు కూడా సక్రమంగా సాగటం లేదు. గ్రేటర్ వాహనాల డీజిల్, పెట్రోల దందాలు మొదలుకుని, అక్రమంగా కాంట్రాక్టుల కేటాయింపు వంటి పరిణామాలు గ్రేటర్ ఖాజానాకు గండి కొడుతున్నా, అధికారులు మాత్రం ఈ శాఖను పటిష్టపరిచే దిశగా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. కారణంగా కమాటి మొదలుకుని ఉన్నతమైన హోదాల్లో కూడా రోజురోజుకీ అవినీతి పెరిగిపోతుంది. ఇప్పటి వరకు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ పలువురు సిబ్బంది వద్ద లభ్యమైన కోట్లాది రూపాయల విలువ చేసే అక్రమాస్తులే ఇందుకు నిదర్శనం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్నా చితక వ్యాపార సంస్థలు తమ ప్రచారం నిమిత్తం రోడ్డుపై ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసే ప్రకటనలు, చట్ట విరుద్ధంగా వెలుస్తోన్న ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యతలను నిర్వహించాల్సిన గ్రేటర్ విజిలెనే్స వాటిని ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వస్తోన్న ఫిర్యాదులను సొమ్ము చేసుకోవటానికే పరిమితమైపోతుందన్న విమర్శ వస్తోంది. దీనికి తోడు బల్దియా అనుమతుల్లేకుండా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, రోడ్డుపై ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ సామాగ్రిని నిల్వం చేయటంపై వస్తున్న ఫిర్యాదులకు స్పందించి జరిమానాలు వసూలు చేయాల్సిన విజిలెన్స్ నామమాత్రంగా కొన్ని ఫిర్యాదులకు మాత్రమే కేసులు నమోదు చేసి, భారీగా జరిమానాలు వసూలు చేయాల్సిన పెద్ద పెద్ద కేసుల విషయంలో అందినంత దండుకుని వౌనం వహిస్తున్నట్టు తెలిసింది. విజిలెన్స్ వేటకు చిన్నా చితక వ్యాపారస్తులు, కొత్తగా భవనాలు నిర్మిస్తున్న యజమానులే బలవుతున్నారు. బల్దియాలోనే అక్రమాలకు పాల్పడుతున్న వారిని, బల్దియా ఖాజానాకు చేరాల్సిన నిధులను జేబుల్లో నింపుకుంటున్న వారిని, కాంట్రాక్టు కార్మికుల జీతాలను ఎగ్గొట్టి పారిపోయే కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విజిలెన్స్ నిర్వీర్యమేపోతుంది. గ్రేటర్ గత కొంతకాలంగా వాహనాల పెట్రోల అడ్డదారిన బ్లాక్ మార్కెట్‌కు చేరుతున్నా, దీన్ని అరికట్టడంలో విజిలెన్స్ తీసుకుంటున్న చొరవ అంతంతమాత్రమే కాగా, పైగా అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుని వదిలేసినట్టు సమాచారం. దీంతో పాటు గ్రేటర్ చీఫ్ ట్రాన్స్‌పోర్టు సెక్షన్(సిటివో)లోని పలు వాహనాల కాంట్రాక్టర్లతో మామూళ్లను కుదుర్చుకుని వారి అక్రమాలకు అండగా నిలుస్తోందన్న వాదనా లేకపోలేదు. గతంలో సెక్యూరిటీ సిబ్బంది జీతాలు ఎగ్గొట్టి, సిబ్బంది పిఎఫ్ డబ్బును లక్షల్లో కాజేసిన సెక్యూరిటీ ఏజెన్సీకే రెండురోజుల క్రితం మళ్లీ కాంట్రాక్టును అప్పగించటం అధికారుల అవినీతికి నిదర్శన్మన్న ఆరోపణలకు సమాధానం లేదు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కు..!
గ్రేటర్ హైదరాబాద్ బల్దియా ప్రధాన కార్యాలయం మొదలుకుని, సర్కిల్ కార్యాలయాల భధ్రత కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కాంట్రాక్టర్లు, స్వీపింగ్ కాంట్రాక్టర్లు, రవాణా నిమిత్తం వివిధ వాహనాల కాంట్రాక్టు పొందే వారితో విజిలెన్స్ మిలాఖత్ అయి, వారి అక్రమాలకు అండగా నిలుస్తోందన్న వాదనలూ ఉన్నాయి. గత సంవత్సరం గ్రేటర్ బల్దియా ప్రధాన కార్యాలయం భద్రత నిమిత్తం కాంట్రాక్టు పొందిన సంస్థతో విజిలెన్స్ అధికారులకున్న సంబంధాలు నేడు కార్మికుల పొట్టలు గొట్టేందుకు కారణమయ్యాయి. గత సంవత్సరం సెక్యూరిటీ ఏజెన్సీ మొత్తం 75 మందిని నియమించి సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఈ కాంట్రాక్టు పొందిన సంస్థలు విజిలెన్స్‌ను మేనేజ్ చేసుకుని సగం మందిని నియమించింది. గార్డులు, సెక్యూరిటీ ఆఫీసర్లకు కాంట్రాక్టరు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారంటూ కొందరు గార్డులు మొర బెట్టుకుంటే, ఇచ్చినంత పుచ్చుకుని పని చేయాల్సిందేనంటూ విజిలెన్స్ అధికారులు దబాయించటం గమనార్హం.
సాటి ఉద్యోగులకు సైతం..!
కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలపై సైతం విజిలెన్స్ అధికారులు కనీసం సానుభూతితో వ్యవహరించటం లేదు. విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కేటాయించే అంశంలో కూడా విజిలెన్స్ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలున్నాయి. ఈ రకంగా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ సాటి ఉద్యోగి కుటుంబ సభ్యులేనన్న విషయాన్ని కూడా మరిచి నిలువుదోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. వారి సర్ట్ఫికెట్ల విచారణ వంటి అంశాలను కారణాలుగా చూపుతూ ఒక్కో దరఖాస్తుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు సుమారు రూ. 40 నుంచి 60వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది.

కట్టుదిట్టంగా గ్రేటర్ చట్టం అమలు.. బల్దియా ఆస్తుల పరిరక్షణ..
english title: 
greater

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>