గుడివాడ, సెప్టెంబర్ 17: గుడివాడ పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమ నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. 48 రోజులుగా సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నెహ్రూచౌక్ సెంటర్లో రోడ్డుపైనే దైవ ప్రార్థనలు చేశారు. ప్రార్థనలో ఫాదర్ ఐఎం స్వామినాథన్, ఫాదర్ పి విజయ్, బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా తదితరులు పాల్గొన్నారు. బేతవోలుకు చెందిన ఎఇ గుడ్మెన్ సీఎస్ఐ చర్చి సభ్యులు ర్యాలీ నిర్వహించి నెహ్రూచౌక్లో ధర్నా చేశారు. చర్చి పాస్టర్ ఇజ్రాయేల్ పాల్గొన్నారు. ఆర్సీఎం, హోలీక్రాస్ పాఠశాలల విద్యార్థులు జై సమైక్యాంధ్ర నినాదాలతో పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేశారు. నెహ్రూచౌక్లో మానవహారం నిర్మించారు.
గుడివాడ పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమ నిరసనలు రోజురోజుకూ
english title:
gudivada
Date:
Wednesday, September 18, 2013