ఖైరతాబాద్, సెప్టెంబర్ 15: సమాజంలో దళితులు అగ్రభాగాన ఉండాలంటే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కల్గి ఉండాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు.
ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ హైదరాబాద్ మాలమహానాడు ఆధ్వర్యంలో గ్రేటర్ అధ్యక్షుడు సాయిగిరి అధ్యక్షతన అసెంబ్లీ, నగర, డివిజన్, బస్తీల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూపూడి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం సమస్యలతో అల్లాడుతుందని, స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎందరో దిగ్గజాలను ఎదుర్కొన్న అంబేద్కర్ స్ఫూర్తితో, ఆలోచనలతో ప్రస్తుతం రాష్ట్రంలో దళితులందరూ సమస్య పరిష్కారానికి ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. దళితుల ఐక్యత కోసం అందరూ కలిసి దళిత అమరుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, షరీష్, తదితరులు పాల్గొన్నారు. 180 మంది సభ్యులతో నగర నూతన కార్యవర్గాన్ని నియమించారు.
సమాజంలో దళితులు అగ్రభాగాన ఉండాలంటే అంబేద్కర్ ఆలోచన
english title:
jupudi
Date:
Monday, September 16, 2013