జీడిమెట్ల, సెప్టెంబర్ 15: గ్రామాలకు సాధ్యమైనంత త్వరలో మంజీరానీటి సదుపాయాన్ని కల్పిస్తానని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని బౌరంపేట్ గ్రామం, ఇందిరమ్మ కాలనీలో నాలుగు బోర్‌సెట్ పంపులను స్థానిక ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌తో కలిసి సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. మండలంలోని నిజాంపేట్, బహద్దూర్‌పల్లి, బౌరంపేట్ గ్రామాలకు అతి త్వరలో మంజీరా నీటిని తీసుకువస్తానని తెలిపారు. జిహెచ్‌ఎంసి అధికారులతో చర్చించి 50 లక్షల నిధులను వెచ్చించి 12 నూతన బోర్‌లను వేయిస్తానని చెప్పారు. ఇందిరమ్మ కాలనీకి 76 ఎకరాల 37 గుంటల స్థలాన్ని కేటాయించగా అందులో రెండున్నర ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని, వెంటనే అధికారులతో మాట్లాడి ఆక్రమణకు గురైన స్థలాన్ని కాపాడతామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మంగమ్మ, ఎంఆర్‌ఓ లక్ష్మినారాయణ, ఎండిఓ వెంకటరాజ్యం, ఆర్‌ఐ శ్రీనివాస్, గ్రామ ఇవో ఉషారాణి, నాయకులు యాదిరెడ్డి, సాల్మన్‌రాజు, మల్లారెడ్డి పాల్గొన్నారు.
మేదర సంఘం సభ్యులు ఏకతాటిపై ఉండాలి
బహద్దూర్‌పల్లి మేదర సంఘం కమిటీ హాల్ అదనపు గదుల కోసం ఎంపి నిధుల నుండి 10 లక్షలతో పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్‌తో కలిసి మంత్రి సర్వే సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం గ్రామ శివారులో గణపతి సచ్చిదానంద స్వామీజీ, రోటరి రక్షిత మంచినీటి పథకం, జయలక్ష్మి మాతా మాతృ మండలి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ ఏర్పాటు చేసిన సురక్షిత నీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. సర్పంచ్ దాబా శ్రీనును కాంగ్రెస్ పార్టీలో చేరాలని సర్వే సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాబా శ్రీను, నాయకులు యాదగిరి, సత్యనారాయణ, గౌరీశంకర్, బాలరాజు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిక
అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ అన్నారు. ఆదివారం జగద్గిరిగుట్టకు చెందిన టిడిపి నేత, రంగారెడ్డి జిల్లా బిసి సంఘర్షణ సమితి అధ్యక్షుడు జెకె శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్‌గౌడ్, అరుణ్‌గౌడ్, సత్తయ్య, హరికృష్ణ, నర్సింహ, ముత్తయ్య, కుమార్, జావేద్, రాజేశంగౌడ్, యాదగిరి, దుర్గేశ్ పాల్గొన్నారు.
గ్రామాలకు సాధ్యమైనంత త్వరలో మంజీరానీటి
english title:
manjeera
Date:
Monday, September 16, 2013