వనస్థలిపురం, సెప్టెంబర్ 15: ఎల్‌బినగర్ నియోజకవర్గంలో నెలకొల్పిన గణేశ్ మండపాల వద్ద భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మన్సురాబాద్, వనస్థలిపురం, కర్మన్‌ఘట్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.రాంమోహన్‌గౌడ్ పూజలను నిర్వహించారు. హస్తినాపురం నార్త్‌కాలనీలో ఏర్పాటు చేసిన గణేశుని వద్ద అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గజ్జెల సుష్మ మధుసూదన్‌రెడ్డి, ఏరియా కమిటీ సభ్యులు పల్లం శ్రీనివాస్, నాగేశ్వర్‌రావు, కాలనీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ పాల్గొన్నారు. వనస్థలిపురం డివిజన్ ఎన్‌జివోస్ కాలనీ ఆర్‌ఎస్‌ఎస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన గణేషునికి బిజెపి నాయకులు బద్దం బాల్‌రెడ్డి పూజలు నిర్వహించారు. గణేశ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి రంగారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ యూత్ ఇన్‌చార్జి మాదవరం నర్సింగ్‌రావు, గిరికుషి పూజలు నిర్వహించారు. హుడా సాయినగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద అన్నదానం నిర్వహించారు.
శంకర్‌పల్లి: పండుగలు మన దేశ సంస్కృతిని పెంపొందిస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం అన్నారు. గణేష్‌నగర్‌లో చైతన్య యువజన సంఘం ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి ఆయన ఆదివారం పూజలు చేసారు. గణేష్ నిమజ్జనం శాంతియుతంగా చేసుకోవాలని, మత సామరస్యం పాటించాలన్నారు. టిడిపి నేతలు అశోక్, సంధ్యారాణి, సర్పంచ్ శ్రీ్ధర్, ఉపసర్పంచ్ సంతోష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి: పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనాలు జోరుగా జరుగుతున్నాయి. పలు కాలనీల్లో వినాయక మండపాల వద్ద శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఎం.బిక్షపతియాదవ్, కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, అశోక్‌గౌడ్, రవీందర్ ముదిరాజ్, కె.శంకర్‌గౌడ్, నాగేందర్‌యాదవ్, ఆర్.సుజాతా నాగేందర్ పలు మండపాల వద్ద పూజల్లో పాల్గొన్నారు. చందానగర్‌లోని నాగార్జున గ్రామర్ స్కూలు వద్ద దుర్గ్భావాని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జి.రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్, ఎన్.కరుణాకర్‌గౌడ్, బిజెపి నేత ఆర్.నాగేశ్వర్‌గౌడ్, యూత్ సభ్యులు నిఖిలేష్ పాల్గొన్నారు.
కీసర: మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లోని గణనాథులు భక్తులచే విశేష పూజలు అందుకుంటున్నాయి. చీర్యాలలో ఏర్పాటు చేసిన గణనాథునికి టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.ప్రభాకర్‌గౌడ్ పూజలు నిర్వహించారు. నాగారం అన్నపూర్ణ కాలనీలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీసరలోని రామాలయం కల్యాణ మండపంలో ఏర్పాటు చేసని వినాయక మండపం వద్ద అన్నదానం నిర్వహించారు.
కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్.శ్రీనివాస్, వెంకటేశ్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ పాల్గొన్నారు.
షాబాద్: మండల పరిధిలోని చందనవెల్లిలో ఆదివారం గణేష్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో కోలాటాలు, భజనలు చేస్తూ చందనవెల్లి సమీపంలోని చెరువులో గణేశుని నిమజ్జనం చేసారు. సర్పంచ్ అనంతమ్మ, ఉపసర్పంచ్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌బినగర్ నియోజకవర్గంలో నెలకొల్పిన గణేశ్
english title:
gana nadhulu
Date:
Monday, September 16, 2013